Intinti Gruhalakshmi 18 Aug Today Episode : తులసి కోసం హోటల్ లోనే కొట్టుకున్న నందు, సామ్రాట్.. తులసిని సామ్రాట్ పెళ్లి చేసుకుంటాడా?

Authored By Varun G | The Telugu News | Updated on : 18 August 2022, 9:30 am

Intinti Gruhalakshmi 18 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్  ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 ఆగస్టు 2022, గురువారం ఎపిసోడ్ 714 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి అలల ధాటికి కొట్టుకుపోయిందేమో అని సామ్రాట్ భయపడుతుండగా ఇంతలో తులసి వస్తుంది. రెండు మొక్కజొన్న కంకులను పట్టుకొని వస్తుంది. తులసిని చూసి సామ్రాట్ కు కోపం వస్తుంది. షట్ అప్ అంటాడు. మీకోసం నేను ఎంతగా వెయిట్ చేశానో తెలుసా? మీ బాధ్యత నాది. మిమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు ఏదైనా అయితే మీ ఫ్యామిలీకి నేను ఏం సమాధానం చెప్పాలి అని అరుస్తాడు సామ్రాట్. తర్వాత మొక్కజొన్న కంకులు తేవడానికి నేను వెళ్లాను అంటుంది తులసి. దీంతో సారీ.. తప్పు నాదే అంటాడు సామ్రాట్.

intinti gruhalakshmi 18 august 2022 full episode

intinti gruhalakshmi 18 august 2022 full episode

తర్వాత ఇద్దరూ కలిసి మొక్క జొన్న కంకులు తింటారు. ఇద్దరూ మొక్కజొన్న కంకులు తింటూ ఉండటం నందు, లాస్య ఇద్దరూ చూస్తారు. నందుకు సామ్రాట్ మీద తీవ్రమైన కోపం వస్తుంది. కట్ చేస్తే అంకిత.. ప్రేమ్ విషయంలో టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రేమ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తనకు అర్థం కాదు. ఇక ఎవరు ఏం చెప్పినా నేను వినను అని ప్రేమ్ అనేసరికి.. చూడబోతే పరిస్థితి చేయి దాటినట్టే అనిపిస్తోంది అని అనుకుంటుంది అంకిత. నేను శృతితో మాట్లాడినా ఏం ఉపయోగం ఉండదు. ఈ సమస్యను సాల్వ్ చేసే కెపాసిటీ ఒక ఆంటీకే ఉంది అని అనుకుంటుంది. ఇంతలో అంకితకు ఫోన్ వస్తుంది. తన సూపర్ వైజర్ ఫోన్ చేస్తాడు. అంకిత నువ్వు వెంటనే అదిలాబాద్ రావాలి అంటాడు. దీంతో ఇప్పటికిప్పుడు అదిలాబాద్ రావాలంటే కష్టం సార్ అంటుంది.

దీంతో బయట సీజనల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. నువ్వు రావాల్సిందే అంటాడు. దీంతో సరే సార్.. ఇప్పుడే బయలుదేరుతాను అంటుంది. ఇంతలో అభి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. దీంతో సీజనల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే నన్ను ఆదిలాబాద్ లో మెడికల్ క్యాంప్ కు పంపిస్తున్నారు అంటుంది.

Intinti Gruhalakshmi 18 Aug Today Episode : తులసికి మల్లెపూలు గిఫ్ట్ గా ఇచ్చిన లాస్య

నందు జనరల్ గా వైజాగ్ వచ్చిన ఏ కపుల్ అయినా బీచ్ కు వచ్చి ఎంజాయ్ చేసి గాని వెళ్లరు నందు అని సామ్రాట్, తులసి ముందు ఏదేదో వాగుతుంది లాస్య. మేడమ్ మీరు ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది లాస్య. మనిద్దరి కోసం పూలు తీసుకున్నాను అని మల్లెపూల దండ ఇస్తుంది లాస్య.

మీరు పెట్టుకుంటారా లేక.. నేను పెట్టనా అంటుంది లాస్య. దీంతో నాకు మల్లెపూలు ఇష్టం లేదు అంటుంది తులసి. దీంతో నాకు ఇష్టం లేదు కానీ.. ఆడవాళ్లు మల్లెపూలు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అని నందు చెప్పారు అంటుంది లాస్య. దీంతో నాకు వద్దు అంటుంది తులసి.

ప్రేమతో ఇస్తుంది కదా.. కాదనడం ఎందుకు తులసి గారు అంటాడు సామ్రాట్. దీంతో చూశారా.. సామ్రాట్ గారు కూడా మల్లెపూలకే ఓటేశారు అని తన మెడలో మల్లెపూలను కడుతుంది లాస్య. మరోవైపు శృతి.. ప్రేమ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది.

నువ్వు తప్పు చేశావేమో.. ప్రేమ్ విషయంలో ఒకసారి ఆలోచించాల్సింది అంటుంది కౌసల్య. తర్వాత తులసి, సామ్రాట్ ఇద్దరూ హోటల్ కు వెళ్తారు. అదే హోటల్ కు నందు, లాస్య ఇద్దరూ వస్తారు. నాకు చిరాకుగా ఉంది నందు.. నాకు తినాలనిపించడం లేదు అంటుంది.

దీంతో నువ్వు చూస్తూ ఉండు. నేను తింటా అంటుంది లాస్య. తర్వాత అదే హోటల్ లో నందు, సామ్రాట్ ఇద్దరూ లొల్లి పెట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి