Krishnam Raju : కృష్ణంరాజు ది రెండో పెళ్లా.. మొదటి భార్య ఎవరు?
Krishnam Raju : సినీ నటుడు కృష్ణం రాజు ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు సినిమాపై మక్కువతో మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నం చేశారు. 1966లో విడుదలైన చిలకా గోరింకా చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. కెరీర్ లో 187 చిత్రాల్లో నటించిన కృష్ణం రాజు చివరిగా రాధే శ్యామ్ మూవీలో నటించారు. తన తమ్ముడు కుమారుడు ప్రభాస్ ని నటవారసుడిగా పరిశ్రమకు పరిచయం చేశాడు. బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, తల్లీ కొడుకులు, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, నీతి నియమాలు, తాండ్ర పాపారాయుడు, మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య, పల్నాటి పౌరుషం, తాతా మనవడు, బావా బావమరిది లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
Krishnam Raju : రెండు పెళ్లిళ్లు ఎందుకు?
కృష్ణంరాజు పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు.కృష్ణంరాజు ముందుగా సీతాదేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కృష్ణంరాజు సీతాదేవి దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే కృష్ణంరాజు భార్య సీతాదేవి ఒక రోడ్డు ప్రమాదంలో 1995లో మృతి చెందారు. ఆమె మరణించడంతో అప్పుడు ఆయన శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే కృష్ణంరాజు శ్యామలాదేవి దంపతులకు మరో ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరి ముగ్గురితో పాటు మొదటి భార్య కుమార్తె ఉండగా, మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు. అలా ఐదు మంది ఆడపిల్లలకు కృష్ణంరాజు దంపతులు తల్లిదండ్రులుగా మారిపోయారు.
కృష్ణం రాజు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. 1991లో కాంగ్రెస్ పార్టీతో యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. 1998లో కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. తర్వాత 1999లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన మరోసారి బీజేపీలో చేరారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా కష్ణం రాజు సేవలు చిరస్మరణీయం అనే చెప్పాలి.