Intinti Gruhalakshmi 21 Nov Today Episode : పరందామయ్య కావాలని తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడా? అందరికీ దూరంగా వెళ్లిపోయాడా?
Intinti Gruhalakshmi 21 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 795 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరందామయ్యను ఒక రూమ్ లోకి తీసుకెళ్లి ఇక నుంచి ఇదే మీ రూమ్. మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉండండి అని చెబుతుంది తులసి. ఆ తర్వాత పరందామయ్య పరిస్థితిని చూసి సామ్రాట్ కు చాలా బాధేస్తుంది. ఈ వయసులో ఆయనకు ఎందుకు ఇంత బాధ అని అంటాడు సామ్రాట్. మామయ్యకు పోయిన గౌరవాన్ని తిరిగి తీసుకు రావాల్సిన బాధ్యత నాది అని సామ్రాట్ తో చెబుతుంది తులసి. మరోవైపు పరందామయ్య రానందుకు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంది అనసూయ. అనసూయను చూసి లాస్యకు భయమేస్తుంది. ఈ విషయం నందుకు తెలిస్తే.. నందు కూడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు అని అనుకుంటుంది. నందు వచ్చేలోపు మామయ్యను ఇంటికి తీసుకురావాలి. అత్తయ్యను నార్మల్ గా చేయాలి అని అనుకుంటుంది లాస్య.
మరోవైపు వెళ్లిపోండి.. అందరూ వెళ్లిపోండి.. నేను ఉండలేను అంటూ పిచ్చిపిచ్చిగా వాగుతుంది అనసూయ. పరందామయ్యను తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసి పడుకోబెడతారు. నన్ను క్షమించు తులసి అంటూ పరందామయ్య తనలో తాను బాధపడుతుండటంతో తులసి తట్టుకోలేకపోతుంది. అసలు ఇంత మంచి మనిషిని అత్తయ్య ఇన్ని మాటలు ఎలా అనగలిగింది. నిద్రలో కూడా కుమిలిపోతున్నారు. మామయ్యకు ఏం కాకూడదు అని టెన్షన్ పడుతుంది తులసి. దీంతో ఏం కాదు. ఆయనకు ఏం కాకుండా మనం చూసుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు సామ్రాట్.
ఎవరో అన్నారంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. 50 ఏళ్లు కాపురం చేసిన భార్య అంది. ఆయన ఎంతగానో ప్రేమించే భార్య అంది. అందరి ముందు పరువు తీసింది. ఎవరు చెప్పినా వినలేదు. ఎవరు ఆపినా వినలేదు. అంతకంటే ఆయనకు కొంచెం విషం ఇచ్చినా బాగుండేది.
ఇక్కడ మామయ్య బాధపడుతుంటే అక్కడ ఆవిడ సంతోషంగా ఉండగలరా? ఇంట్లో పెద్దవాళ్లు దేవతా మూర్తులతో సమానం అంటారు. ఈరోజు అత్తయ్య మాటలు ఒక విగ్రహాన్ని శిథిలం చేశాయి. ఇంతవరకు ఎప్పుడూ నాకు కోపం రాలేదు. నన్ను చాలా మాటలు అన్నది. మనసు కష్టపెట్టుకున్నాను కానీ.. కోపం రాలేదు. ఈరోజు మాత్రం అత్తయ్య మీద చాలా కోపంగా ఉంది అంటుంది తులసి.
Intinti Gruhalakshmi 21 Nov Today Episode : అనసూయను చూసి టెన్షన్ పడ్డ ఇంట్లో వాళ్లు
మా మామయ్యను అంటానికి ఎంత ధైర్యం. కోపం ఉంటే నన్ను అనొచ్చు కదా. నన్ను చంపొచ్చు కదా. నోర్మూసుకొని భరించే దాన్ని. అత్తయ్య అన్నమాటలను ఎన్నటికీ క్షమించలేను అంటుంది తులసి.
ఈరోజు జరిగిన ఇష్యూ చాలా చాలా అసహ్యంగా అనిపిస్తోంది అంటాడు సామ్రాట్. నందుకు తెలిస్తే ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఆయన్ను ఇలా చూస్తే తట్టుకోలేరు. ఇక మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తా అంటుంది తులసి. దీంతో సరే అంటాడు సామ్రాట్.
మరోవైపు అనసూయను చూసి ఇంట్లో వాళ్లంతా భయపడతారు. ఏంటి ఇలా ప్రవర్తిస్తోంది అనుకుంటారు. నాకు ఎవరూ వద్దు.. నాకు ఎవరితో పని లేదు. అందరూ వెళ్లిపోండి అంటుంది అనసూయ.
నేను ఎవ్వరినీ నమ్మను అంటుంది. అందరిదీ మోసమే. అందరూ నన్ను ఒంటరిదాన్ని చేశారు. నాకు ఎవరూ వద్దు అంటుంది అనసూయ. పూనకం వచ్చినట్టు ఊగిపోతోంది అంటుంది అంకిత. తాతయ్యను తిట్టి దూరం చేసుకుంది.
అందుకే ఇలా ప్రవర్తిస్తుంది అంటాడు ప్రేమ్. ఎందుకు అలా చేస్తోందో వెళ్లి అడిగి వస్తాను అంటాడు ప్రేమ్. వద్దు అని అభి ఆపుతాడు. దీంతో నానమ్మ చేసిన తప్పు తను తెలుసుకోవాలి కదా అంటాడు ప్రేమ్.
మీరెవరూ వద్దు.. నేను అమ్మమ్మతో మాట్లాడుతా అంటుంది శృతి. ఏంట్రా ఆ చూపు.. ఒక్కొక్కరి గుడ్లు పీకేస్తాను అంటుంది వాళ్లను చూసి. దొంగలు చూసినట్టు చూస్తారేంట్రా.. ఒరేయ్ అభి నువ్వు కూడా పార్టీ మారావా? డొక్క చీరేస్తాను అంటుంది.
ఇంతలో శృతి వచ్చి తన దగ్గర కూర్చొంటుంది. వాళ్లు ఎక్కడికీ వెళ్లరు. లోపలికి వెళ్లారు అంతే. చాలా నష్టపోతున్నారు. మీకే అర్థం కావడం లేదు అంటుంది శృతి. దీంతో నేను తులసిని కాదు.. నీ మాట వినడానికి అంటుంది అనసూయ.
50 ఏళ్లు మీతో జీవితాన్ని పంచుకున్న తాత గారిని మీరు అవమానించారు అంటుంది శృతి. దీంతో ఆయనేం చేశారు. మీనోళ్లు అక్కడ ఎందుకు మూతపడ్డాయి అంటుంది అనసూయ. నీ బోడి సలహాలు నాకు అవసరం లేదు అంటుంది అనసూయ.
ముందు లోపలికి రండి. రెస్ట్ తీసుకోండి అంటే.. నేను రాను అంటుంది అనసూయ. నేను ఎవ్వరి మాటా వినను. వెళ్లు లోపలికి. పో వెళ్లిపో అంటుంది అనసూయ. దీంతో చేసేది లేక శృతి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు పరందామయ్యకు పాలు తాగిస్తుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.