Bigg Boss 6 Telugu : ఈ వారం బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయ్యేది వీళ్ళే.. ఎవరు ఊహించరు కూడా..!
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి ఇప్పటి ఆరవ సీజన్ వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకొనుంది. ఎన్నో ఊహించని మలుపులతో భావోద్వేగాల మధ్య బిగ్ బాస్ లాస్ట్ కు చేరుకుంది. గడిచిన రెండు వారాల నుండి ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా జరిగిపోయిన నామినేషన్స్ ఈ వారం మాత్రం చాలా ఆసక్తికరంగా జరిగింది. గతవారం రాజ్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లడానికి
నామినేట్ అయిన ఇంటి సభ్యులు పైమా, శ్రీ సత్య, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ మరియు రేవంత్. వీరిలో అతి తక్కువ ఓట్లతో ఎవరు బిగ్ బాస్ ని వీడి వెళ్లిపోబోతున్నారు అనేది చూడాలి. ఇక రేవంత్ అందరికంటే ఎక్కువ ఓట్లతో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు. ప్రతి వారం ఇలా జరగటం కామన్ పాయింట్ అయిపోయింది. ఇక ఆయన తర్వాత రోహిత్ అత్యధిక ఓట్లతో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక వీళ్లిద్దరి తర్వాత మూడవ స్థానంలో కీర్తి కొనసాగుతుంది. చేతివేళ్లు విరిగిపోయిన కూడా ఏమాత్రం తగ్గకుండా కీర్తి ఆడుతున్న టాస్కులను చూసి ప్రేక్షకులలో సానుభూతి పెరుగుతుంది.
కాబట్టి ఈమె ఖచ్చితంగా టాప్ 5 లిస్టులో ఉండే ఛాన్స్ ఉంది.ఇక తర్వాత స్థానంలో ఆది రెడ్డి ఉన్నాడు. మొదటి రోజు నుండి ఇప్పటివరకు ఆదిరెడ్డి తనకి కరెక్ట్ అనిపించిన విధంగానే ఆడుకుంటూ వస్తున్నాడు. ఇతనికి కూడా టాప్ 5 లో అడుగుపెట్టే వీలు ఉంది. నిన్న జరిగిన నామినేషన్ లో కూడా సరైన పాయింట్స్ తో రేవంత్ ని ఓడించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక చివరి రెండు స్థానాల్లో డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ శ్రీ సత్య, పైమా ఉన్నారు. శ్రీ సత్య కంటే ఫైమాకు తక్కువ ఓటింగ్ ఉంది. రాబోయే రోజుల్లో ఆమె తన ఆటలు మెరుగుపర్చుకోకపోతే ఎలిమినేట్ అవ్వక తప్పదు.