Sridevi : శ్రీదేవి అంత క్రేజ్ జాన్వీ కపూర్ కి రాదా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sridevi : శ్రీదేవి అంత క్రేజ్ జాన్వీ కపూర్ కి రాదా..?

 Authored By govind | The Telugu News | Updated on :9 March 2021,11:59 am

Sridevi : శ్రీదేవి .. సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో మార్మోగిపోయిన పేరు. 16ఏళ్ళ వయసు అన్న సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి వచ్చిన శ్రీదేవి అందాల తారగా అతిలోక సుందరిగా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ అండ్ క్రేజ్ సంపాదించుకుంది. శ్రీదేవి డేట్స్ కోసం తెలుగు, హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ అందరూ పడిగాపులు కాచేవారు. అంతేకాదు శ్రీదేవి సామాన్యుడి దగ్గర్నుంచి స్టార్స్ వరకు అభిమానులుండటం గొప్ప విషయం. ఇక ఈ అందాల తారని దక్కించుకోవాలని ఎంతమంది తాపత్రయపడ్డారో లెక్కేలేదు.

is janvi kapoor gains craze like sridevi

is-janvi-kapoor-gains-craze-like-sridevi

సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిత్వం లోనూ శ్రీదేవి కి ఎవరూ సాటిరారు. అంత ఘనతని చాటుకున్న శ్రీదేవి కి తన కూతుర్లైన జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లని స్టార్ హీరోయిన్స్ గా చూడాలని ఎంతగానో కలలు కనింది. అంతేకాదు తనకి వచ్చినంత స్టార్ డం హీరోయిన్స్ గా తన పిల్లలకి దక్కాలని ఆరాటపడింది. కానీ కూతుర్లని హీరోయిన్స్ గా చూసుకోకుండానే అనంతలోకాలకి వెళ్ళిపోయింది. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది.

Sridevi : శ్రీదేవి లా జాన్వీ కపూర్ అన్నీ ఇండస్ట్రీలాని ఏలే సత్తా ఉందా అని మాట్లాడుకుంటున్నారట.

డెబ్యూ సినిమాతో మంచి పేరు కూడా తెచ్చుకుంది. అంతేకాదు గుంజన్ సక్సేనా లాంటి బయోపిక్స్ లో కూడా నటించి పాపులారిటీ తెచ్చుకునేందుకు ట్రై చేస్తోంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ కి ఇంకా స్టార్ హీరోయిన్ అన్న ఇమేజ్ రాకపోవడం ఆశ్చర్యకరం. ఇక ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎంట్రీనే జరగలేదు. గత రెండు మూడేళ్ళుగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. కాని అవన్ని పుకార్లేనని తేలిపోతోంది. దాంతో కొందరిలో అసలు జాన్వీ కపూర్ లో తల్లి శ్రీదేవి లా అన్నీ ఇండస్ట్రీలని ఏలే సత్తా ఉందా అని మాట్లాడుకుంటున్నారట. చూడాలి మరి జాన్వీ కపూర్ తల్లి మాదిరిగా క్రేజ్ ని దక్కించుకుంటుందో లేదో.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది