Intinti Gruhalakshmi 19 Nov Today Episode : పరందామయ్య టెన్షన్ తో ఆరోగ్యం పాడుచేసుకుంటాడా? తులసి మీద కోపంతో అనసూయ ఏం చేస్తుంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 19 Nov Today Episode : పరందామయ్య టెన్షన్ తో ఆరోగ్యం పాడుచేసుకుంటాడా? తులసి మీద కోపంతో అనసూయ ఏం చేస్తుంది?

 Authored By gatla | The Telugu News | Updated on :19 November 2022,9:30 am

Intinti Gruhalakshmi 19 Nov Today Episode :  ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 నవంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 794 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వద్దు అనసూయ.. ఇక్కడి నుంచి వెళ్లిపో అని బతిమిలాడుతాడు పరందామయ్య. కానీ.. అనసూయ వినదు. నువ్వు భర్తగా, అప్పుడు చేతకానివాడివి అంటుంది అనసూయ. నెలకు వచ్చిన 400 జీతంతో మీరు చేసిందేంటి. నేను నానా సంకలు నాకి ఆ జీతం డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. మీకు చేతకాని వాళ్లు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంటూ ప్రశ్నిస్తుంది. నీ గురించి తెలిసే.. నీ త్యాగం తెలిసే కదా.. నేను సైలెంట్ గా ఉంది. నన్ను చాలామంది హేళన చూసినా కూడా ఎందుకు పట్టించుకోలేదు. దానికి కారణం నీ త్యాగమే అంటాడు పరందామయ్య.

intinti gruhalakshmi 19 november 2022 full episode

intinti gruhalakshmi 19 november 2022 full episode

నువ్వు ఇక ఒక్క మాట కూడా మాట్లాడుకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు పరందామయ్య. కానీ.. అనసూయ మాత్రం వినదు. పిచ్చెక్కిన దానిలా ప్రవర్తిస్తుంది. ఎంత చెప్పినా వినదు. నీ భర్తగా చెబుతున్నాను వెళ్లిపో అంటే వినదు అనసూయ. ఎందుకు అత్తయ్య ఇలా చేస్తున్నారు.. అని తులసి అన్నా కూడా అనసూయ వినదు. మీరు సంపాదించిన దానితోనే కుటుంబం బతికిందా. నా కొడుకు అప్పుడు ఉద్యోగం చేసి సంపాదించాడు కాబట్టే మన కుటుంబం మంచిగా బతికింది. కానీ.. మీరు ఏనాడూ నందును ఒక కొడుకుగా చూశారా అంటుంది అనసూయ.

మీరు చెప్పింది నిజమే అత్తయ్య. మీరు, మీ అబ్బాయి ఇద్దరూ కలిసి కుటుంబ బాధ్యత తీసుకున్నారు కానీ.. మామయ్య కూడా కష్టపడ్డారు అంటుంది తులసి. కానీ.. తులసి మాట వినదు అనసూయ.

ఎవ్వరు మాట్లాడినా వాళ్ల మీద విరుచుకుపడుతుంది అనసూయ. ప్రేమ్ ఏదో అంటే ప్రేమ్ ను కొడుతుంది. ఇల్లు మొత్తం చిందరవందర చేస్తుంది. ఇక నుంచి మీరు నా మాట మాత్రమే వినాలి. ఇంట్లో ఒక మూలన కూర్చోండి అంటుంది అనసూయ.

Intinti Gruhalakshmi 19 Nov Today Episode : నేను ఎక్కడికీ రానని తెగేసి చెప్పిన పరందామయ్య

దీంతో నేను రాను.. నేను ఆ ఇంటికి రాను. నేను ఒంటరిగా మిగిలాను. నాకంటూ ఏం లేదు. ఫుట్ పాత్ మీద ఉంటాను. గుడి మెట్ల మీద అడుక్కుంటాను. చెప్పులు పాలిస్ చేసి తింటాందుకు సంపాదించుకుంటాను.

నీ దగ్గర ఉండటం కంటే అదే ఎక్కువ గౌరవం ఉంటుంది. నీ కొడుకు ఇంటికి వెళ్లు.. నేను రాను. నేను ఆ ఇంటికి అస్సలు రాను. ఈ లోకంలో డబ్బుకే ఎక్కువ విలువ ఉంది అంటూ ఆవేశపడతాడు.

దీంతో పరందామయ్యకు కళ్లు తిరుగుతాయి. కుర్చీలో కూర్చోబెడతారు. మీ నాటకం చాలు ఇక ఇంటికి వెళ్దాం పదా అంటుంది అనసూయ. దీంతో అత్తయ్య షు.. ఆపండి. మీకు మాత్రమే కోపం ఉందా. మీరు ఇంకో మాట మాట్లాడితే అస్సలు బాగుండదు.

చూసుకుందాం పదా.. ఇక చూసుకుందాం. నీ కంటే ఎక్కువగా నేను అరవగలను.. అని అనసూయకు వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత నాకు మా మామయ్య.. తండ్రి కంటే ఎక్కువ అంటుంది.

మీలాంటి మామయ్య ఎవరికి ఉంటారో.. వాళ్లు ఈ ప్రపంచంలోనే అదృష్టవంతులు అంటుంది తులసి. మీ కూతురు ఇంకా బతికే ఉంది మామయ్య అంటుంది తులసి. తండ్రికి అండగా నిలబడటానికి.. కూతురు కొడుకుగా ఉండాల్సిన అవసరం లేదు. కూతురు కూతురుగానే ఉండొచ్చు అంటుంది.

నా మామయ్యకు నేను ఉంటే చాలు అంటుంది తులసి. ఇప్పుడు నా ఇల్లు నా మామయ్యకు ఇస్తాను అంటుంది తులసి. దీంతో నాకు మీ ఇంట్లో చోటిస్తావా తల్లి. మా ఇంటికి పంపవు కదా అంటాడు.

దీంతో అస్సలు పంపను. ఆ ఇంటికి మిమ్మల్ని చూసుకునే అదృష్టం లేదు. ఇక నుంచి ఇది మీ ఇల్లు.. మన ఇల్లు. ఇది చిన్న ఇల్లు అంటుంది తులసి. ఇది చిన్న ఇల్లు అంటుంది తులసి. నీ ఇల్లు సరేనా అంటుంది తులసి.

నన్ను ఆయన వద్దనుకున్నప్పుడు.. నేను ఆయనకు ఏం కానప్పుడు తులసి దగ్గరనే ఉండనివ్వు. అందరూ కలిసి గంగలో దూకనీ.. నాకు సంబంధమే లేదు అంటుంది అనసూయ. వెంటనే నన్ను లోపలికి తీసుకెళ్లు అంటాడు పరందామయ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది