ప్రభాస్ రాధే శ్యామ్ ఫ్యాన్స్ ని మళ్ళీ డిసప్పాయింట్ చేయబోతోందా ..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

ప్రభాస్ రాధే శ్యామ్ ఫ్యాన్స్ ని మళ్ళీ డిసప్పాయింట్ చేయబోతోందా ..?

ప్రభాస్ రాధే శ్యామ్ ఫ్యాన్స్ ని ముందు నుంచి డిసప్పాయింట్ చేస్తూనే ఉంది. సినిమా షూటింగ్ మొదలైనా కూడా చాలా రోజులు రాధే శ్యామ్ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ అటు ప్రభాస్ గాని ఇటు చిత్ర యూనిట్ గాని ఇవ్వకపోవడం తో ఫ్యాన్స్ కి రగిలిపోయి సోషల్ మీడియా వేదిక ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. దాంతో రాధే శ్యామ్ అంటూ టైటిల్ తో పాటు ప్రభాస్ – పూజా హెగ్డే ఫస్ట్ లుక్ పోస్టర్ […]

 Authored By govind | The Telugu News | Updated on :9 January 2021,3:08 pm

ప్రభాస్ రాధే శ్యామ్ ఫ్యాన్స్ ని ముందు నుంచి డిసప్పాయింట్ చేస్తూనే ఉంది. సినిమా షూటింగ్ మొదలైనా కూడా చాలా రోజులు రాధే శ్యామ్ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ అటు ప్రభాస్ గాని ఇటు చిత్ర యూనిట్ గాని ఇవ్వకపోవడం తో ఫ్యాన్స్ కి రగిలిపోయి సోషల్ మీడియా వేదిక ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. దాంతో రాధే శ్యామ్ అంటూ టైటిల్ తో పాటు ప్రభాస్ – పూజా హెగ్డే ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కి పూర్తి స్థాయిలో తృప్తి చెందలేదన్న కామెంట్స్ తో పాటు మిగతా కొన్ని సినిమాలతో పోల్చుకుంటూ ట్రోల్ చేశారు.

Prabhas as Vikramaditya: 'Radhe Shyam' team unveils first look | The News  Minute

ఆ తర్వాత బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అన్న పేరుతో మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. కంప్లీట్ యానిమేషన్ పోస్టర్ కావడం తో మళ్ళీ రాధే శ్యామ్ టీం కి ట్రోల్స్ తప్పలేదు. కాస్తలో కాస్త నయం అంటే ప్రభాస్ పోషిస్తున్న విక్రమాదిత్య లుక్ అలాగే పూజా హెగ్డే పోషిస్తున్న ప్రేరణ లుక్ అని చెప్పాలి. ఈ రెండు పోస్టర్స్ కి ఫ్యాన్స్ నుంచి అలాగే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్ వచ్చింది. అయితే గత కొన్ని నెలలుగా రాధే శ్యామ్ నుంచి టీజర్ వస్తుందని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Prabhas wishes Pooja Hegde on her birthday, reveals her first look from  Radhe Shyam - entertainment

కానీ ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి మాత్రం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న టీజర్ మాత్రం రావడం లేదు. న్యూ ఇయర్ సందర్భంగా టీజర్ వస్తుందనుకుంటే జస్ట్ ఒక్క ప్రభాస్ సోలో పోస్టర్ రిలీజ్ చేసి మమ అనిపించారు. కాగా రీసెంట్ గా చిత్ర దర్శకుడు రాధకృష్ణ రాధే శ్యామ్ నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ రాబోతుందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. కాని ఆ సర్‌ప్రైజ్ ఏంటని గాని .. ఎప్పుడని గాని క్లారిటీ ఇవ్వలేదు. బహుషా సంక్రాంతికి వకీల్ సాబ్ కి పోటీగా టీజర్ ని రిలీజ్ చేస్తారా చూడాలి. కాని ఈ సారి కూడా ఫ్యాన్స్ ని రాధే శ్యామ్ టీం డిసప్పాయింట్ చేస్తే ఫ్యాన్స్ ని తట్టుకోవడం కష్టమే అన్న మాట వినిపిస్తోంది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది