Intinti Gruhalakshmi 21 Feb Today Episode : అభిని దాచిపెట్టి కొత్త నాటకానికి తెర లేపిన ఎస్ఐ.. దీంతో తులసి ఎస్ఐకి ఎలా బుద్ధి చెప్పింది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 21 Feb Today Episode : అభిని దాచిపెట్టి కొత్త నాటకానికి తెర లేపిన ఎస్ఐ.. దీంతో తులసి ఎస్ఐకి ఎలా బుద్ధి చెప్పింది?

Intinti Gruhalakshmi 21 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 ఫిబ్రవరి 2022, సోమవారం ఎపిసోడ్ 561 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆకాశంలో చందమామను చూపించి.. మురిపించి చిన్నపిల్లలకు అన్నం పెట్టినట్టు కథలు బాగానే చెబుతున్నావు. నీ కథలు నమ్మడానికి అంకిత చిన్నపిల్లేమీ కాదు అని తులసిపై విరుచుకుపడుతుంది లాస్య. నా కొడుకు మంచోడు అని నువ్వు బోను ఎక్కి అరిస్తే వాళ్లు వదిలేయరు. […]

 Authored By gatla | The Telugu News | Updated on :21 February 2022,9:30 am

Intinti Gruhalakshmi 21 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 ఫిబ్రవరి 2022, సోమవారం ఎపిసోడ్ 561 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆకాశంలో చందమామను చూపించి.. మురిపించి చిన్నపిల్లలకు అన్నం పెట్టినట్టు కథలు బాగానే చెబుతున్నావు. నీ కథలు నమ్మడానికి అంకిత చిన్నపిల్లేమీ కాదు అని తులసిపై విరుచుకుపడుతుంది లాస్య. నా కొడుకు మంచోడు అని నువ్వు బోను ఎక్కి అరిస్తే వాళ్లు వదిలేయరు. ముందు హాస్పిటల్ లో ఉన్నవాడు బతకాలి. ఆ తర్వాత నిజం చెప్పాలి. వాడు నిజం చెప్పాలంటే వాడికి గట్స్ ఉండాలి. వాడు నోరు తెరవడు. తెరవకే ఏం అవుతుందో ఊహించలేం అంటుంది లాస్య. దీంతో నీకు అభి బయటికి రావడం ఇష్టం లేనట్టు ఉంది ఆంటి అంటుంది శృతి.

intinti gruhalakshmi 21 february 2022 full episode

intinti gruhalakshmi 21 february 2022 full episode

తులసి కన్నది అభినే అయినప్పటికీ.. తనకంటే అభి మీద నాకే అభిమానం ఎక్కువ అంటుంది లాస్య. అసలు ఈ ఇంట్లో పెత్తనాన్ని తులసికి ఇచ్చి తప్పు చేశారు. పగ్గాలు నువ్వే తీసుకోవాల్సింది నందు. ఇప్పుడు తులసి.. అభిని ఏం చేస్తుందో ఏమో అంటుంది లాస్య. దీంతో ఈ ఇంట్లో అందరూ తులసి మాటలే వింటారు లాస్య. నా మాట ఎవ్వరూ ఖాతరు చేయరు. చూద్దాం.. అభి విషయంలో తులసి ఎంత దూరం వెళ్తుందో.య అప్పుడు నేనే ఇంటి పగ్గాలు తీసుకుంటా. ఏం చేస్తుందో చూస్తా. పరిస్థితి చేయి దాటి పోతే ఇక ఎవరి మాట వినను అంటూ నందు సీరియస్ అవుతాడు. మరోవైపు తులసి దిగులు పడుతూ ఉంటుంది.

అప్పుడే మాధవి వస్తుంది. అందరికీ ధైర్యం చెప్పాల్సిన దానివి నువ్వే దిగులు పడితే ఎలా అని అంటుంది మాధవి. నీ బిడ్డ గురించి నువ్వు ఒంటరి పోరాటం చేయాల్సిందే. బయట శత్రువులతో పాటు ఇంట్లోని శత్రువులతో కూడా పోరాటం చేయాల్సిందే అంటుంది మాధవి. దీంతో నా బిడ్డ కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు మాధవి అంటుంది తులసి.

నా బిడ్డ కోసం నేను ఏదైనా చేస్తాను అంటుంది తులసి. సమయానికి అన్నయ్య పక్కన లేకపోవడం పెద్ద లోటుగా ఉంది అంటుంది తులసి. దీంతో ఆయన లేకుంటేనేం.. నేను అన్నీ చెప్పాను. తన కొలిగ్ కు చెప్పాడట. ఆయన కూడా మంచి లాయరేనట. రేపు బెయిల్ పేపర్స్ సిద్ధం చేస్తా అని చెప్పాడట అంటుంది మాధవి.

దీంతో తులసి కాస్త కుదుట పడుటుంది. మరోవైపు దివ్య తన రూమ్ లో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. పొద్దున్నుంచి ఇలాగే కూర్చొని ఏడుస్తున్నావు.. అని అడుగుతుంది శృతి. మేము కూడా బాధను దిగమింగుకొని బతుకుతున్నాం. నువ్వు కూడా నీ బాధను దిగమింగుకొని ఉండాలి దివ్య అంటుంది శృతి.

Intinti Gruhalakshmi 21 Feb Today Episode : అభికి బెయిల్ కోసం ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేసిన మాధవి భర్త

దీంతో నా వల్ల కావట్లేదు వదిన.. వాడిని జైలులో పెట్టడం ఏంటి అని అంటుంది దివ్య. తర్వాత దివ్యను ఓదార్చి భోజనానికి తీసుకెళ్తుంది శృతి. మరోవైపు అభికి బెయిల్ ఇప్పించేందుకు పోలీస్ స్టేషన్ కు రెడీ అవుతుంది తులసి. దీంతో నేను కూడా వస్తాను ఆంటి.. అభిని చూడకుండా ఉండలేకపోతున్నాను.. అంటుంది అంకిత.

వెంటనే వస్తామమ్మా అంటుంది అంకిత. ఇంతలో లాయర్ వస్తాడు. నమస్తే మేడమ్ అంటాడు. బెయిల్ ఖచ్చితంగా వస్తుంది కదా అని అడుగుతుంది తులసి. దీంతో ఈ బెయిల్ పేపర్స్ చూడగానే ఖచ్చితంగా వెంటనే బెయిల్ ఇవ్వాల్సిందే అంటాడు లాయర్.

ఇద్దరూ కలిసి స్టేషన్ కు వెళ్తారు. ఎస్ఐ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ఎస్ఐ వస్తాడు. దీంతో ఎస్ఐ దగ్గరికి వెళ్లి ఇన్ స్పెక్టర్ గారు అని పిలుస్తుంది తులసి. కానీ.. ఎస్ఐ పట్టించుకోడు. తర్వాత మళ్లీ పిలిచేసరికి.. చెప్పండి.. మీకు మేము ఏవిధంగా సాయపడగము అంటాడు ఎస్ఐ.

దీంతో వెంటనే లాయర్ మాట్లాడుతూ.. అభిని రిలీజ్ చేయడానికి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాం అంటాడు లాయర్. దీంతో వాటిని చూసి పేపర్లు ఓకే.. ఇంతకీ అభి ఎవరు అని అడుగుతాడు పోలీస్. దీంతో తులసి షాక్ అవుతుంది. అదేంటి సార్.. అప్పుడే మరిచిపోయారా. నిన్న మా అబ్బాయిని అరెస్ట్ చేశారు కదా అని అడుగుతుంది తులసి.

దీంతో అసలు మీరు ఎవరు.. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే.. అసలు మీ అబ్బాయి ఎవరు.. అని అంటాడు ఎస్ఐ. యాక్షన్ చేస్తుంటాడు. నాకు కొంపదీసి అల్జీమర్స్ వచ్చిందా అని అనుకుంటాడు ఎస్ఐ. నిన్నటి విషయం చెప్పినా కూడా ఎస్ఐ నిజం చెప్పడు.

నేను అబద్ధం చెబుతున్నానని అనుకుందాం. నాతో పాటు కానిస్టేబుల్స్ కూడా ఉంటారు కదా. వాళ్లను వెళ్లి అడుగు అంటాడు ఎస్ఐ. దీంతో కానిస్టేబుల్స్ ను వెళ్లి అడుగుతుంది తులసి. కానీ.. ఎవ్వరూ మాకు తెలియదు అంటారు. దీంతో మీకు ఇంకా నమ్మకం రావడం లేదా.. అయితే అరెస్ట్ చేస్తే ఎక్కడ పెడతాం.. సెల్ లోనే కదా.. వెళ్లి చూసుకోండి. మీకే నమ్మకం వస్తది అంటాడు పోలీస్.

దీంతో స్టేషన్ లో ఉన్న అన్ని సెల్ లను వెతుకుతుంది. కానీ అభి కనిపించడు. దీంతో మేడమ్ ను తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టండి. మళ్లీ ఇటువైపు రావద్దని చెప్పండి.. అని లాయర్ కు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోబోతాడు ఎస్ఐ. దీంతో తులసికి కోపం వస్తుంది.

ఇన్ స్పెక్టర్ గారు మా అభిని ఎక్కడ దాచారు అంటూ సీరియస్ అవుతుంది. దీంతో నాకు తెలియదు అంటాడు ఎస్ఐ. నా బిడ్డ ఎక్కడో చెప్తారా లేదా. నా బిడ్డను చూపించేంత వరకు స్టేషన్ కదిలేది లేదు. ఇక్కడే కూర్చుంటా.. ఎవ్వరినీ బయటికి వెళ్లనివ్వను అంటుంది తులసి. దీంతో ఎస్ఐ కూడా సీరియస్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది