Intinti Gruhalakshmi 27 Nov Today Episode : లాస్యకు షాక్ ఇచ్చి తులసితో కలిసి వెల్ నెస్ సెంటర్ కు వెళ్లిన నందు.. దీంతో లాస్య షాకింగ్ నిర్ణయం
Intinti Gruhalakshmi 27 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 నవంబర్ 2021, శనివారం ఎపిసోడ్ 488 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసితో కలిసి అందరూ వెల్ నెస్ సెంటర్ కు వెళ్తే వారం పాటు మనమంతా ఫ్రీ బర్డ్స్. ఈ ఇంట్లో మనం తప్పితే ఇంకెవరూ ఉండరు.. అంటుంది లాస్య. ఎంజాయ్ చేద్దాం అంటుంది లాస్య. కానీ.. నందు మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తనకు ఏ సమాధానం చెప్పడు. రేపు గోల్డ్ షాపునకు వెళ్దాం అనుకన్నా కదా.. ఆ షాపు అతనికి ఫోన్ చేస్తా అని చెప్పి వెళ్తుంది లాస్య.

intinti gruhalakshmi 27 november 2021 full episode
ఇంతలో అభి.. నందు దగ్గరికి వస్తాడు. అభి రేపు మార్నింగ్ కదా బయలుదేరేది. అంతా రెడీయేనా అంటాడు నందు. నందు కాస్త టెన్షన్ పడతాడు. మమ్మీ విషయంలో అందరికీ అబద్ధం చెప్పాను అంటాడు అభి. మమ్మీని స్ట్రెస్ తగ్గడం కోసం తీసుకెళ్లడం లేదు అంటాడు అభి. మమ్మికి గర్భసంచిలో ట్యూమర్ ఉంది. పొరపాటున అది క్యాన్సర్ అయ్యే చాన్స్ ఉందేమోనని డౌట్ అంటాడు అభి. దీంతో నందు షాక్ అవుతాడు. డాడీ.. ఇది జస్ట్ నా అనుమానం మాత్రమే కన్ఫమ్ గా చెప్పలేము. టెస్ట్ చేస్తే అనుమానం తీరుతుందని తీసుకెళ్తున్నాం అంటాడు అభి.కట్ చేస్తే ఉదయం అవుతుంది. అందరూ వెల్ నెస్ సెంటర్ కు రెడీ అవుతారు. కానీ.. నందు కనిపించడు. మరోవైపు నందు తన లగేజ్ సర్దుకుంటాడు.
లాస్య వచ్చి ఏం చేస్తున్నావు నందు. మనం గోల్డ్ షాపుకు వెళ్దాం అనుకున్నాం కదా అంటుంది.నేను తులసి వాళ్లతో పాటు బయలుదేరుతున్నా అంటాడు నందు. వెళ్లనన్నావు కదా అంటుంది లాస్య. ఏ హోదాతో తులసితో వెళ్తున్నావో తెలుసుకోవచ్చా అంటుంది లాస్య. పాతికేళ్ల పాటు తనతో సేవలు చేయించుకున్న వ్యక్తిగా వెళ్తున్నాను అంటాడు నందు.నాకు ఇచ్చిన మాట తప్పుతున్నావు. కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ లేదా అంటుంది లాస్య. నీకిచ్చిన మాట కన్నా.. తులసి కోసం ఈమాత్రం కూడా చేయకపోతే ఎలా. అందుకే వాళ్లతో పాటు బయలుదేరుతున్నాను. ఇంతకీ నువ్వు వస్తున్నావా? లేదా? అని అడుగుతాడు నందు. నేను రాను అని ముందే చెప్పా కదా అంటుంది లాస్య. దీంతో సరే.. నేను వెళ్తున్నాను అంటాడు నందు.
Intinti Gruhalakshmi 27 Nov Today Episode : తులసితో కలిసి వెల్ నెస్ సెంటర్ కు వెళ్లిన నందు
నందు ఇంకా రాలేదు ఏంటి.. అని అనుకొని బయలుదేరబోతారు అందరూ. ఇంతలో నందు వస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. మరోవైపు నేను ఒంటరి దాన్ని అయిపోయాను అని అనుకుంటుంది లాస్య. నందుతో పెళ్లి అని అనుకున్నప్పుడే ఇలా జరగడం ఏంటి అని బాధపడుతుంది.ఇంతలో భాగ్య.. లాస్యకు ఫోన్ చేస్తుంది. ఏంటి ఒంటరిదానివి అయిపోయావా? అంటుంది భాగ్య. అందరూ తులసి మాయలో పడిపోయారు అంటుంది లాస్య. నువ్వు కూడా తులసి మాయలో పడిపోయావు.
తులసికి జబ్బు ఉందని అందరినీ నమ్మించింది. చివరకు నిన్ను కూడా నమ్మేలా చేసింది అని అంటుంది భాగ్య.కట్ చేస్తే అందరూ వెల్ నెస్ సెంటర్ కు వస్తారు. అందరూ లోపలికి వెళ్తారు. తులసికి వెల్ నెస్ సెంటర్ బాగా నచ్చుతుంది. బాగుందిరా. రెండు వారాలు ఏంటి.. నేను చనిపోయేవరకు ఇక్కడే ఉంటా అంటుంది తులసి. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంకోసారి అలా అనొద్దు అని తులసికి చెబుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.