Intinti Gruhalakshmi 8 Dec Today Episode : తనకు క్యాన్సర్ ఉందని చెప్పకుండా అందరూ మోసం చేశారని.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న తులసి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 8 Dec Today Episode : తనకు క్యాన్సర్ ఉందని చెప్పకుండా అందరూ మోసం చేశారని.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న తులసి

 Authored By gatla | The Telugu News | Updated on :8 December 2021,12:20 pm

Intinti Gruhalakshmi 8 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 డిసెంబర్ 2021, బుధవారం 497 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసికి అసలు నిజం చెబుతాడు అద్వైత కృష్ణ. దీంతో తులసి తట్టుకోలేకపోతుంది. అంటే నేను చనిపోబోతున్నానా. నేను చనిపోవడానికి నాకు ఇంకా ఎంత సమయం ఉంది అని అడుగుతుంది. చావు అనేది రావాల్సినప్పుడే వస్తుంది. మనం రావాలనుకున్నప్పుడు రాదు. ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పలేరు అంటాడు కృష్ణ. దీంతో నా ప్రశ్నకు సమాధానం అది కాదు అంటుంది తులసి. నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఆ కృష్ణుడికే తెలుసు. నిరాశతో ఈ బుట్టను చేజార్చుకున్నట్టు.. నీ ప్రాణాల మీద ఆశ వదులుకోకు తులసి. ఆశ వదులుకుంటే అన్నీ వదులుకున్నట్టే.. అని అంటాడు అద్వైత కృష్ణ.

intinti gruhalakshmi 8 december 2021 full episode

intinti gruhalakshmi 8 december 2021 full episode

అయినా కూడా నిరాశతోనే అక్కడి నుంచి వెళ్లిపోతుంటుంది తులసి. నాకు తెలుసు తులసి. నువ్వు ఇప్పుడు కూడా నీ గురించి ఆలోచించడం లేదు. నీ వాళ్ల గురించి ఆలోచిస్తున్నావు. అదే నీ గొప్పదనం. నిజంగా నీకు ఆ దేవుడు అన్యాయం చేశాడు.. అని అనుకుంటాడు అద్వైత కృష్ణ.

ఏదో కోల్పోయిన దానిలా తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎవ్వరూ నాకు క్యాన్సర్ అన్న విషయాన్ని ఎందుకు చెప్పలేదు. ఎందుకు దాచిపెట్టారు. ప్రేమ్ ఇంకా సెట్ కాలేదు. చిన్నారి దివ్య.. నేను లేకుంటే వీళ్లు ఏం కావాలి. దివ్య బాధ్యతలు ఎవరు చూసుకుంటారు. దాని పెళ్లి ఎవరు చేసుకుంటారు. అంకిత, శృతికి ఇంకా ఇంటి బాధ్యత తెలియదు. వాళ్లు ఇంకా ప్రతి దానికి నా మీద ఆధారపడుతుంటారు.. ఇప్పుడు వీళ్లందరి పరిస్థితి ఏంటి.. అని అనుకుంటుంది తులసి.

అక్కడి నుంచి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది తులసి. అక్కడి నుంచి రైలు పట్టాలు ఎక్కుతుంది. రైలు పట్టాల నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. అన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది. తనకు ఏం చేయాలో అర్థం కాదు. లాస్య గురించి కూడా ఆలోచిస్తుంది. నందును గుర్తుకు తెచ్చుకుంటుంది.

తనకు పిచ్చి లేస్తుంది. ఏం చేస్తుందో తెలియదు. రైలు పట్టాల మీద వేగంగా పరిగెడుతుంది తులసి. అలసిపోయే వరకు పరిగెడుతుంది. చివరకు ఒక చోట కూర్చుంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది తులసి. తల బాదుకుంటుంది. తనకు ఏం చేయాలో అర్థం కాదు. గట్టిగా అరుస్తుంది.

Intinti Gruhalakshmi 8 Dec Today Episode : తులసి ఇంట్లోకి రాగానే.. అది తిను.. ఇది తిను అంటూ హడావుడి చేసిన కుటుంబ సభ్యులు

కట్ చేస్తే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. పూల కోసం వెళ్లిన తులసి ఇంకా రాలేదు ఏంటి.. అని అనసూయ.. శృతితో అంటుంది. ఆంటికి ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఆంటి ఈ ప్లేస్ ను వదిలి ఎక్కడికీ వెళ్లదు అంటుంది తులసి. అందరూ తులసికి నచ్చిన స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలు అన్నీ తయారు చేస్తారు.

అయితే.. తను ఇంకా రాలేదు ఏంటి అని తన కోసం బయటికి వెళ్లబోతారు. ఇంతలో తను వస్తుంది. ఇంత సేపు ఎక్కడికి వెళ్లావు అమ్మ అని అడుగుతాడు ప్రేమ్. నువ్వు రాకపోయేసరికి ఎక్కడున్నావో చూద్దామని బయలుదేరాం అంటాడు నందు.

కానీ.. తులసి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఇంట్లోకి వెళ్లిపోతుంది. అందరూ తన కోసం తయారు చేసిన ఆహార పదార్థాల గురించి చెబుతారు. కానీ.. తను మాత్రం ఏం మాట్లాడదు. స్వీట్లు తినాలని ఒకరు.. కాదు కాదు.. పానీ పూరీ తినాలని మరికొందరు.. లేదు జింజర్ టీ అని అడుగుతారు. లేదంటే.. అందరూ కలిసి తులసినే చాయ్ చేయమంటారు. అందరం తులసి పెట్టిన టీ తాగుదాం అని అంటారు. అందరూ సరదాగా నవ్వుతుంటే చేసి తులసి షాక్ అవుతుంది.

అందరూ అది చేద్దాం.. ఇది చేద్దాం.. అంటుంటే తులసికి ఏం అర్థం కాదు. తనను సంతోషంగా ఉంచడం కోసం అందరూ భలేగా నటిస్తున్నారు అని అనుకుంటుంది. షాక్ అవుతుంది. వెంటనే నందును నిలదీస్తుంది తులసి. నా మెడికల్ రిపోర్ట్స్ గురించి ఎందుకు నిజాన్ని దాచారు. నిజం ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. దీంతో నందు షాక్ అవుతాడు.

ఇన్ని రోజులు మా ఆయనే నన్ను మోసం చేశాడని అనుకున్నాను. కానీ ఈరోజు మీరందరూ ఆయనతో చేరిపోయారు అంటుంది తులసి. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది