Intinti Gruhalakshmi 6 Jan Today Episode : లాస్యకు జాబ్.. నందుకు రాని ఉద్యోగం.. తన ఉద్యోగం ఉందని ఇంట్లో హడావుడి చేసిన లాస్య.. దీంతో నందు షాకింగ్ నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 6 Jan Today Episode : లాస్యకు జాబ్.. నందుకు రాని ఉద్యోగం.. తన ఉద్యోగం ఉందని ఇంట్లో హడావుడి చేసిన లాస్య.. దీంతో నందు షాకింగ్ నిర్ణయం

Intinti Gruhalakshmi 6 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 జనవరి 2022, గురువారం ఎపిసోడ్ హైలైట్ప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఇంటి మీద హక్కు పూర్తిగా నీదే అని నాన్న గారు చెప్పడంతో నీ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది.. అని తులసితో నందు అంటాడు. ఆ తర్వాత తులసి చాలా విషయాలు పట్టించుకోవడం మానేస్తుంది. నందు, లాస్య.. ఇద్దరూ ఇంటర్వ్యూ కోసం […]

 Authored By gatla | The Telugu News | Updated on :6 January 2022,12:00 pm

Intinti Gruhalakshmi 6 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 జనవరి 2022, గురువారం ఎపిసోడ్ హైలైట్ప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఇంటి మీద హక్కు పూర్తిగా నీదే అని నాన్న గారు చెప్పడంతో నీ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది.. అని తులసితో నందు అంటాడు. ఆ తర్వాత తులసి చాలా విషయాలు పట్టించుకోవడం మానేస్తుంది. నందు, లాస్య.. ఇద్దరూ ఇంటర్వ్యూ కోసం రెడీ అవుతారు. కానీ.. తనకు ఇంటర్వ్యూ తొందరగా ఉండటంతో లాస్య కారు తీసుకొని త్వరగా వెళ్లిపోతుంది. దీంతో నందుకు ఎలా వెళ్లారో అర్థం కాదు. మరోవైపు ఫ్యాక్టరీకి బయలుదేరుతుంది తులసి. లంచ్ బాక్స్ తీసుకొని తన స్కూటీ మీద వెళ్లబోతుంది. క్యాబ్ బుక్ చేస్తుంటే అది బుక్ కాదు. దీంతో తులసిని వెళ్లి అడుగు.. అని చెబుతారు అనసూయ, పరందామయ్య. దీంతో వెళ్లి తులసిని లిఫ్ట్ అడిగేందుకు మొహమాట పడతాడు నందు. దీంతో ఏమైంది.. లిఫ్ట్ కావాలా అని అడుగుతుంది తులసి. లాస్య మిమ్మల్ని వదిలేసిందా.. అని అడుగుతుంది. అంటే.. కారులో తీసుకెళ్లకుండా వెళ్లిందా.. అని అంటుంది.

intinti gruhalakshmi 6 january 2022 full episode

intinti gruhalakshmi 6 january 2022 full episode

నేను నడపనా అంటాడు నందు. నా జీవితాన్ని, నా బండిని ఇంకొకరి చేతుల్లో పెట్టే ఉద్దేశం నాకు లేదు. రండి.. కూర్చొండి అని నందును తీసుకెళ్తుంది తులసి. తన ఆఫీసు దగ్గర ఆపుతుంది. ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యారా అని అడుగుతుంది తులసి. పాతికేళ్ల అనుభవం.. ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు అంటాడు. మరోవైపు అంకిత.. అంకిత అంటూ వస్తాడు అభి. నీతో అర్జెంట్ గా మాట్లాడాలి అంటాడు. నాకు అర్జెంట్ గా 50 వేలు కావాలి.. అంటాడు. ఒక ఫ్రెండ్ దగ్గర లోన్ తీసుకున్నాను. ఈరోజే తిరిగి ఇవ్వాలి. వాడు చాలా ప్రెజర్ పెడుతున్నాడు.. అని అంటుంది. ఇప్పుడు దాని గురించి ఎందుకు. ముందు ఇస్తావా ఇవ్వవా అని అడుగుతాడు. నీ దగ్గర ఉన్న గోల్డ్ ఇస్తావా.. ప్రస్తుతానికి ఈ గండం నుంచి గట్టెక్కుతాం.. అంటాడు. దీంతో తన నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బులు కట్టుకో అని చెబుతుంది అంకిత. కాకపోతే పండక్కి ముందే తెచ్చి ఇవ్వాలి అని చెబుతుంది అంకిత. మరోవైపు నందు ఇంటర్వ్యూకు అటెండ్ అవుతాడు.

తన ఫైల్ చూస్తాడు. మిస్టర్ నందు. మీ ఫైల్ కాసేపు పక్కన పెడదాం. నా పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మాకు కావాల్సింది యువ రక్తం. యంగ్ స్టర్స్ కొత్త ఐడియాలతో కంపెనీని అభివృద్ధి చేయాలని అనుకుంటారు.. మీరు వెళ్లిపోవచ్చు అని చెబుతాడు.

Intinti Gruhalakshmi 6 Jan Today Episode : ఉద్యోగంలో సెలెక్ట్ కాని నందు

దీంతో.. ఆవేశం మాత్రమే పనికిరాదు. దానికి అనుభవం కూడా తోడుండాలి.. 46 ఏళ్ల ఒక మహిళ నాకు తెలుసు. తను పెద్దగా చదువుకోలేదు. తన జీవితం మొత్తం 4 గోడల మధ్యే గడిపేసింది. ఇప్పుడు తను ఒక ఫ్యాక్టరీని ఎండీ. ఎంతో నేర్చుకొని ఇప్పుడు గొప్పగా బిజినెస్ రన్ చేస్తుంది అంటాడు నందు. అయినప్పటికీ.. ఇంటర్వ్యూయర్ ఒప్పుకోడు.

దీంతో నందు ఆఫీసు నుంచి బయటికి వచ్చేస్తాడు. లాస్యకు ఫోన్ చేస్తాడు కానీ.. లిఫ్ట్ చేయదు. తనకు అస్సలు బాధ్యత లేదు అంటూ అనుకొని వెనుదిరుగుతాడు నందు. మరోవైపు తులసి ఇంటికి వచ్చేస్తుంది. ఫ్యాక్టరీ నుంచి వచ్చేసి.. అత్తయ్య మీకు టీ తెస్తాను అంటుంది. నందు కూడా అప్పుడే వస్తాడు.

నందు తనకు ఎదురు పడతాడు. కానీ.. ఏం మాట్లాడుకోరు. ఇంతలో లాస్య కూడా వస్తుంది. తలనొప్పి లేస్తుంది టీ తీసుకురా అని అడుగుతాడు నందు. ఏంటి.. ఈ లాస్య నీకు టీ తీసుకొని రావాలా? నేను తులసిలా వెట్టి చాకిరీ చేస్తూ కూర్చోవాలా? అది ఎప్పటికీ జరగదు అని లాస్య చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది