Mukku Avinash : అవినాష్ పెళ్లిలో బిగ్ బాస్, జబర్దస్త్ తారల సందడి.. సోహెల్ పరువు తీసిన దివి..
Mukku Avinash : ‘జబర్దస్త్’ ప్రోగ్రం ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఒకరు అవినాష్. సాయికుమార్ వాయిస్ ఇమిటేట్ చేయడంలో అవినాస్ దిట్ట. కాగా, ‘ముక్కు’ అవినాష్‌గా ప్రేక్షకులకు సుపరిచితుడైన ఈయన పెళ్లి తాజాగా అనూజతో జరిగింది. ఇకపోతే ఈ మ్యారేజ్‌లో అవినాష్-అనూజ కంటే కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్, జబర్దస్త్ ఆర్టిస్టులే ఎక్కువ సందడి చేశారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.‘బిగ్ బాస్’ నాల్గో సీజన్‌లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ దివి, సోహెల్, అరియానా ఉండగా, ఈ సీజన్‌లో అవినాష్ కూడా కంటెస్టెంట్‌గా ఉన్నాడు.
ఈ సీజన్‌లో అవినాష్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అని పలువురు అంటుంటారు. ఇకపోతే మ్యారేజ్ గురించి చాలా సందర్భాల్లో పలు కామెంట్స్ చేసిన అవినాష్ తాజాగా ఓ ఇంటివాడయ్యాడు. అనూజతో అవినాష్ పెళ్లి జరిగింది. కాగా, ఈ పెళ్లి వేడుకకు హాజరయినట్లు అరియానా, సోహెల్, దివి ఇన్ స్టా స్టోరిస్‌లో షేర్ చేశారు. అవినాష్‌కు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ విషెస్ చెప్తూనే ఫొటోలు షేర్ చేశారు. కాగా, ఆ ఫొటోలపై దివి కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సదరు ఫొటోను బట్టి.. విషెస్ తర్వాత చెప్పుదాం లే.. మొదలు ఫొటో సరిగా వచ్చిందా? లేదా ? అని చూసుకునేందుకుగాను సోహెల్ ఆత్రుత పడుతున్నట్లుందని కామెంట్ చేసింది.
Mukku Avinash : డ్రెస్ సరిచేసుకోవడంలోనే అరియానా బిజీ..
ఇక అరియానా అయితే తన డ్రెస్ సరి చేసుకునేందుకే ప్రయారిటీ ఇచ్చిందని, ఆ పనిలోనే బిజీగా ఉందని అంది. ఈ క్రమంలోనే పెళ్లి ఏంటో కాని అవినాష్ షూస్ బాగున్నాయని అరియానా అనకుందని పోస్టు పెట్టాడు. ఈ క్రమంలోనే తన గురించి తాను దివి కామెంట్ చేసుకుంది. భోజనాలు ఎక్కడ పెడుతున్నారనే ఆలోచనలో తాను ఉన్నానని అంది. మొత్తంగా అవినాష్ పెళ్లి కుటుంబసభ్యులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, జబర్దస్త్ స్టార్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య అంగరంగా వైభవంగా జరిగింది. వీరందరూ అవినాష్ పెళ్లిలో హంగామా చేశారు. హ్యాపీగా ఎంజాయ్ చేసి అవినాష్‌కు విషెస్ తెలిపారు.