Intinti Gruhalakshmi 19 Oct Today Episode : దివ్య, విక్రమ్‌కు షాకిచ్చిన జాను.. తులసి ఇంటికి వచ్చిన కోరియర్‌లో బాంబు.. అది పేలి అందరూ చనిపోబోతున్నారా?
Intinti Gruhalakshmi 19 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 అక్టోబర్ 2023, గురువారం ఎపిసోడ్ 1079 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 24 గంటలు అత్తయ్య, మామయ్యను చూసుకుంటూ ఉండు. ఎవరు ఎక్కడ ఉన్నారో చూసి వాళ్లకు కావాల్సినవి ఇవ్వు అని అంటుంది తులసి. దీంతో తులసి ఎందుకు ఇంత టెన్షన్ పడుతోంది అని పరందామయ్య, అనసూయ, నందు అనుకుంటారు. ఖచ్చితంగా తులసి ఎందుకో, ఏదో విషయం మీద టెన్షన్ పడుతోంది అని అనుకుంటాడు నందు. మరోవైపు కథ ఏంటి ఇలా అడ్డం తిరుగుతోంది అని రాజ్యలక్ష్మీ.. జానుతో అంటుంది. ఇప్పుడు సంబంధం కూడా తీసుకొచ్చారు అత్తయ్య అంటే.. సంబంధం తీసుకొచ్చింది అందుకు కాదు.. నా మనసులో నీకు స్థానం లేదు అని చెప్పేందుకే విక్రమ్.. ఈ పని చేశాడు అని చెబుతుంది రాజ్యలక్ష్మి. ఇదంతా దివ్య వేసిన మాస్టర్ ప్లాన్. దివ్య కూడా ఈ మధ్య బావ గురించి ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటోంది. దివ్యకు నా మీద అంత నమ్మకం ఉన్నప్పుడు నా మీద నాకు ఎంత నమ్మకం ఉండాలి అత్తయ్య. ఎప్పుడైతే దివ్యక్క నా చెంప పగులగొట్టిందో అప్పుడే తన పతనానికి ముహూర్తం పెట్టుకుంది. ఈ జాను అవమానాన్ని భరించదు అంటుంది.
నువ్వు దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జాను. దివ్య విక్రమ్ ను కొంగున కట్టేసుకున్నా కూడా వాడిని నావైపు తిప్పుకునే అస్త్రం నా దగ్గర ఉంది. నువ్వేం టెన్షన్ పడకు. కానీ.. మీ అమ్మానాన్నలే కొంచెం టెన్షన్ పడుతున్నారు అంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు రాత్రి అయినా నిద్రపోకుండా బయట కాపలాగా ఉంటుంది తులసి. పరందామయ్య, అనసూయ, నందు అందరూ నిద్రపోతున్నా.. తను మాత్రం నిద్రపోకుండా ఓ కర్ర పట్టుకొని ఇంటి ముందు నిలబడి కాపలా కాస్తూ ఉంటుంది. దాన్ని వీడియో తీసి చూసుకొని లాస్య, రత్నప్రభ ఇద్దరూ నవ్వుకుంటారు. తన వాళ్లను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతోంది. చేతుల్లో కర్ర పట్టుకొని దిక్కులేని దానిలా అటూ ఇటూ చూస్తోంది. బిక్కుబిక్కుమంటూ బిక్కమొహం వేసుకొని టెన్షన్ పడుతోంది. ఇదే కదా నాకు కావాల్సింది. ఇదే కదా నేను చూడాలనుకుంది. శభాష్ లాస్య సాధించావు. ఇక మిగిలింది.. హనీని అప్పగించేలా చేయడమే. త్వరలోనే అది కూడా జరుగుతుంది అంటుంది లాస్య. దేనికైనా టైమ్ కలిసిరావాలి అని అంటుంది లాస్య.
Intinti Gruhalakshmi 19 Oct Today Episode : రాత్రంతా నిద్రపోకుండా రోజూ ఇంటి బయట నిలబడుతున్న తులసి
కట్ చేస్తే తెల్లవారుతుంది. రాత్రంతా నిద్రపోకుండా ఉండేసరికి తులసికి నీరసం వస్తుంది. డైనింగ్ టేబుల్ మీదనే నిద్రపోతూ ఉంటుంది తులసి. ఇంతలో పరందామయ్య, అనసూయ వచ్చి అమ్మ తులసి అని లేపబోయేసరికి ఎవరు.. ఎవరది అంటూ గబాలున లేసి అంటుంది. ఏంటి తులసి రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదా అంటే ఏదో ఆలోచిస్తూ అవును అత్తయ్య.. తలనొప్పితో నిద్రపట్టలేదు అంటుంది తులసి.
కానీ.. తులసి వాలకం చూసి నందుకు డౌట్ వస్తుంది. తులసి ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అని అనుకుంటాడు నందు. మళ్లీ రాత్రి అవుతుంది. రాత్రి కాగాన తులసి ఇంటి ముందుకు వచ్చి కూర్చొని అక్కడే నిద్రపోతూ ఉంటుంది. డౌట్ వచ్చి లేచి బయటికి వచ్చి తులసి వరండా మీద పడుకోవడం చూసి షాక్ అవుతాడు. తులసి ఏమైంది అని అడుగుతాడు. ఇప్పటికైనా నిజం చెబుతావా? ఎందుకు నువ్వు టెన్షన్ లో ఉన్నావు. ఎందుకు సీసీ కెమెరాలు పెట్టించావు. ఎందుకు పగలు పూట కూడా నిద్రపోతున్నావు. ఎందుకు అర్ధరాత్రి పూట ఇలా ఒంటరిగా కూర్చున్నావు. ఏం జరుగుతోంది. గత రెండు వారాల నుంచి నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఇంట్లో వాళ్లను పరాయివాళ్లుగా చూస్తున్నావు అంటాడు నందు.
దీంతో అనుమానించడం ఆపేస్తారా అంటుంది తులసి. నాకు సంబంధించిన ప్రతి విషయం నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది తులసి. దీంతో ఇదివరకు వేరు.. ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏ సమస్య ఉన్నా ఇద్దరం కలిసే పరిష్కరించుకుంటున్నాం కదా అంటాడు నందు. దీంతో నా సమస్యలను నేనే పరిష్కరించుకుంటున్నా. ఎవ్వరి మీదా ఆధారపడలేదు.. ఆధారపడను కూడా అంటుంది తులసి.
నా టెన్షన్ ను కారణం ఏంటి అంటే అంటూ నేను కంగారు పడుతున్నాను అంటుంది తులసి. ఇష్యూ సెటిల్ అయిందన్నావు కదా మళ్లీ ఏంటిది. అబద్ధం చెప్పావా అంటే అవును అబద్ధం చెప్పాను అంటుంది తులసి. మీరు నన్ను నమ్మాలి అంటే ఇలాంటి సమాధానమే కదా మీకు కావాల్సింది. నా మనసులోని మాట చెబుతున్నాను. నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం. హనీ జీవితాన్ని ఎలా చక్కదిద్దాలా అని నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు అంటుంది తులసి. దాని కోసం నిద్రపోకుండా ఆలోచించాలా అని అనుకుంటాడు నందు.
మరోవైపు జానుకు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాడు విక్రమ్. అందరూ వస్తారు. పెళ్లి సంబంధానికి వచ్చిన వాళ్లు అడిగిన ఏ ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పదు జాను. అన్నీ తింగరి సమాధానాలు చెబుతుంది. పెళ్లి కొడుకును చూడు అంటే మా బావనే చూస్తా. నాకు మా బావ అంటే చాలా ఇష్టం అంటుంది జాను.
మీ పేరేంటండి అని అబ్బాయి అడిగితే విక్రమ్ అంటుంది జాను. ప్రతి విషయాన్ని విక్రమ్ తో ముడిపెడుతుంది. దీంతో పెళ్లి సంబంధానికి వచ్చిన వాళ్లకు చాలా కోపం వస్తుంది. కావాలని ఇదంతా చేస్తోందని దివ్యకు అర్థం అవుతుంది.
అమ్మాయి బాగుంది.. ఆస్తి ఉంది.. అమ్మాయి ఏం చేస్తే మనకెందుకు అని మగ పెళ్లి వాళ్లు అనుకుంటారు. కానీ.. జాను ఆగడాలకు అంతూపంతూ ఉండదు. దీంతో రాజ్యలక్ష్మి, జాను తల్లిదండ్రులకు చాలా సంతోషం వేస్తుంది. ఆ తర్వాత రా బావా అంటూ తనను రూమ్ లోకి తీసుకెళ్తుంది జాను. దీంతో పెళ్లికొడుకుకు కోపం వచ్చి వెళ్లిపోతాడు. పెళ్లి వాళ్లు కూడా అందరూ వెళ్లిపోతారు. భలే సంబంధం అని తిట్టి వెళ్లిపోతారు.
మరోవైపు తులసికి ఫోన్ వస్తుంది. లాస్య ఫోన్ చేస్తుంది. చెప్పు అంటుంది తులసి. ఏంటి అంత కూల్ గా ఉన్నావు. నా ఫోన్ కాల్ రాగానే నీకు టెన్షన్ రావడం లేదా అని అడుగుతుంది లాస్య. టెన్షన్ ఎందుకు నీ వన్నీ ఉత్తుత్తి కాల్స్ కదా అంటుంది. అవునా.. ఇంకాసేపట్లో ఆ ఇంట్లో ఎవ్వరూ మిగలరు.. నీతో సహా అంటుంది లాస్య. దీంతో మళ్లీ మొదలుపెట్టావా అంటుంది తులసి. మీ ఇంటికి కోరియిర్ వచ్చిందా లేదా అని అడుగుతుంది. దీంతో అవును అంటుంది.
కట్ చేస్తే నాకు బావ అంటేనే ఇష్టం. ప్రేమ.. చచ్చేంత ప్రేమ అని అందరి ముందు చెప్పేస్తుంది జాను. దీంతో విక్రమ్, దివ్య షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.