Keerthi Suresh : ‘మహానటి’ అంటూనే పెదవి విరుస్తున్నారా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Keerthi Suresh : ‘మహానటి’ అంటూనే పెదవి విరుస్తున్నారా..?

 Authored By govind | The Telugu News | Updated on :6 May 2022,7:00 pm

Keerthi Suresh : కీర్తి సురేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగానే నట వారసురాలిగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కీర్తి చిన్నతనం నుంచే నటన పరంగా అందరి ప్రశంసలు దక్కించుకుంది. ఇక హీరోయిన్ అయ్యాక సౌత్ సినిమా ఇండస్ట్రీలలోని ప్రధాన భాషలైన తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఏ హీరోయిన్ అయినా ఇతర భాషలు..మాతృ భాషకంటే కూడా తెలుగులో నటించే హీరోయిన్‌గా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంటున్నారు.

కీర్తిసురేశ్ కూడా అంతే. మలయాళం, తమిళం కంటే కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది..ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంటుంది. కానీ, మహానటి సినిమా తర్వాత మాత్రం మళ్ళీ ఆరేంజ్ పర్ఫార్మె చేసే సినిమా గానీ, హిట్ గానీ ఇంతవరకు దక్కలేదు. ఇంకా చెప్పాలంటే ‘మహానటి’ చేసిన తర్వాత వరుసగా లేడీ ఒపరియేంటెడ్ చిత్రాలనే చేసిన కీర్తికి ఆయా చిత్రాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. రజనీకాంత్ లాంటి సీనియర్ స్టార్ హీరో సినిమాలో నటించిన అణ్ణాత్త కూడా కీర్తికి హిట్ ఇవ్వలేకపోయింది.

is keerthi suresh not succeeded with chinni movie

is keerthi-suresh not succeeded with chinni movie

Keerthi Suresh : కీర్తిని శభాష్ అంటున్నారు.

ఇలాంటి సమయంలో ప్రేక్షకుల ముందుకు చిన్ని అంటూ కొత్త సినిమాతో వచ్చింది. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ విలక్షణ పాత్రలో నటించాడు. ఇందులో కీర్తి గుర్తు పట్టలేనటువంటి ఓ వైవిధ్యమైన పాత్రను చేసింది. కంప్లీట్ డీ గ్లామర్ రోల్‌లో కనిపించిన ఈ సినిమా కథ, కథనం ఏమాత్రం కొత్తగా లేనప్పటికీ ఈ పాత్ర ఒప్పు కోవడంతో కీర్తిని శభాష్ అంటున్నారు. ఇప్పటి వరకు చేసిన కమర్షియల్ సినిమాల క్లంటే పూర్తి భిన్నమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది. అయినా కూడా చిన్ని సినిమా కీర్తికి హిట్ ఇవ్వడం కష్టమే అంటూ పెదవి విరుస్తున్నారు. దాంతో అమ్మడి ఆశలన్నీ ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా మీదే పెట్టుకుంది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది