Bandla ganesh : పవన్ భక్తుడు ప్రభాస్ ని పొగిడాడంటే సినిమా ప్లాన్ చేస్తున్నాడా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bandla ganesh : పవన్ భక్తుడు ప్రభాస్ ని పొగిడాడంటే సినిమా ప్లాన్ చేస్తున్నాడా..?

 Authored By govind | The Telugu News | Updated on :27 June 2021,10:15 am

Bandla ganesh : ఇటీవల మా ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. వచ్చే సెప్టెంబర్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ముందు ప్రెసిడెంట్ పదవి కోసం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీకి దిగారు. ఆ తర్వాత జీవిత రాజశేఖర్, సాయి కుమార్, హేమ కూడా దిగితున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను ప్రకటించి తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పవన్ కళ్యాణ్ భక్తుడు, నిర్మాత బండ్ల గణేష్, సమీర్, నాగ బాబు, సురేష్ కొండేటి, సన, సహా మిగతా సభ్యులందరు హాజరయ్యారు.

is bandla ganesh planning a movie with prabhas

is bandla-ganesh-planning a movie with prabhas…?

ఇందులో భాగంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఇది పదవి కోసం కాదు మా లో కొన్ని కీలకమైన మార్పులు తెచ్చేందుకు పోటీ చేస్తున్నాని అన్నాడు. డర్టీగా కాకుండా హెల్తీగా పోటీ చేద్దామని, ఇదే విషయాన్ని మంచు విష్ణుని కూడా అడిగినట్టు చెప్పుకొచ్చాడు. ఇక ఆయనకి మెగా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేస్తుందని ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది. మూడు నెలల క్రితమే నాగబాబుని ప్రకాష్ రాజ్ కలిసి మాట్లాడాడు. ఈ విషయాన్ని ఇద్దరు ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా లోకల్, నాన్ లోకల్ అనే ప్రస్తావన వచ్చింది.

Bandla ganesh : బండ్ల గణేష్ మాటల్లో అర్థం ఏంటో అని ఆలోచనలో పడ్డారు.

దాంతో ప్రకాష్ ఇచ్చుకోవాల్సిన వివరణ ఇచ్చారు. ఇక్కడ నేను అవార్డులు తీసుకున్నప్పుడు, సినిమాలు చేసినఫ్ఫుడు, తెలంగాణలో ఊర్లు దత్తత తీసుకున్నప్పుడు రాని లోకల్ నాన్ లోకల్ టాపిక్ ఇప్పుడెందుకు అని సూటిగా ప్రశించాడు. అదే సమయంలో మైక్ అందుకున్న బండ్ల గణేష్ తన స్టైల్ లో రెచ్చిపోయారు. ప్రకాష్ రాజ్ ఏమేమి చేస్తున్నాడో తన స్టైల్లో చెప్పుకొచిన బండ్ల గణేష్..ఈ లోకల్ నాన్ లోకల్ గోలేంటి..ఇది మా కి సంబంధించిన విషయం. మా విషయం. దీన్ని భూతద్దంలో పెట్టి చూడకండి. అన్నాడు. ఒకవేల ఇదే పాయింట్ మాట్లాడుకుంటే ఇండియాలో పుట్టిన ప్రభాస్ టాలీవుడ్ హీరో అయుండి ఇండియాని ఏలుతున్నాడు అని గర్జించాడు. దాంతో అందరూ బండ్ల గణేష్ మాటల్లో అర్థం ఏంటో అని ఆలోచనలో పడ్డారు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది