Intinti Gruhalakshmi 22 March Today Episode : ప్రేమ్ ఆటో నడుపుతున్నాడని తెలుసి తులసి షాక్.. దివ్యకు ప్రేమ్ వార్నింగ్.. ఇంతలో ట్విస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 22 March Today Episode : ప్రేమ్ ఆటో నడుపుతున్నాడని తెలుసి తులసి షాక్.. దివ్యకు ప్రేమ్ వార్నింగ్.. ఇంతలో ట్విస్ట్

Intinti Gruhalakshmi 22 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 586 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ బర్త్ డే విషయం తెలుసుకొని బాబురావు, ఆయన భార్య ఇద్దరూ వచ్చి కాసేపు హడావుడి చేస్తారు. ఆ తర్వాత రాములమ్మ బర్త్ డే కేక్ తీసుకొస్తుంది. అందరూ కలిసి బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. మీ అమ్మ నీ […]

 Authored By gatla | The Telugu News | Updated on :22 March 2022,9:30 am

Intinti Gruhalakshmi 22 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 586 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ బర్త్ డే విషయం తెలుసుకొని బాబురావు, ఆయన భార్య ఇద్దరూ వచ్చి కాసేపు హడావుడి చేస్తారు. ఆ తర్వాత రాములమ్మ బర్త్ డే కేక్ తీసుకొస్తుంది. అందరూ కలిసి బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. మీ అమ్మ నీ దగ్గర లేకపోయినా నీకు మేమున్నాం. దేనికీ మొహమాటపడకు అంటుంది బాబురావు భార్య. నీ పుట్టిన రోజు సందర్భంగా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం అంటుంది. నడుపుకోవడానికి అద్దెకు ఆటో అడిగావట కదా రాములమ్మ చెప్పింది మాట్లాడి పెట్టాను అంటుంది. ఇదిగో కీస్ అని బాబురావు దాని కీస్ ఇవ్వబోతాడు.

intinti gruhalakshmi 22 march 2022 full episode

intinti gruhalakshmi 22 march 2022 full episode

ఈ విషయం తెలిసి శృతి షాక్ అవుతుంది. ఆటో అడగటం ఏంటి ఆంటి అంటుంది. ఇల్లు గడవడం కష్టంగా ఉందని ప్రేమ్ బాబు ఆటో నడుపుతా అన్నా. అదే కాంతం అక్కకు చెప్పాను అంటుంది రాములమ్మ. కానీ.. శృతికి చాలా కోపం వస్తుంది. దీంతో అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది శృతి. కట్ చేస్తే గుడి నుంచి తులసి ఇంటికి తిరిగి వస్తుంది. ఒక్క నిమిషం ఆంటి.. అని అంకిత ఆపుతుంది. ఈరోజు ప్రేమ్ బర్త్ డే కదా ఆంటి అని అంటుంది. దీంతో నువ్వు దీని గురించే మాట్లాడాలి అంటే నాతో మాట్లాడొద్దు అని వెళ్లిపోతుంది.

మరోవైపు శృతి బయటికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. తప్పు చేశాను శృతి అంటాడు ప్రేమ్. బాధ పెట్టడం కాదు. నా గుండెకు గాయం చేశావు అంటుంది శృతి. నా మీద నమ్మకం ఉంది అనుకున్నాను కానీ.. నన్ను అనుమానపడతావని అనుకోలేదు అంటుంది శృతి.

నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అంటుంది శృతి. నీతో కలిసి జీవితం పంచుకోవడానికే నేను నీతో కలిసి వచ్చాను. ఎందుకు నన్ను పరాయిదానిలా చూస్తున్నావు. ఎందుకు నాతో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నావు. నా తప్పు ఏమైనా ఉంటే చెప్పు సరిదిద్దుకుంటాను. అంతే కానీ.. నన్ను దూరం చేయకు అంటుంది శృతి.

శృతి నన్ను అర్థం చేసుకో. బర్త్ డే మూడ్ లో ఎందుకు ఈ విషయం చెప్పడం. తీరిగ్గా రాత్రి మాట్లాడుదామనుకున్నా. ఈలోపే ఈ విషయం తెలిసింది. అంతకుమించి ఇంకేం చేయాలనుకోలేదు అంటాడు. దీంతో నిజంగానా అంటుంది శృతి. దీంతో అవును అంటాడు.

Intinti Gruhalakshmi 22 March Today Episode : తులసి పడుతున్న కష్టాలు చూసి చలించిపోయిన పరందామయ్య

అయినా కూడా నీకు శిక్ష పడాల్సిందే అంటుంది శృతి. లోపలకి రా అంటుంది. కట్ చేస్తే తులసి… ప్రేమ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పరందామయ్య వస్తాడు. ప్రేమ్ నా ప్రాణం.. ఎలాగైనా రక్షించుకుంటా.. అని పరందామయ్యతో చెబుతుంది.

ఒకవైపు ఇంటి మీద ఉన్న అప్పు.. మరోవైపు ప్రేమ్ సమస్య.. ఇంట్లో వాళ్లతో తలనొప్పి.. ఏంటమ్మా ఇది అంటాడు పరందామయ్య. నువ్వు ఓపికగానే ఉన్నావు కానీ.. ఇంట్లో వాళ్లకే ఓపిక లేదు అంటాడు పరందామయ్య. ప్రేమ్ ను ద్వేషిస్తున్నావు అనుకుంటన్నారు కానీ.. నువ్వు వాడి కోసం గుడికి వెళ్లావు అని వాళ్లకు తెలియదు అంటాడు పరందామయ్య.

నేను చేసే పనులు కాదు.. ఫలితాలు కనబడాలి అనుకుంటాను మామయ్య అంటుంది తులసి. కట్ చేస్తే దివ్య.. ప్రేమ్ ఇంటికి వెళ్తుంది. ప్రేమ్ ను చూసి చాలా సంతోషిస్తుంది దివ్య. ప్రేమ్ ఉంటున్న ఇంటిని చూసి షాక్ అవుతుంది దివ్య. లా ఉంటున్నారు ఇక్కడ అంటుంది.

ఇంటికి సంబంధించి ఏ నిర్ణయం అయినా అమ్మదే ఫైనల్. అందుకే.. అమ్మకు తెలియకుండా నువ్వు ఎందుకు వచ్చావు. అమ్మ ఒప్పుకుంటేనే ఇక్కడికి రా అంటున్నా అంటాడు ప్రేమ్. అమ్మ ఏం చేసినా మన మంచికే చేస్తుంది. అమ్మకు అపార్థం చేసుకోవద్దు అంటాడు ప్రేమ్.

దీంతో కోపంతో దివ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు ప్రేమ్ ఆటోకు పూజ చేసి నడపడానికి బయటికి వెళ్తాడు. తులసి.. ప్రేమ్ ఆటో ఎక్కుతుంది. కానీ.. డ్రైవ్ చేసేది ప్రేమ్ అనే విషయం తులసికి తెలియదు. ముఖానికి కర్చీఫ్ అడ్డు పెట్టుకుంటాడు.

తులసి ఆటో దిగి డబ్బులు ఇస్తుండగా.. డబ్బులు కింద పడేసినట్టుగా చేసి తన కాళ్లను నమస్కరిస్తాడు. ఆ తర్వాత ప్రేమ్ మాస్క్ తీసి ఆటో నడుపుతూ వెళ్తుండటం తులసి చూసి షాక్ అవుతుంది. ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది