Intinti Gruhalakshmi 25 April Today Episode : తులసి ఫ్యాక్టరీని మూసేయించిన లాస్య, భాగ్య.. ఈ విషయం తెలిసి నందు షాకింగ్ నిర్ణయం.. ఇంతలో మరో ట్విస్ట్

Intinti Gruhalakshmi 25 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 615 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శృతి చీరను ఆరేయలేకపోతాడు ప్రేమ్. అందుకే నేను పందెం కట్టింది అంటుంది శృతి. చీర మరీ అంత పొడుగు ఉందేంటి అంటాడు. ఏదో విధంగా కష్టపడి చివరకు చీరను ఆరేస్తాడు ప్రేమ్. దీంతో శృతి షాక్ అవుతుంది. నేనే గెలిచాను అంటాడు ప్రేమ్. దీంతో శృతికి ఏం చేయాలో అర్థం కాదు. దాదా.. ముద్దు పెట్టేయ్ అంటాడు. మరీ ఇలా ఆరు బయట నా వల్ల కాదు. లోపలికి రా అంటుంది శృతి. ఇంట్లోకి వెళ్లాక కళ్లు మూసుకో అంటుంది శృతి. 10 ముద్దులు అయ్యేవరకు కళ్లు తెరవ కూడదు అంటుంది శృతి.

Advertisement
intinti gruhalakshmi 25 april 2022 full episode
intinti gruhalakshmi 25 april 2022 full episode

పక్కనే అద్దం ఉంటుంది. అద్దంలో ప్రేమ్ ను చూస్తూ ముద్దు పెడుతుంటుంది. దీంతో వెంటనే కళ్లు తెరిచి ఇది చీటింగ్.. చీటింగ్ అని అంటాడు. నాకు పెట్టు.. అంటాడు. తనను ఆటపట్టిస్తాడు. ఇంతలో దివ్య ప్రేమ్ కు ఫోన్ చేస్తుంది. అన్నయ్య.. నేను భయపడినట్టే జరిగింది. అభి అన్నయ్య, వదిన ఇల్లు వదిలి వెళ్లిపోయారు అంటుంది దివ్య. దీంతో ప్రేమ్, శృతి షాక్ అవుతారు. ఎందుకలా.. ఎవరేమన్నారు అని అడుగుతాడు ప్రేమ్. దీంతో మొత్తం స్టోరీ చెప్పేస్తుంది దివ్య. కనీసం వాడైనా ఇంట్లో అమ్మకు తోడు ఉంటాడనుకున్నాను కానీ.. ఇలా పారిపోతాడని అనుకోలేదు అంటాడు ప్రేమ్. ఒక్కొక్కరు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది అన్నయ్య అంటుంది దివ్య. నేను మాట్లాడుతాను. నువ్వేం కంగారు పడకు అంటాడు ప్రేమ్.

మరోవైపు తులసి.. అభి, అంకిత గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పరందామయ్య వస్తాడు. రాముడి వనవాసం గురించి చెబుతాడు పరందామయ్య. కానీ.. ఈ అభిరామ్ వెళ్లింది వాడు ఎదగడం కోసం. నా బిడ్డకు ఏ అవసరం వచ్చినా చూసుకోవడానికి గాయత్రి ఉంది. నేను దిగులు పడాల్సిన అవసరం లేదు అంటుంది తులసి.

మరోవైపు లాస్య దగ్గరికి భాగ్య వెళ్తుంది. ఏం చేస్తున్నావు లాస్య.. అవుతుంది కాదు ఏంటి అంటుంది భాగ్య. టెన్షన్ తో చచ్చిపోతున్నాను ముందు విషయం ఏంటో చెప్పు అంటే జీకే కూతురు ఫంక్షన్ లో నాకు, తులసికి గొడవ జరిగింది అంటుంది. ఆ గొడవ గురించి మొత్తం చెబుతుంది లాస్య.

తులసక్క అంత మాట అనేసిందా. ఆవిడకు ఏమైనా ముందే ఎలా తెలుసు. బావ గారు నిన్ను వదిలేస్తారని ఎలా చెప్పింది. వెనుక ఏదో జరుగుతుంది అని అర్థం లాస్య. ఆ విషయాన్ని అంత తేలికగా తీసిపారేయకూడదు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం మంచిది అంటుంది భాగ్య.

Intinti Gruhalakshmi 25 April Today Episode : భాగ్యను డబ్బులతో కొనేసిన లాస్య

బావ గారు ఎవరి మీద కన్నేయకుండా చూసుకోవాలి అంటుంది భాగ్య. నాకు ఒక పని చేయి. ఆ ఇంట్లో మనుషులు తులసిని వదిలేసి నాదగ్గరికి వచ్చేలా చేయాలి అంటుంది లాస్య. మొన్ననే నాకు 20 లక్షలు ఇచ్చింది. అప్పుడే తనను మోసం చేయాలంటే మనసు రావడం లేదు అంటుంది.

దీంతో ఆ 20 లక్షలతో పాటు.. ఇంకొంత కలిపి ఇస్తాను అంటుంది లాస్య. దీంతో సరే.. ఓకే నా దగ్గర ఒక బెస్ట్ మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ వర్కవుట్ అయితే తులసి చాప్టర్ క్లోజ్ అంటుంది భాగ్య. అదేంటో ఎక్స్ ప్లేన్ చేస్తుంది. అప్పుడు మనం మున్సిపల్ ఆఫీసులో మేనేజ్ చేస్తే తులసి ఫ్యాక్టరీ మూతపడటం ఖాయం అంటుంది భాగ్య.

ఎంత ఖర్చు అయినా పర్వాలేదు.. నేను భరిస్తాను. వెంటనే పని ప్రారంభించు అంటుంది లాస్య. మరోవైపు తులసికి మేనేజర్ ఫోన్ చేసి.. మన ఫ్యాక్టరీని క్లోజ్ చేయడానికి మున్సిపల్ అధికారులు వచ్చారు మేడమ్. అర్జెంట్ గా రండి అంటాడు.

దీంతో నేను వెంటనే వస్తున్నాను. నేను వచ్చేవరకు వాళ్లను ఆపండి అంటుంది తులసి. మరోవైపు మీ ఓనర్ ఎక్కడ. ఎంత సేపు వెయిట్ చేయాలి అంటాడు అధికారి. 2 నిమిషాలు సార్.. వచ్చేస్తారు సార్ అంటాడు. ఇంతలో తులసి వస్తుంది. ఏంటి సమస్య అంటుంది.

మీ ఫ్యాక్టరీ సీజ్ చేయడానికి వచ్చాం అంటాడు అధికారి. మీ ఫ్యాక్టరీ ఉన్న స్థలం గవర్నమెంట్ ది. అక్రమంగా ఆక్యుపై చేసుకున్నారు అంటాడు అధికారి. మీకు దండం పెడతాను. మాది పక్కా డాక్యుమెంట్స్ ఉన్న ఫ్యాక్టరీ అంటుంది. కానీ.. అధికారులు వినరు.

మీరు తప్పుకోకపోతే.. పోలీసులను పిలవాల్సి వస్తుంది అంటాడు అధికారి. వద్దు సార్ అని.. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్లతో పాటు తులసి కూడా వేడుకుంటుంది. మమ్మల్ని మా డ్యూటీ చేయకుండా అడ్డుకుంటే పోలీస్ కేసు ఫైల్ చేస్తాం. మీరంతా కదలకపోతే పోలీసులతో జరిపిస్తాం అంటాడు అధికారి.

సీజ్ చేయండి అని చెప్పి అధికారి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అధికారులు ఫ్యాక్టరీని సీజ్ చేస్తారు. తులసికి ఏం చేయాలో అర్థం కాదు. మీరెవ్వరూ అధైర్య పడకండి. నేను ఏదో ఒకటి చేస్తాను. న్యాయం మన వైపే ఉంది. 24 గంటల్లోగా మళ్లీ ఫ్యాక్టరీ తెరిపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

మరోవైపు ఫ్యాక్టరీ మూతపడిందని భాగ్య, లాస్య కలిసి ఇద్దరూ సంతోషిస్తారు. ఒక్క ఫోన్ కాల్ తో తులసి తలరాతను మార్చేశావు అంటుంది లాస్య. సూపర్ లేడీవి అనిపించావు అంటుంది లాస్య. ఇప్పటి నుంచి తులసి అక్క మొహం ఏడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అంటుంది.

ఇంతలో నందు వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. దీంతో తులసి ఫ్యాక్టరీని మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు అని చెబుతుంది లాస్య. మరోవైపు నందు, లాస్యతో పాటు అభి, ప్రేమ్ అందరూ తులసి ఇంటికి వెళ్తారు. అక్కడ మళ్లీ గొడవ స్టార్ట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement