Ram Charan : రాం చరణ్ చంద్రబాబు , బాలయ్య ని అంత పొగడడం వెనక కారణం ఇదేనా ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Charan : రాం చరణ్ చంద్రబాబు , బాలయ్య ని అంత పొగడడం వెనక కారణం ఇదేనా !

 Authored By sekhar | The Telugu News | Updated on :21 May 2023,4:24 pm

Ram Charan : హైదరాబాద్ లోని కుక్కట్ పల్లి హౌసింగ్ బోర్డ్ పక్కనే ఉన్న కైతలాపూర్ మైదానంలో శనివారం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇంకా ఇదే వేడుకకు మెగా హీరో రామ్ చరణ్ తేజ్ కూడా హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడిన తీరు చాలామందిని ఆకట్టుకుంది. నందమూరి అభిమానులను సొంతం చేసుకున్నట్టు మాట్లాడారు. ఇంత నందమూరి ఫ్యాన్స్ చెర్రీ పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో చెర్రీ స్పీచ్ నందమూరి ఫ్యాన్స్ లో ఇప్పుడు బిగ్ డిబేట్ గా మారింది. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ కీర్తించబడతారని అనేక విషయాలు మాట్లాడుతూ..

అటువంటి ఎన్టీఆర్ వంటి మహా వ్యక్తి శతజయంతి వేడుకలకు తనని పిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మా చంద్రబాబు మా బాలయ్య అంటూ చరణ్ స్పీచ్ ఇచ్చారు. ఇదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కూడా చరణ్ చాలా దగ్గర అవటం జరిగింది. ఇద్దరూ “RRR” తర్వాత మంచి స్నేహితులయ్యారు. అయితే ఎన్నడూ లేని రీతిలో చరణ్ చంద్రబాబు ని మరియు బాలయ్య అని అంతగా పొగడటం వెనకాల పెద్ద కారణం ఉందని ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. మేటర్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోబోతున్న నేపథ్యంలో చరణ్ ఈ విధంగా ముందుగా మాట్లాడినట్లు చాలామంది భావిస్తున్నారు. ఆల్రెడీ గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీకి ప్రచారం చేయడానికి ముందుకు రావడం జరిగింది.

is this the reason behind ram charan praising chandrababu and balayya so much

is-this-the-reason-behind-ram-charan-praising-chandrababu-and-balayya-so-much

రాజకీయంగా చరణ్ ఎప్పుడు కూడా తన సపోర్ట్ పవన్ కే అని చాలా సందర్భాలలో తెలియజేశారు. ఇదే సమయంలో ఇటీవల పవన్ కళ్యాణ్ సైతం పొత్తుల విషయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ చంద్రబాబుతో పలు సందర్భాలలో కూడా బేటి కావడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో చరణ్ మా చంద్రబాబు మా బాలయ్య అంటూ చేసిన కామెంట్లు.. ఏపీ రాజకీయాలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్యలు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది