Intinti Gruhalakshmi 27 April Today Episode : తులసిని ఆదుకున్న ప్రవళిక.. తన ఫ్యాక్టరీ తిరిగి తన చేతుల్లోకి వచ్చినా తులసి షాకింగ్ నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 27 April Today Episode : తులసిని ఆదుకున్న ప్రవళిక.. తన ఫ్యాక్టరీ తిరిగి తన చేతుల్లోకి వచ్చినా తులసి షాకింగ్ నిర్ణయం

 Authored By gatla | The Telugu News | Updated on :27 April 2022,9:30 am

Intinti Gruhalakshmi 27 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 ఏప్రిల్ 2022, బుధవారం ఎపిసోడ్ 617 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందుతో పాటు అభి కూడా వచ్చి తనదే తప్పు అన్నట్టుగా మాట్లాడటంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంట్లో అందరూ ఏదో కోల్పోయినట్టుగా ఎక్కడివారక్కడే కూర్చుంటారు. తులసి మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తుంది. మరోవైపు తెల్లారుతుంది. తులసి.. తన బైక్ కు వాటర్ కొడుతూ ఉంటుంది. ఇంతలో ప్రవళిక తన ఇంటికి వస్తుంది. ముందు ప్రవళికను గమనించదు. తర్వాత ప్రవళికను చూసి షాక్ అవుతుంది తులసి. మీరు ఎవరు అన్నట్టుగా చూస్తుంది.

intinti gruhalakshmi 27 april 2022 full episode

intinti gruhalakshmi 27 april 2022 full episode

దీంతో ప్రవళిక ఒక మొట్టికాయ వేస్తుంది. దీంతో ప్రవళిక అంటుంది. ఇద్దరూ హత్తుకుంటారు. పాతికేళ్లకు గుర్తుపట్టలేనంతగా మారిపోయానా అంటుంది ప్రవళిక. ఏదోలా గుర్తుపట్టావు కాబట్టి వదిలేశాను అంటుంది తులసి. లంగా వోణి వేసుకొని నుదిటిన బొట్టు పెట్టుకొని అమాయకంగా కనిపించే తులసే నాకు ఇంకా కళ్ల ముందు కనిపిస్తోంది అంటుంది ప్రవళిక. కానీ.. అప్పటికీ ఇప్పటికీ ఒకటే తేడా. ప్రపంచాన్ని మొత్తం మోస్తున్నంత భారంగా ఇప్పుడు కనిపిస్తోంది అంటుంది ప్రవళిక. కలవాలని మనసులో ఉంటే ఎన్నో మార్గలు ఉంటాయి. నిన్ను కాంటాక్ట్ చేయడానికి ఎంతగా ట్రై చేశానో తెలుసా? నువ్వనే కాదు.. 90 శాతం ఆడవాళ్లు అంతే.. పెళ్లి కాగానే.. పాత ఫ్రెండ్ షిప్ లను అన్నింటినీ డస్ట్ బిన్ లో పడేస్తారు.

ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటారు. తను ఒక గుడ్ న్యూస్ ను తులసికి అందిస్తుంది. ఒక డాక్యుమెంట్ ను ఇచ్చి అది చదువు అంటుంది. ప్రవళిక.. ఇది అంటుంది. అన్యాయంగా నీ ఫ్యాక్టరీని సీజ్ చేశారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశావు కదా. ఆ అన్యాయాన్ని సరి చేస్తూ నీ ఫ్యాక్టరీని నడుపుకోవచ్చు అని కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ఇది అంటుంది ప్రవళిక.

నీకు ఈ విషయాలు అన్నీ ఎలా తెలుసు. నీకు ఎవరు చెప్పారు. నువ్వు ఏమైనా కలెక్టర్ ఆఫీసులో పని చేస్తున్నావా అని అడుగుతుంది. నువ్వు నిజంగా దేవతకు. చాలా ఏళ్ల తర్వాత కలిసి గొప్ప గిఫ్ట్ ఇచ్చావు అంటుంది తులసి. దీంతో చూడు తులసి.. ఫ్రెండ్స్ మధ్య ఉండేది.. ఇచ్చి పుచ్చుకోవడాలు అంతే.. అంటుంది ప్రవళిక.

సరే.. నేను వెళ్లి వస్తాను అంటుంది. మళ్లీ వస్తాను. అప్పుడు అందరినీ పరిచయం చేద్దువు కానీ అంటుంది ప్రవళిక. మరోవైపు పరందామయ్య, అనసూయకు తులసిని ఎలా ఓదార్చాలో అర్థం కాదు. ఇంతలో తులసి వచ్చి మన ఫ్యాక్టరీని మళ్లీ ఓపెన్ చేసుకునే ఆర్డర్స్ ఇచ్చారు అంటుంది.

Intinti Gruhalakshmi 27 April Today Episode : లాస్యకు షాక్

ఫ్యాక్టరీ మళ్లీ ఓపెన్ అయిందని భాగ్యతో కోపంగా మాట్లాడుతుంది. తులసి ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి మళ్లీ ఆర్డర్స్ ఇచ్చారట అంటుంది లాస్య. లాస్యకు తీవ్రంగా కోపం వస్తుంది. ఇంతలో భాగ్యకు ఫోన్ వస్తుంది. తన ఫోన్ ను కింద పడేసి తొక్కుతుంది.

నువ్వేం చేస్తావో నాకు తెలియదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ సొంతం కాకూడదు. ఎలాగైనా దాన్ని క్లోజ్ చేయించాలి అంటుంది లాస్య. దీంతో మళ్లీ మనం అవకాశ కోసం ఎదురు చూడాల్సిందే అంటుంది భాగ్య. మరోవైపు ఫ్యాక్టరీని తెరిపించి.. కార్మికులను పిలుస్తుంది.

నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అంటుంది. అందుకే ఫ్యాక్టరీతో తెగ తెంపులు చేసుకోవాలని అనుకుంటున్నానని అంటుంది. ఇది మీ భవిష్యత్తు కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా అంటుంది తులసి. మళ్లీ రేపు ఎప్పుడైనా ఫ్యాక్టరీ మూత పడితే మీ భవిష్యత్తు మళ్లీ అంధకారం అవుతుంది.

అందుకే.. భవిష్యత్తులో ఈ ఫ్యాక్టరీకి మళ్లీ సమస్యలు రాకూడదంటే.. నేను ఈ ఫ్యాక్టరీలో ఉండకూడదు. నా నిర్ణయాన్ని స్వాగతించండి అని చెప్పి.. ఫ్యాక్టరీ డాక్యుమెంట్లను బాబాయికి అప్పగించి తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు ప్రేమ్.. ముప్పి లహరి ఆఫీసుకు వెళ్తాడు.

అక్కడ ప్రొడ్యూసర్ తో ముప్పి లహరి మాట్లాడటం చూస్తాడు. ఏమైంది అని వేరే వ్యక్తిని అడుగుతాడు. దీంతో సార్ పాట రాశారు. అద్భుతంగా ఉంది.. అని చెప్పి.. దాని జీరాక్స్ ఒకసారి చూపిస్తాడు. దీంతో ఇది నేను రాసే పాటే అని అనుకొని షాక్ అవుతాడు ప్రేమ్.

వెంటనే తన దగ్గరికి వెళ్లి సీరియస్ అవుతాడు. ఆ పాట రాయడానికి ఎంత స్ట్రగుల్ అయ్యానో తెలుసా సార్. ఈ పాట నాకు పేరు తీసుకొస్తుందిన ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? నాకు పాటలు రాయడం చేతగాదేమో అని భయపడ్డాను కానీ.. ఇంత మోసం చేస్తారని అనుకోలేదు సార్ అంటాడు ప్రేమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది