Intinti Gruhalakshmi 24 June Today Episode : 20 లక్షలు కాజేసింది లాస్య అని తులసి తెలుసుకుంటుందా? తనపై కేసు పెడుతుందా? తులసినే లాస్య అరెస్ట్ చేయిస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 24 June Today Episode : 20 లక్షలు కాజేసింది లాస్య అని తులసి తెలుసుకుంటుందా? తనపై కేసు పెడుతుందా? తులసినే లాస్య అరెస్ట్ చేయిస్తుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :24 June 2022,9:30 am

Intinti Gruhalakshmi 24 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 జూన్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 667 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాక.. ఒక బ్లాంక్ చెక్ కావాలంటాడు బ్యాంక్ ఏజెంట్. దీంతో ఎందుకు అని అడుగుతుంది తులసి. మీ సెక్యూరిటీ కోసమే.. బ్యాంక్ అకౌంట్ ఉందని బ్యాంక్ వాళ్లకు ప్రూఫ్ ఇవ్వాలి అంటాడు ఏజెంట్. దీంతో చెక్ మీద సంతకం పెట్టి ఇస్తుంది తులసి. తనకు ఎందుకో ఓవైపు టెన్షన్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ప్రాబ్లమ్ ఏం ఉండదు కదా అంటే.. ఏం ఉండదు. రేపటి లోగా మీ అకౌంట్ లో 20 లక్షలు పడతాయి. నేను గ్యారెంటీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు బ్యాంక్ ఏజెంట్. కట్ చేస్తే నందు ఫ్రెండ్ తనను కలవడానికి వస్తాడు. హాయ్ నందు.. అంటాడు. వీడేంటి చెప్పాపెట్టకుండా వచ్చాడు అంటాడు. చెప్పరా విషయం ఏంటో అంటాడు. అదేంటి.. నేను నిన్ను పిలవలేదు కదా అంటాడు నందు. నువ్వే కాల్ చేసి రమ్మన్నావు కదా అంటాడు. దీంతో నేనే రమ్మన్నాను అంటుంది లాస్య.

intinti gruhalakshmi 24 june 2022 full episode

intinti gruhalakshmi 24 june 2022 full episode

ఏరా నీకు ఇదేమన్నా పద్ధతిగా ఉందా అని అడుగుతాడు తన ఫ్రెండ్. దీంతో రెండు రోజుల్లో ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ 20 లక్షలు మీ చేతుల్లో పెట్టబోతున్నాం అంటుంది లాస్య. దీంతో ఇలాంటి హామీలు మేము చాలా విన్నాం. నమ్మొచ్చా అంటాడు. దీంతో నమ్మొచ్చు.. అంటుంది లాస్య. అగ్రిమెంట్ కూడా చేసుకుందాం అంటుంది లాస్య. దీంతో నందు ఈ పేపర్స్ మీద సైన్ చేయి అంటాడు తన ఫ్రెండ్. దీంతో నందు సైన్ పెట్టడానికి ఆలోచిస్తుంటాడు. నందు.. కానివ్వు సైన్ చేయి అంటుంది లాస్య. దీంతో నందు బలవంతంగా సంతకం పెడతాడు. ఓకే నందు వెళ్లి వస్తాను. రెండు రోజుల్లో రండి మా ఆఫీసులో కలుద్దాం సరేనా అని చెప్పి నందు ఫ్రెండ్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత నీకేమైనా పిచ్చి పట్టిందా.. డబ్బులు లేవని అభి చేతులెత్తేశాడు. ఇప్పుడు నువ్వు 20 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు అంటాడు నందు. డబ్బు ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచే వస్తుంది. ఎవరు ఇవ్వాలో వాళ్లే ఇస్తారు. డబ్బు విషయం నాకు వదిలేసి మిగితా విషయాలు నువ్వు చూసుకో. నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య.

కట్ చేస్తే.. ప్రేమ్ లిరిక్స్ రాస్తూ ఉంటాడు. శృతి తనను చూస్తూ మురిసిపోతుంటుంది. ఇంతలో అభి అక్కడికి వస్తాడు. అభిని చూసి ప్రేమ్ షాక్ అవుతాడు. ఇంట్లో కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు. శృతి చాప తీసుకురా అంటాడు ప్రేమ్. దీంతో అవసరం లేదు. నేను ఇక్కడే కూర్చొంటాను అంటాడు అభి.

తర్వాత శృతి లోపలికి వెళ్లి మంచినీళ్లు తీసుకొస్తుంది. ఏదైనా పని మీద వచ్చావా అన్నయ్య అంటాడు ప్రేమ్. దీంతో నీ సహాయం కోసం వచ్చాను అంటాడు అభి. ఇంటికి అన్నయ్య వస్తే కూర్చోవడానికి కుర్చీ వేయలేని వాడిని. నేను నీకు సాయం చేయడం ఏంటి అంటాడు ప్రేమ్.

Intinti Gruhalakshmi 24 June Today Episode : ప్రేమ్ ను కలిసిన అభి

నాకు కావాల్సింది డబ్బు సాయం కాదు.. మాట సాయం.. అంటాడు అభి. నా వల్ల కాక.. నా చేతగాక నిన్ను అడుగుతున్నాను అంతే.. అంటాడు. నా గురించి చెడుగా పబ్లిసిటీ చేసి మామ్ నా కాపురం చెడగొట్టింది. అంకితను ఎమోషనల్ గా లాక్ చేసి తన దగ్గర ఉంచేసుకుంది అంటాడు.

అంకిత అలా ఒకరి మాట వినదు. తనకు ఏం నచ్చితే అది చేస్తుంది అంటుంది శృతి. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు అని అడుగుతాడు ప్రేమ్. దీంతో అంకితకు నచ్చజెప్పి అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చేలా చేయాలి. దాని కోసం నువ్వు మామ్ ని కూడా నచ్చజెప్పాలి అంటాడు అభి.

మామ్ ను నచ్చజెప్పి అంకిత నాదగ్గరికి వచ్చేలా చేస్తే నీ ఆల్బమ్ విషయంలో నేను హెల్ప్ చేస్తాను అంటాడు అభి. దీంతో డీల్ మాట్లాడటానికి వచ్చావా అంటాడు ప్రేమ్. నీకు అత్తారింటి గాలి బాగానే వంటపట్టింది అంటాడు. నన్ను వదిలి అంకిత దూరంగా ఉండటం మీకు సంతోషమా అంటాడు అభి.

మీ సమస్యను మీరే సాల్వ్ చేసుకోండి. భార్యాభర్తల మధ్య మూడో మనిషి అవసరం లేదు.. అంటుంది శృతి. నా ఆల్బమ్ విషయంలో నీ సాయం నాకు అస్సలు అవసరం లేదు అంటాడు ప్రేమ్. దీంతో నువ్వు ఎప్పటికీ జీవితంలో బాగుపడవు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు అభి.

మరోవైపు తులసి చాలా హుషారుగా ఉంటుంది. బ్యాంకులో డబ్బులు పడిపోతున్నాయని సంతోషపడుతుంది. డబ్బులు పడగానే ఏం చేయాలో లిస్టు రాస్తుంటుంది. ఇంతలో అంకిత, పరందామయ్య, అనసూయ వస్తారు. రండి రండి.. మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటుంది తులసి.

ఏంటి ఆంటి ఇంత హడావుడి చేస్తున్నారు అని అంటుంది అంకిత. రేపటిలోగా బ్యాంక్ లోన్ తాలుకు డబ్బు నా అకౌంట్ లో పడిపోతుంది అని చెబుతుంది. దీంతో అందరూ సంతోషిస్తారు. బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో బ్యంక్ నుంచి మెసేజ్ వస్తుంది.

20 లక్షలు తన అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. దీంతో అందరూ సంతోషిస్తారు. ఇంతలోనే బ్యాంక్ అకౌంట్ నుంచి 20 లక్షలు డెబిట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. దీంతో తులసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది