Intinti Gruhalakshmi 19 Sep Today Episode : సామ్రాట్ కారుకు భారీ యాక్సిడెంట్.. హనీ తలకు తీవ్రగాయాలు.. హనీకి ప్రాణాపాయం తప్పుతుందా?

Authored By Varun G | The Telugu News | Updated on : 19 September 2022, 9:00 am

Intinti Gruhalakshmi 19 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 సెప్టెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 741 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొగుడులు అందరూ పెళ్లాలకు చాలా ఈజీగా అబద్ధాలు చెప్పి పెళ్లాలను నమ్మించేస్తుంటారు. అది నాకు ఎప్పుడు చేతనవుతుందో.. దొరికిపోయేలా ఉన్నాను అని అనుకుంటాడు నందు. తులసి కానీ కలలోకి వచ్చిందా అని అడుగుతుంది లాస్య. దీంతో ఎందుకు వస్తుంది అని అడుగుతాడు నందు. దీంతో ఎందుకా. పండక్కి చీర కొనిపెడతావేమో అని అడగానికి వచ్చి ఉంటుంది. లేకపోతే ఏంటి.. మీ మాజీ భార్య నీ కలలోకి ఎందుకు వస్తుంది. నువ్వు తలుచుకుంటేనే కదా వచ్చేది అని చెప్పి త్వరగా రెడీ అవ్వు ఆఫీసుకు వెళ్లాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య. మరోవైపు సామ్రాట్ కోసం రెడీ అయి వెయిట్ చేస్తూ ఉంటుంది తులసి. ఈ పాటికి సామ్రాట్, తులసి కారులో వెళ్లి ఉంటారు. నిజంగానే యాక్సిడెంట్ జరిగి ఉంటుందా. అభికి ఫోన్ చేస్తే తులసి వెళ్లిందో లేదో తెలుస్తుంది అని అనుకుంటాడు. వెంటనే అభికి ఫోన్ చేస్తాడు నందు.

intinti gruhalakshmi 19 september 2022 full episode

intinti gruhalakshmi 19 september 2022 full episode

మీ అమ్మ ఏం చేస్తుందిరా అని అడుగుతాడు నందు. దీంతో మీరు నాతో మాట్లాడటానికి ఫోన్ చేశారా.. లేక అమ్మతోనా అంటాడు. అలా కాదు.. సామ్రాట్ గారు ఏదో మీటింగ్ ఉందన్నారు. ఆఫీసుకు వెళ్లాలి. సామ్రాట్ గారు వచ్చి తులసిని పికప్ చేసుకుంటా అన్నారు అంటాడు నందు. దీంతో మామ్.. సామ్రాట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆయన రాలేదు అంటాడు అభి. దీంతో తులసి సేఫ్ అన్నమాట. మరి.. సామ్రాట్ పరిస్థితి అని అనుకుంటాడు నందు. కట్ చేస్తే తులసికి ఫోన్ చేస్తాడు సామ్రాట్. కాస్త లేట్ అయింది అంటాడు సామ్రాట్. ఇంతలో హనీ వస్తుంది. రోజూ తాతయ్యతో వెళ్లి బోర్ కొడుతోంది. ఈరోజు నువ్వే నన్ను స్కూల్ లో దించు అని అంటుంది హనీ. ఇవన్నీ తులసి వింటుంది. ఈరోజు  నువ్వు తాతయ్యతో వెళ్లు.. రేపు నేను దింపుతాను అంటాడు సామ్రాట్. దీంతో ఏదీ ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు అంటుంది హనీ. తులసి ఆంటీ… పిల్లలను ఎలా పెంచాలో మా నాన్నకు చెప్పొచ్చు కదా అని అడుగుతుంది హనీ. దీంతో సరే అంటుంది తులసి. మీరు హనీని స్కూల్ లో దించి ఇక్కడికి రండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది తులసి.

తర్వాత హనీని కారులో ఎక్కించి కారు స్టార్ట్ చేస్తాడు. తనను కారులో తీసుకెళ్తూ తనతో జోక్స్ చేస్తాడు సామ్రాట్. వద్దు నాన్న ఇక చాలు. ఎక్కువగా నవ్వొద్దట.. ఎంత ఎక్కువగా నవ్వితే.. అంతగా ఏడవాలట అంటుంది హనీ. ముందు నువ్వు స్పీడ్ పెంచు.. అంటుంది హనీ. దీంతో అలాగే అని చెప్పి స్పీడ్ పెంచుతాడు.

మరోవైపు సామ్రాట్ ఇప్పటికే కారులో బయలుదేరి ఉంటాడు. బ్రేకులు పనిచేయవు. ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ జరిగి ఉంటుంది అని అనుకుంటాడు నందు. ఇంతలో సామ్రాట్.. బ్రేకులు వేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ.. బ్రేక్ పడదు. బ్రేక్ ఫెయిల్ అయిందేమో అని అనుకుంటాడు నందు.

ఇప్పుడెలా అని అనుకుంటాడు. మరోవైపు సామ్రాట్ కారు బ్రేకులు తీసిన విషయం లాస్యకు కాని తెలిసిందా.. అని భయపడతాడు నందు. దేవుడా తెలియక తప్పు చేశాను. సామ్రాట్ కు ఏం కాకుండా చూడు. జీవితంలో ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయను అని అనుకుంటాడు నందు.

Intinti Gruhalakshmi 19 Sep Today Episode : చెట్టుకు ఢీకొన్న సామ్రాట్ కారు

ఇంతలో ఏమైంది నాన్న అని అడుగుతుంది. ఏం లేదు అంటాడు. ఎదురుగా కారు రావడంతో ఏం చేయాలో తెలియక వెంటనే కారు వెళ్లి చెట్టుకు ఢీకొంటుంది. దీంతో సామ్రాట్, హనీ ఇద్దరికీ తీవ్రగాయాలు అవుతాయి. ఈ విషయాన్ని వెంటనే తులసికి చెబుతారు. నందుకు కూడా తెలుస్తుంది.

వెంటనే తులసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. పాపకేం ప్రమాదం లేదు కదా డాక్టర్ అని బాబాయి.. డాక్టర్ ను అడుగుతాడు. దీంతో ప్రాణాపాయం ఏం లేదు అని అంటాడు డాక్టర్. సామ్రాట్ కు కూడా ఏం కాలేదు అంటాడు డాక్టర్. దీంతో బాబాయి ఊపిరి పీల్చుకుంటాడు.

లోపల సామ్రాట్ పడుకొని ఉండటం చూసి తులసి బాధపడుతుంది. ఇంతలో సామ్రాట్ కళ్లు తెరుస్తాడు. ఇప్పుడు ఎలా ఉందిరా అని అడుగుతాడు బాబాయి. దీంతో నాకేమైంది బాబాయి అని అడుగుతాడు సామ్రాట్. దీంతో ఏమైందో నీకు గుర్తు లేదా అని అడుగుతాడు బాబాయి.

ఏమైందో నీకు గుర్తు లేదా అని అడుగుతాడు. ఇంతలో తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తొస్తుంది. వెంటనే లేచి కూర్చొంటాడు. హనీ.. అని అరుస్తాడు. నా హనీ ఎక్కడ అని అడుగుతాడు. దీంతో దెబ్బలు తగిలాయి. ఐసీయూలో ఉంది. ట్రీట్ మెంట్ చేస్తున్నారు అని అంటుంది తులసి.

నేను వెంటనే చూడాలి అని లేచి ఐసీయూ దగ్గరికి వెళ్తాడు. నా హనీకి ఏం కాకూడదు అని అనుకుంటాడు సామ్రాట్. ఐసీయూ డోర్ దగ్గర్నుంచి తనను చూస్తాడు సామ్రాట్. వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతలో డాక్టర్ వస్తుంది. మీ పాపకు ఏం పర్వాలేదు.. అని అంటుంది డాక్టర్. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు.

ఆ తర్వాత హనీ దగ్గరికి వెళ్తారు. మీ నాన్న మంచోడు  కాదు.. నిన్ను సరిగ్గా చూసుకోవడం తెలియదు. నన్ను క్షమించమ్మా అని హనీతో మాట్లాడుతాడు సామ్రాట. హనీ ఇంకా స్పృహలోకి రాదు. మీరు ధైర్యంగా ఉంటేనే హనీకి ధైర్యం చెప్పగలరు అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి