Intinti Gruhalakshmi 28 Dec Today Episode : తులసికి సీరియస్.. సర్జరీ చేసినా కష్టం అన్న డాక్టర్.. షాక్ లో కుటుంబ సభ్యులు

Authored By Varun G | The Telugu News | Published on: December 28, 2021, 12:20 pm

Intinti Gruhalakshmi 28 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 డిసెంబర్ 2021, మంగళవారం 514 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు చాలా బాధపడుతూ ఉంటాడు. లాస్యతో పెళ్లి అయినా కూడా నందు తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో లాస్య వస్తుంది. ఏంటి.. నందు నువ్వు కొత్త పెళ్లికొడుకువు. ఎందుకు ఇలా ఉన్నావు.. అంటుంది. దీంతో నువ్వు ఆడిస్తే ఆడించినట్టు ఆడే కీలుబొమ్మను కాదు నేను అంటాడు నందు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మన ఫస్ట్ నైట్.. నువ్వు ఇలా చేస్తున్నావు ఎందుకు.. అంటే. నా ఫ్యామిలీ మొత్తం నన్ను వదిలి తులసి దగ్గరికి వెళ్లిపోయింది.. అంటాడు. వాళ్లు వెళ్లిపోతే నేనేం చేయాలి. నేను వాళ్లను ఎంతో బతిమిలాడాను కదా అంటుంది లాస్య.

intinti gruhalakshmi 28 december 2021 full episode

intinti gruhalakshmi 28 december 2021 full episode

నువ్వు బతిమిలాడటం అయిపోయింది.. బెదిరించడం అయిపోయింది.. వాళ్లు నీవల్లే నన్ను వదిలేసి ఆ తులసి దగ్గరికి వెళ్లిపోయారు.. అంటాడు నందు. ఊరికే తులసి తులసి అంటూ ఎందుకు మాట్లాడుతున్నావు. తులసి ఇప్పుడు నీ భార్య కాదు. మాజీ భార్య. నేను నీ భార్యను. పదే పదే తులసి పేరు ప్రస్తావించకు అంటుంది. నువ్వు కూడా నా వాళ్ల గురించి జాగ్రత్తగా మాట్లాడు. వాళ్లు లేకుండా నేను బతకలేను. వాళ్లను వదిలి బతకాల్సి వస్తే.. అది మన రిలేషన్ షిప్ మీద పడుతుంది.. అనగానే లాస్య భయపడిపోతుంది. వద్దు నందు.. నువ్వు అంత పని చేయకు. నేను మీ వాళ్లను తీసుకొస్తాను. వాళ్లతో జాగ్రత్తగా మాట్లాడుతాను అని చెబుతుంది లాస్య. దీంతో నందు కాస్త కూల్ అవుతాడు.

మరోవైపు తులసి నందు పెళ్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అనసూయ, పరందామయ్య వస్తారు. దేని గురించి ఆలోచిస్తున్నావమ్మా అంటారు. మీ అబ్బాయి గురించి అంటుంది తులసి. వాడు మా కొడుకే కాదు. ఎప్పుడైతే లాస్యను పెళ్లి చేసుకున్నాడో వాడు మాకు కొడుకే కాదు.. అంటారు.

ఏ అబ్బాయికైనా తన తల్లిదండ్రులు తన ముందు ఉండాలి అని అనుకుంటాడు.. అంటుంది తులసి. నీకు వద్దంటే చెప్పు. మేము వెళ్లి ఇంటి బయట పడుకుంటాము కానీ.. వాడి దగ్గరికి వెళ్లేదే లేదు అంటుంది. అలా అనకు అత్తయ్య అంటుంది తులసి. అవన్నీ పక్కన పెట్టు ఒక మంచి పాట పాడు అంటారు అనసూయ, పరందామయ్య.

మరోవైపు లాస్య, నందు ఫస్ట్ నైట్ కు ఏర్పాటు చేస్తుంది. నందు.. నీకో సర్ ప్రైజ్ అంటుంది. బెడ్ ను చూపిస్తుంది. కానీ.. నందుకు అస్సలు ఏం అర్థం కాదు. ఈరోజు మనం కోపాలు తాపాలు అన్నీ పక్కన పెట్టి ప్రేమించుకుందాం అంటుంది లాస్య. కానీ.. నందు మాత్రం అస్సలు ఏం మాట్లాడడు.

Intinti Gruhalakshmi 28 Dec Today Episode : ఓవైపు నందు లాస్య ఫస్ట నైట్.. మరోవైపు తులసికి సీరియస్

ఈరోజు మన ఫస్ట్ నైట్. నన్ను డిసప్పాయింట్ చేయకు నందు అంటుంది తులసి. మరోవైపు తులసి పాట పాడుతూ ఉంటుంది. వేణుమాధవా అని పాటపాడుతూ ఉంటుంది. పాట పాడటం విని నందు బయటికి వస్తాడు. నందు బయటికి వచ్చి తులసి పాట పాడటం చూస్తాడు. తనకు అన్నీ గుర్తుకు వస్తాయి.

పాట పాడుతూనే తులసి కింద పడిపోతుంది. దీంతో తులసి అని అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు నందు. తనతో పాటు లాస్య కూడా వస్తుంది. అభి డాక్టర్ కు కాల్ చేయ్. ప్రేమ్ కారు రెడీ చేయ్ అంటాడు. నందు.. తులసిని ఎత్తుకొని వెళ్లడం చూసి లాస్యకు కోపం వస్తుంది.

ఆసుపత్రికి తీసుకెళ్లాక.. చెక్ చేస్తాడు అధ్వైత కృష్ణ. డాక్టర్ ఎలా ఉంది కండిషన్ అని అడుగుతారు. రిపోర్ట్స్ చూశాను. సర్జరీ చేయాలి అంటాడు. కాకపోతే.. ఆ తర్వాత ఏం చేయాలి అనేది ఆ భగవంతుడి నిర్ణయమే అంటాడు కృష్ణ. మేము ఆపరేషన్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అంటాడు.

ఫస్ట్ నైట్ కాకముందే నందు వెళ్లిపోవడంతో లాస్యకు కోపం వస్తుంది. వెంటనే నందుకు ఫోన్ చేస్తుంది కానీ.. నందు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇంతలో భాగ్య వస్తుంది. నువ్వు మామూలుగా పక్కన ఉన్నప్పుడే నిన్ను పట్టించుకోలేదు. ఇక ఫోన్ చేస్తే మాత్రం పట్టించుకుంటాడా అని అంటుంది భాగ్య.

అక్కడికే వెళ్లి ఏదో ఒకటి తేల్చుకుంటాను అంటుంది లాస్య. దీంతో తేల్చుకోవాల్సింది వాళ్లతో కాదు అంటుంది. మరోవైపు తులసికి ఆపరేషన్ జరుగుతుంది. తులసికి రక్తం బాగా పోవడం వల్ల.. రక్తం కావాలి అని అంటాడు డాక్టర్. కానీ తనది రేర్ బ్లడ్ గ్రూప్ అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp