Jabardast : మళ్లీ మళ్లీ అదే విషయం.. సిగ్గుపడకుండా పబ్లిసిటీ చేస్తున్నారు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardast : మళ్లీ మళ్లీ అదే విషయం.. సిగ్గుపడకుండా పబ్లిసిటీ చేస్తున్నారు..

 Authored By mallesh | The Telugu News | Updated on :20 February 2022,5:30 pm

Jabardast : గతంలో వ్యభిచారంలో జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, పరదేశి పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. ఇంత తప్పుడు పని చేసిన వీరు తలదించుకోవాల్సింది పోయి దానిని కామెడీ కోసం వాడుకుంటూ ఇంకా పబ్లిసిటీ చేస్తున్నారు. 2020 మార్చిలో విశాఖపట్నం మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌ వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించిన పోలీసులు ఇద్దరు మహిళలతో పాటు నలుగురు విటులను సైతం అరెస్టు చేశారు. వీరిలో జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, పరదేశి రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.

తమను వదిలేయాలని వీరిద్దరూ పోలీసుల కాళ్లపై పడుతూ దండాలు పెట్టిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇక వీరిని అరెస్టు చేయడం, తర్వాత వదిలేయడం జరిగింది. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో వరకూ ఆ వ్యభిచారం ఇష్యూను పదే పదే ప్రస్తావించుకుంటూ గుర్తు చేస్తూనే ఉన్నారు. తప్పు పని చేసి దానికి తోడుగా ఫుల్ పబ్లిసిటీ ఇచ్చుకుంటూ ఇలా డబ్బా కొట్టుకోవడం ఏంటని ఆడియన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి.హైపర్ ఆది టీంలో దొరబాబు, పరదేశి కీలకసభ్యులు.. అనేక సందర్భాల్లో వీళ్ల వ్యభిచార విషయాన్ని గుర్తుచేస్తూ బోలెడు పంచ్‌లు వేశాడు ఆది.

Jabardast thing again doing publicity without shame

Jabardast thing again doing publicity without shame

Jabardast : బట్టబయలు చేసుకున్నారు..

ఇక తాజాగా విడుదలైన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలోనూ అదే వ్యభిచార బాగోతాన్ని బయటపెట్టుకున్నారు. ఆ రోజు సెక్స్ రాకెట్ దాడుల్లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికేసిన వీరిద్దరిని పోలీసులు బట్టలూడదీసి కొట్టారనే టాక్ వినిపించింది. ఇదిలా ఉండగా రోహిణి చేసిన పుష్ప స్కిట్ లో పరదేశి మంగళం సీనుగా కనిపించాడు. చైన్నై వరకు సరుకు ఎత్తుకుని పోతున్నావ్ కదా.. అన్ని చెక్ పోస్టుల్లో నీ మాటే వింటున్నారా అని రోహిణి అడగ్గా.. అన్నింట్లో వింటున్నారు ఒక్క వైజాగ్ లో తప్ప అని పంచ్ వేశాడు. ఇలా తప్పుచేసి కూడా దానిని బయటపెట్టుకోవడం వీరికే చెల్లింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది