Sada : సదా మాధవన్ పెళ్ళి చేసుకున్నారా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sada : సదా మాధవన్ పెళ్ళి చేసుకున్నారా..?

 Authored By govind | The Telugu News | Updated on :1 July 2021,9:00 am

Sada : ఒకప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలిగింది సదా. టాలీవుడ్ కి క్రియేటివ్ డైరెక్టర్ తేజ తీసుకు వచ్చాడు. చిత్రం సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమయిన తేజ, ఆయనతో పాటు ఇండస్ట్రీకి కొత్త నటీ నటులను, టెక్నీషియన్స్ ని పరిచయం చేశాడు. ఆయన తీసిన ప్రతీ సినిమాతో కనీసం ఓ 40 నుంచి 45 మంది కొత్త ఆర్టిస్టులను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. అలా నిజం సినిమాతో నితిన్ – సదాలను పరిచయం చేశాడు. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో సదాకి తెలుగులో తమిళంలో, కన్నడ భాషల్లో వర్సగా క్రేజీ ఆఫర్స్ అందుకుంది. అప్పట్లో సదాకి ఉన్న క్రేజ్ కారణంగా క్రియేటివ్ జీనియస్ శంకర్ కంట్లో పడింది. శంకర్ సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

is sada married madhavan

is sada-married madhavan…?

అలాంటిది శంకర్ ఆఫీస్ నుంచి కాల్ వస్తే సదా ముందు లైట్ తీసుకుందట. ఒక సినిమా షూటింగ్ కోసం ఫారిన్ వెళ్ళిన సమయంలో సదా ఇంటికి శంకర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందట. ఆ సమయంలో సదా లేకపోవడంతో వాళ్ళ అమ్మగారు మాట్లాడి రాగానే చెప్పిందట. అప్పుడు సదా ..ఇవన్నీ ఫేక్ కాల్స్ నమ్మొద్దంటూ పట్టించుకోలేదట. అయినా వాళ్ళ అమ్మ ఒక్కసారి ఇది నిజమో కాదో చూడు అని కన్విన్స్ చేస్తే తిరిగి కాల్ చేసింది. అది నిజంగా శంకర్ ఆఫీస్ నుంచి వచ్చిన కాల్ అని తెలిసి షాకయిందట. తీరా చూస్తే ఆయన తెరకెక్కిస్తున్న అనియన్
తెలుగులో అపరిచితుడుగా వచ్చి ప్రాజెక్ట్ కోసం అని తెలిసి ఒక్క నిముషం మైండ్ బ్లాక్ అయిందట.

Sada : ఇద్దరు కలిసి మూడు సినిమాలు చేస్తే ఇలా పుకార్లు పుట్టిస్తారా

ఎట్టకేలకి ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. ఈ సినిమా తర్వాత వరుసగా కొన్ని తమిళ సినిమాలు చేసింది. అందులో మూడు సినిమాలు మాధవన్ తో చేయడం విశేషం. అయితే మాధవన్ – సదా నటించిన ప్రియసఖి అనే సినిమాలో ఇద్దరి మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. అందులో ఇద్దరు బాగా లీనమై నటించారు. అయితే ఈ సినిమా తర్వాత సదా – మాధవన్ పెళ్ళి చేసుకున్నారని పుకార్లు పుట్టించారు. ఇద్దరు కలిసి మూడు సినిమాలు చేస్తే ఇలా పుకార్లు పుట్టిస్తారా..అని సదా షాకయిందట. మొదట్లో ఈ వార్తలు చూసి బాధపడిన సదా ఆ తర్వాత మాత్రం నెమ్మదిగా ఇలాంటి గాసిప్స్ రావడం చాలా కామన్ అని పట్టించుకోవడం మానేసిందట. ఇక ఇప్పటి వరకు నేను ఎవరిని ప్రేమించలేదు..ఇప్పట్లో పెళ్ళి ఆలోచన కూడా లేదు. ఒకవేళ పెళ్ళి చేసుకున్నా నాకు తగ్గ అబ్బాయి దొరికితేనే అని తేల్చి చెప్పింది సదా.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది