Intinti Gruhalakshmi 30 Nov Today Episode : అనసూయకు అనారోగ్యం.. లాస్య కుట్రలు తెలుసుకున్నాక పశ్చాతాపపడ్డ అనసూయ.. కానీ ఇంతలో అనుకోని ఘోరం

Authored By Varun G | The Telugu News | Updated on: November 30, 2022, 9:38 am

Intinti Gruhalakshmi 30 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 నవంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 803 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సామ్రాట్, తులసి ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్లి కుల్ఫీ తింటారు. అయితే.. డబ్బులు ఇద్దామని అనుకునే సరికి సామ్రాట్ పర్సు కనిపించదు. దీంతో ఏం చేయాలో సామ్రాట్ కు అర్థం కాదు. దీంతో నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది. అప్పుడు ఇలాగే ఐస్ క్రీమ్ తిని డబ్బులు ఇవ్వకుండా పారిపోయేవాళ్లం. ఇప్పుడు అదే చేద్దాం అంటుంది తులసి. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. వద్దు అంటాడు. బాగోదు అంటాడు కానీ.. ఏం కాదు రండి పరిగెడదాం అంటుంది. ఇదే చాన్స్ బండి అతడు మనల్ని చూడటం లేదు. లాగించేద్దాం అంటుంది తులసి. రెడీగా ఉండండి. ఒన్, టూ, త్రీ అంటాను అంటుంది. దీంతో ఎందుకైనా మంచిది… ఒక 10 వరకు లెక్కబెట్టండి అంటుంది. దీంతో వద్దు అంటుంది తులసి.

intinti gruhalakshmi 30 november 2022 full episode

intinti gruhalakshmi 30 november 2022 full episode

ఒన్, టూ, త్రీ.. అతడు చూడట్లేదు పరిగెత్తండి.. పరిగెత్తండి అంటుంది. దీంతో తులసి గారు అంటూ ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. చివరకు ఐస్ క్రీమ్ బండి అతడిని డబ్బులు ఇవ్వకుండా వచ్చాం అంటాడు సామ్రాట్. దీంతో అవసరం లేదు.. నేను అతడికి ముందే డబ్బులు ఇచ్చేశాను. మీరే చూడలేదు అంటుంది తులసి. మరోవైపు పరందామయ్య.. ఇంకా అనసూయ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అనసూయ.. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అంటుంది అనసూయ. లేచి అలా కూర్చో లేకపోతే మోకాళ్ల నొప్పులు వస్తాయి అంటాడు. నేను ఘోరమైన పాపం చేశాను. నా పాపానికి పరిష్కారం ఏంటో.. నేను ఏం చేయాలో చెప్పండి అంటుంది అనసూయ. దీంతో నేను నిన్ను శిక్షించాల్సిన అవసరం లేదు. దేవుడే నిన్ను శిక్షించాడు. నువ్వు ఇదివరకు ఈ ఇంటి యజమానురాలివి. కానీ.. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా అయింది. తులసితోనే నీకు ప్రాబ్లమ్ గా ఉండేది అంటాడు పరందామయ్య.

నా మనసు నాతో పాటు ఇక్కడికి రాలేదు అనసూయ. ఈ ఇల్లు నాకు కాటేయడానికి వెంటపడుతున్న దురదృష్టంలా అనిపిస్తోంది. అసలు మన ఇల్లు అనే భావనే రావడం లేదు. ఈ ఇల్లు ఇల్లులాగానే అనిపించడం లేదు అంటాడు పరందామయ్య.

నాకు నేను చాలా తెలివైన దాన్ని. అన్నీ తెలుసు అనుకునే దాన్ని. నిజంగా తెలివే ఉండి ఉంటే లాస్య మాయలో ఎందుకు పడతాను అని అనుకుంటుంది అనసూయ. అయిపోయిందేదో అయిపోయింది. బాధ పెరగడం తప్ప మనం చేసేది ఏం ఉండదు అంటాడు పరందామయ్య.

Intinti Gruhalakshmi 30 Nov Today Episode : లాస్యను బయటికి పంపించి అందరితో మాట్లాడిన అనసూయ

మీరు క్షమించరని తెలుసు అయినా కూడా రోజూ క్షమించమని అడుగుతూనే ఉంటాను. రోజూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటూనే ఉంటాను. ఏదో ఒక రోజు మీరు నన్ను క్షమిస్తారని చిన్న ఆశ అంటాడు పరందామయ్య.

వెళ్లొద్దండి అన్నా కూడా వినకుండా.. అక్కడి నుంచి అనసూయను వదిలి ఇంట్లో నుంచి వెళ్లపోబోతుంటాడు. ఇంతలో అనసూయ స్పృహ తప్పి కింద పడిపోతుంది. మరోవైపు మిమ్మల్ని నాతో తిప్పుతున్నాను. మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాను అంటుంది తులసి.

ఇంతలో తన కారును రిపేర్ చేసి మెకానిక్ తీసుకొస్తాడు. దీంతో సామ్రాట్ వెళ్లిపోతాడు. తులసి నడుచుకుంటూ వెళ్తుంటుంది. ఇంతలో ప్రేమ్ నుంచి ఫోన్ వస్తుంది తులసికి. నానమ్మ స్పృహ తప్పి పడిపోయింది అని చెబుతాడు. దీంతో ఇప్పుడే వస్తున్నా అని చెబుతుంది.

అమ్మా… ఏమైంది అంటాడు నందు. కళ్లు తిరిగి పడిపోయింది అంటాడు పరందామయ్య. అంకిత.. ఇంజెక్షన్ ఇవ్వు అంటాడు అభి. ఇంజెక్షన్ చేస్తాడు. ఇంతలో తులసి వస్తుంది. అత్తయ్య అంటుంది. భయపడాల్సింది ఏం లేదు కదా అంటుంది.

దీంతో ఇప్పటికైతే ఏం లేదు ఆంటి. అభి ఇంజెక్షన్ ఇస్తున్నాడు అంటుంది అంకిత. 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాలి. అప్పుడు కానీ ఏం చెప్పలేం అంటాడు అభి. తులసిని చూసి దగ్గరికి రా అంటుంది అనసూయ.

కంగారు పడకండి అంటుంది తులసి. నేను అంటూ ఏదో చెప్పబోతుండగా నీరసంగా ఉన్నారు ఇప్పుడు ఏం మాట్లాడకండి అంటుంది అనసూయ. అయినా వినదు. మందుల వల్ల ఆరోగ్యం కుదుటపడదు. నన్ను మాట్లాడనివ్వు అంటుంది అనసూయ.

లాస్య.. అంటూ పిలుస్తుంది. నువ్వు బయటికి వెళ్లు అంటుంది అనసూయ. దీంతో లాస్య షాక్ అవుతుంది. నన్ను ఎందుకు బయటికి వెళ్లమంటున్నారు అంటుంది లాస్య. దీంతో అమ్మ మాట అర్థం చేసుకో అంటాడు నందు.

మరి తులసి ఎందుకు వచ్చింది. తను పరాయిమనిషి కదా. తను ఎందుకు వచ్చింది అంటుంది లాస్య. ఒక పరాయి మనిషితో మాట్లాడటానికి కోడలును బయటికి పంపించడం ఏంటి. మర్యాదల గురించి మాట్లాడే పెద్దవాళ్లు మౌనంగా ఉండటం ఏంటి అంటుంది లాస్య.

లాస్య.. ప్లీజ్ వెళ్లు ఇక్కడి నుంచి అంటాడు నందు. అమ్మమ్మ ఇప్పుడు చెప్పండి అంటుంది అంకిత. సారీ అమ్మ అంటుంది అనసూయ. నిన్ను అవమానించింది కేవలం నా భర్తను కాదు నీ తండ్రిని. కేవలం మీ మామయ్య మనసు గాయపరిచి మీ అందరినీ ఏడిపించాను అంటుంది అనసూయ.

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దేవుడికి పూజ చేస్తునే ఉన్నాను. అంతో ఇంతో పుణ్యం వచ్చి ఉంటుంది. కానీ.. ఆయన విషయంలో నేను చేసిన పాపం నా పుణ్యాన్ని గంగపాలు చేసింది. ఇక్కడున్న అందరినీ క్షమించమని వేడుకుంటున్నాను.

దయచేసి నన్ను క్షమించండి అంటుంది అనసూయ. దీంతో మేమంతా మీకన్నా చిన్నవాళ్లం. మీరు చేతులు జోడించడం ఏంటి అంటుంది తులసి. జరిగిందంతా మరిచిపోదాం అంటాడు నందు. దీంతో ఎలా మరిచిపోను అంటుంది అనసూయ.

నాకు చెబుతున్నారు కానీ.. మీరు మరిచిపోగలరా? మీ అందరినీ బాధపెట్టాను అంటుంది అనసూయ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp