Intinti Gruhalakshmi 21 Dec Today Episode : అనసూయ, పరందామయ్యకు ట్యాబ్లెట్లు పంపించిన తులసి.. రెస్టారెంట్ లో నందుకు అవమానం.. తులసి అతడి బిల్ పే చేస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 21 Dec Today Episode : అనసూయ, పరందామయ్యకు ట్యాబ్లెట్లు పంపించిన తులసి.. రెస్టారెంట్ లో నందుకు అవమానం.. తులసి అతడి బిల్ పే చేస్తుందా?

Intinti Gruhalakshmi 21 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 డిసెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 821 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాక్ మెన్ బాగవడంతో దాంట్లోని పాటను వింటారు సరస్వతి, తులసి. సరస్వతి పాడిన పాటను మళ్లీ విని తులసి, సరస్వతి చాలా సంతోషిస్తారు. అవును.. ఈ వాక్ మెన్ ఇక్కడికి ఎలా వచ్చంది అని అడుగుతుంది సరస్వతి. దీంతో నాకు అదే […]

 Authored By gatla | The Telugu News | Updated on :21 December 2022,9:30 am

Intinti Gruhalakshmi 21 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 డిసెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 821 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాక్ మెన్ బాగవడంతో దాంట్లోని పాటను వింటారు సరస్వతి, తులసి. సరస్వతి పాడిన పాటను మళ్లీ విని తులసి, సరస్వతి చాలా సంతోషిస్తారు. అవును.. ఈ వాక్ మెన్ ఇక్కడికి ఎలా వచ్చంది అని అడుగుతుంది సరస్వతి. దీంతో నాకు అదే అర్థం కావడం లేదు అంటుంది తులసి. ఇంతలో సామ్రాట్ వచ్చి అది దానంతట అదే రాదు కదా అంటాడు. మీకు ఇష్టమైన వాక్ మెన్ మీదగ్గరే ఉంది అంటాడు సామ్రాట్. చాలా సంతోషం బాబు. నా సంతోషమే కాదు.. నా బిడ్డ సంతోషాన్ని కూడా ఈ రూపంలో తీసుకొచ్చావు. ఈ వయసులో విడాకులు తీసుకున్నా నా బిడ్డ జీవితం ఏమైపోతుందో అని అనుకున్నా. ఆ కష్టం తెలియకుండా తన పెదాలపై చిరునవ్వు కనిపించేలా చేశావు. నిన్ను దేవుడు అనాలా.. ఇంకేమనాలో కూడా నాకు తెలియడం లేదు అంటుంది సరస్వతి.

intinti gruhalakshmi 21 december 2022 full episode

intinti gruhalakshmi 21 december 2022 full episode

కూర్చోండి కాఫీ తీసుకొస్తాను అంటుంది సరస్వతి. మీకు ఎలా థాంక్స్ చెప్పాలి అంటుంది తులసి. మీరు కూడా ఏంటి తులసి అంటాడు సామ్రాట్. మరోవైపు నేనేం చేసినా.. ఏం మాట్లాడినా నందు నా వైపే మళ్లాలంటే నేను ఏం చేయాలి అని అనుకుంటుంది లాస్య. నందు.. ఇంటర్వ్యూకు వెళ్లావు కదా.. రిజల్ట్ ఏమైంది అని అడుగుతుంది. దీంతో జాబ్ వచ్చి ఉంటే నేను ఇలా ఉండను కదా అంటాడు నందు. నీ జాబ్ గురించి మాట్లాడనులే. కనీసం ఇంటి విషయం అయినా మాట్లాడొచ్చా అంటుంది లాస్య. కంప్లయింట్ తప్పితే నాకేం పని లేదా. కారణం లేనిదే ఎవరి మీద అయినా ఎందుకు ఫిర్యాదు చేస్తాను. కరెంట్ బిల్లు కట్టాలి.. ఇంటర్నెట్ బిల్లు కట్టాలి.. ప్రాపర్టీ టాక్స్ కట్టాలి.. అంటూ అన్ని బిల్లుల లిస్టు చెబుతుంది. దీంతో ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు అంటాడు నందు. అభి, ప్రేమ్ లకు చెప్పొచ్చు కదా అంటాడు నందు.

చెప్పొచ్చు.. నిన్ను కాదని వాళ్లకు ఎలా చెప్పగలను.. అంటుంది. దీంతో నా పరిస్థితి కూడా తెలుసు కదా లాస్య. నాకు జాబ్ వచ్చే వరకు ఏదోలా నువ్వే మేనేజ్ చేయి.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు. మరోవైపు ఆఫీసులో బిజీగా ఉంటారు తులసి, సామ్రాట్.

నేను ఆఫీసుకు వచ్చింది పని చేయడానికి. అందరి దగ్గరికి వెళ్లి మీ గురించి తెలుసుకోవడానికి కాదు అంటుంది. ఆ తర్వాత మీరు అద్భుతమైన బహుమతిని ఇచ్చినందుకు థాంక్స్ అంటుంది తులసి. ఆడాళ్ల దగ్గర ఉన్న బలహీనత అదే. మనసులో ఉన్న అనుభూతిని దాచుకోవడం చేతగాదు.

కానీ.. మగాళ్లు మొండోళ్లు.. అస్సలు బయటపడరు. మనసులో ఏం దాచుకుంటారో అస్సలు బయటపడదు అంటుంది తులసి. దీంతో అందరు మగాళ్లను అంటున్నారా? లేక నన్నే అంటున్నారా? అంటాడు సామ్రాట్. దీంతో మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 21 Dec Today Episode : ట్యాబ్లెట్లు అయిపోయాయని టెన్షన్ పడ్డ అనసూయ

ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చింనందుకు నాకు రిటర్న్ గిఫ్ట్ ఏం ఇవ్వరా అంటాడు సామ్రాట్. అంటే పార్టీ లాంటిది అంటాడు. దీంతో నేను మీ రేంజ్ పార్టీ ఇప్పించలేను అంటుంది. కాకపోతే ఆ రోజు లాంటి రోజ్ మిల్క్ పార్టీ అంటుంది. దీంతో వామ్మో నేను మళ్లీ అలాంటి పద్మవ్యూహంలోకి వెళ్లలేను అంటాడు.

దీంతో లంచ్ కు బయటికి వెళ్దాం అంటుంది. మరోవైపు ట్యాబ్లెట్లు ఎన్ని ఉన్నాయో చూస్తుంది అనసూయ. రేపటితో టాబ్లెట్స్ అయిపోతాయి. వేసుకోవడానికి ఉండవు.. అంటుంది అనసూయ. దీంతో నందుకు చెప్పు అంటాడు పరందామయ్య. దీంతో వాడికి ఉద్యోగమే లేదు. మనకు ఇప్పుడు వాడు ఏం తెస్తాడు అంటుంది అనసూయ.

వాడికి ఉద్యోగం వస్తేనే మన కష్టాలు గట్టెక్కేది అంటుంది అనసూయ. అమ్మానాన్నలను తులసి దగ్గర ఉంచేయాల్సింది. నా దగ్గర ఉంచుకొని బాధపెడుతున్నా అని మనసులో అనుకుంటాడు నందు. మరి.. అభికో, ప్రేమ్ కో చెప్పలేకపోయావా అంటాడు పరందామయ్య.

దీంతో వాళ్లకు చెబితే అప్పో సప్పో చేసి తెస్తారు కానీ.. దాని కోసం వాళ్లు ఎంత బాధపడతారో అని అంటుంది. సరే వద్దులే. మనకు తిండి పెట్టడమే దండగ అంటాడు పరందామయ్య. వద్దులే.. రోజూ బాక్స్ తీసుకురా.. కానీ.. ఆ మందులు అలాగే ఉంచితే.. మందులు వేసుకుంటున్నాం అని అనుకుంటారు అంటాడు పరందామయ్య.

మరోవైపు తులసి నుంచి మందుల కొరియర్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు నందు. అందులో మందులు ఉంటాయి. నీ విలువ ఏంటో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది తులసి. థాంక్స్ మా అమ్మానాన్నల ప్రాణాలు కాపాడుతున్నావు అని అనుకుంటాడు నందు.

ఆ ట్యాబ్లెట్లు తీసుకెళ్లి మీ మందులు అంటాడు. దీంతో మా మందులు అయిపోయాయని నేను చెప్పలేదు కదా అంటాడు పరందామయ్య. వాడు మన మనసును ముందే తెలుసుకుంటాడండి అంటుంది అనసూయ. తులసి కూడా అంతే. టాబ్యెట్లు ఎప్పుడు అయిపోతాయి.. అని ముందే తెలుసుకొని తెప్పిస్తుంది అంటుంది.

దీంతో ఇప్పుడు పంపించింది కూడా తులసే.. నీ కొడుకుకు కొనే శక్తి లేదు. క్షమించండి అని చెప్పి లోపలికి వెళ్తాడు నందు. ఇంతలో పరందామయ్యకు తులసి ఫోన్ చేసి నేను తులసిని అంటుంది. ఇప్పుడే నువ్వు పంపించిన మందులు అందాయి అంటాడు పరందామయ్య.

దీంతో అవి తెలుసుకుందామనే నేను ఫోన్ చేశా అంటుంది తులసి. మీరు ఎక్కడున్నా బాధ్యత నాది అంటుంది తులసి. మరోవైపు తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసి రెస్టారెంట్ కు వెళ్తారు. అక్కడే నందు కూడా ఫుడ్ తింటాడు. ఇంతలో బిల్లు కట్టబోతుండగా తన పర్స్ కనిపించదు. దీంతో రెస్టారెంట్ వాళ్లు నందుతో గొడవ పెట్టుకుంటారు. ఇంతలో నందును చూస్తారు తులసి, సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది