Intinti Gruhalakshmi 7 March Today Episode : ఒంటరైన తులసి.. అభి, అంకిత, దివ్య.. అందరూ తులసిపై ఫైర్.. లాస్యకు సపోర్ట్ చేసిన దివ్య.. ప్రేమ్, శృతి ఎక్కడికి వెళ్లారు?
Intinti Gruhalakshmi 7 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 మార్చి 2022, సోమవారం ఎపిసోడ్ 573 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్, శృతి.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. రోడ్డు మీద ఉత్త చేతులతో నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇలా ఎంత దూరం వెళ్తాం ప్రేమ్ అంటుంది శృతి. తెలియదు అంటాడు ప్రేమ్. ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్దామా అంటుంది. తెలియదు అంటుంది. ఇలా ఎంత దూరం వెళ్తాం అంటుంది శృతి. దీంతో నువ్వు అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు అంటాడు ప్రేమ్. దీంతో పక్కనే ఉన్న గుడికి వెళ్తారు ప్రేమ్, శృతి. అక్కడ హారతి తీసుకొని కొంత సేపు గుడిలో కూర్చుంటారు. ఇది అన్యాయం ప్రేమ్.. ఆంటి ఇలా చేస్తుందని అనుకోలేదు అంటుంది శృతి. జాబ్ లో తీసేసేటప్పుడు కూడా నోటీస్ పీరియడ్ ఇస్తారు. ఇలా సడెన్ గా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మానవత్వం కనిపించదా.. అయ్యో అనిపించదా అంటుంది శృతి.
ఆంటి కొట్టింది మనసు మీద దెబ్బ.. చెంప దెబ్బ కాదు. మనసుకు తగిలిన దెబ్బ.. దాని తాలుకా గాయం జీవితాంతం గుర్తుండిపోతుంది అంటుంది శృతి. ఇవన్నీ పట్టించుకుంటూ పోతే జీవితంలో ముందుకు వెళ్లలేం అంటాడు ప్రేమ్. ఖచ్చితంగా అమ్మ నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అంటాడు ప్రేమ్. అందరితో బంధం ఏర్పరుచుకున్నాం. కానీ.. ఇప్పుడు ఎవ్వరూ లేని అనాథలమయ్యాం అంటుంది శృతి. ఇప్పుడు నేను ఏ గొడవ గురించి ఆలోచించడం లేదు. నా శృతి గురించి మాత్రమే ఆలోచిస్తున్నా అంటాడు. ఇన్నాళ్లు నిన్ను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు నా ముందు ఉన్న బాధ్యత నువ్వే. ఏ లోటూ లేకుండా నిన్ను చూసుకోవడమే ఇప్పుడు నా బాధ్యత అంటాడు ప్రేమ్.
ఆంటి మీద నీకు ఉన్న ప్రేమ నాకు తెలుసు. కానీ.. దాని గురించి ఆలోచిస్తూ ఉంటావనుకున్నా.. అంటుంది శృతి. అదంతా ఒకే కానీ.. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్లాలి అని అంటుంది శృతి. దీంతో తెలిసిన వాళ్ల ఇంటికి, బంధువుల ఇంటికి వెళ్లాలనిపించడం లేదు. చూద్దాం.. ఆ దేవుడే మనకు ఒక దారి చూపుతాడు అంటాడు ప్రేమ్.
మరోవైపు ఆంటి ప్రవర్తన ఏంటో అర్థం కావడం లేదు అభి అని అంటుంది అంకిత. ఇంత గొడవ జరిగింది. ప్రేమ్ శృతిలను ఇంట్లో నుంచి పంపించింది. ఆ తర్వాత అందరినీ భోజనాలకు పంపించింది అంటుంది. అలా ఎందుకు అనుకుంటావు.. మామ్ కు కూడా బాధగానే ఉంటుంది అంటాడు అభి.
ఇంత పని చేసి.. మళ్లీ భోజనాలకు రమ్మంటుంది. అసలు తులసి మనిషేనా అంటుంది లాస్య. అనసూయ కూడా చాలా కోపంగా ఉంటుంది. అందరూ తులసి మీదనే విరుచుకుపడతారు. తులసి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మామ్ మారిపోయింది. మామ్ ను నమ్మకూడదు. దూరంగా ఉండాలి అని అనుకుంటుంది దివ్య.
Intinti Gruhalakshmi 7 March Today Episode : అందరూ భోజనాలకు కూర్చున్నా.. తులసి మీద కోపంతో భోం చేయరు
ఇంతలో అందరినీ పిలిచావా అని రాములమ్మను అడుగుతుంది తులసి. దీంతో అందరినీ పిలిచాను అమ్మ అంటుంది తులసి. ఇంకా రాలేదు.. మరోసారి రమ్మని చెప్పు అంటుంది తులసి. దీంతో అందరూ అక్కడికి వస్తారు. అప్పటికే అరటి ఆకుల మీద భోజనం వడ్డించి ఉంటుంది.
అందరినీ కూర్చోమని చెబుతుంది. అందరూ కూర్చుంటారు కానీ.. ఎవ్వరూ భోజనం చేయరు. దీంతో ఎందుకు ఎవ్వరూ భోం చేయడం లేదు. పండుగ పూట అందరూ పస్తులు ఉండటం మంచిది కాదు. భోం చేయండి అంటుంది. కానీ.. ఎవ్వరూ తినరు.
అత్తయ్య తినండి.. అంటుంది తులసి. దీంతో నాకు ఆకలిగా లేదు.. అంటుంది అనసూయ. అభి కూడా అదే చెబుతాడు. దివ్య అయితే ఏం మాట్లాడదు. దీంతో అందరూ కలిసి నా మీద స్ట్రయిక్ చేస్తున్నారా అంటుంది తులసి. దీంతో మాకు చెప్పడం కాదు.. నువ్వు తిని చూపించు. గొంతు దిగుతుందేమో చూస్తాం అంటారు కుటుంబ సభ్యులు.
దీంతో తను తిని చూపిస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. నేను తిన్నాను కదా. ఇప్పుడు మీరంతా తినడం మొదలు పెట్టండి అంటుంది తులసి. తను తింటుంది. హ్యాపీగా తింటుంది. మీ మాజీ కోడలు పంతానికి పట్టింపులకు పోతే ఎవ్వరి మాటా వినదు కదా అంటుంది లాస్య.
ఆపుతావా నీ గోల. నా పిల్లల విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పా కదా అంటుంది తులసి. దీంతో కనీసం మా తరుపున అయినా ఎవ్వరో ఒకరిని మాట్లాడనీయు మామ్ అంటుంది దివ్య. దీంతో తులసి షాక్ అవుతుంది. ప్రేమ్ తండ్రిగా అడుగుతున్నాను. ఇదివరకు ప్రేమ్ చాలా సార్లు నన్ను వేలెత్తి చూపించాడు. గొడవ పెట్టుకున్నాడు అంటాడు నందు.
అప్పుడు ప్రేమ్ ను బయటికి పంపించకుండా.. ఇప్పుడే ఎందుకు బయటికి పంపించావు అని అడుగుతాడు నందు. ఆ నిజం ఏంటో కూడా నాకు తెలుసు అంటాడు నందు. దీంతో తులసి టెన్షన్ పడుతుంది. ప్రేమ్ కి, నాకు మధ్య వాదన పెరిగితే నేను కుటుంబం కోసం పడ్డ కష్టాలు పిల్లలకు తెలిసి పోయి తన గొప్పదనం తగ్గుతుందని ప్రేమ్ ను తరిమేసింది అంటాడు నందు.
దీంతో తులసి ఊపిరి పీల్చుకుంటుంది. నీ నరనారల్లో సంపాదిస్తున్నానే అహంకారం పెరిగింది. అందుకే ఇలా తెగించి మాట్లాడుతున్నావు అంటాడు నందు. నేనేంటో నిరూపించుకునే రోజు ఎంతో దూరంలో లేదు. నేనేంటో అందరికీ తెలియజేస్తాను. ప్రేమ్ విషయంలో మీ అమ్మ చేసిన పని మంచి అనిపిస్తే హ్యాపీగా భోం చేయండి అని చెప్పి అక్కడి నుంచి లేచిపోతాడు నందు.
లాస్య కూడా వెళ్తుంది. వాళ్లు వెళ్తే వెళ్లారు.. మీరు తినండి అంటుంది తులసి. కానీ.. అందరూ తినకుండానే లేచి అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత భోజనం తీసుకొని దివ్య దగ్గరికి వెళ్తుంది తులసి. నీకే చెప్పేది అన్నం తిను అంటుంది తులసి. దీంతో ప్లేట్ ను తీసి కింద పడేస్తుంది దివ్య.
కన్నకొడుకును కళ్ల ముందు నుంచి పంపించడం శిక్ష అనరు మామ్.. శాడిజం అంటారు అంటుంది దివ్య. దివ్య నేను అమ్మనురా.. అమ్మ ప్రేమనే అనుమానిస్తావా అంటుంది తులసి. అనుమానించాల్సిన పరిస్థితి నువ్వే తీసుకొచ్చావ్ మామ్ అంటుంది దివ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.