Anasuya : అనసూయ వివాదం… సెలబ్రెటీలకు కొత్త పాఠం చెబుతుందా?

Authored By aruna | The Telugu News | Published on: August 28, 2022, 2:40 pm

Anasuya : సోషల్ మీడియాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ వ్యవహారం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఆమె వద్దు అంటూ హెచ్చరించినా కూడా చాలా మంది ఆంటీ అంటూ తెగ ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. స్వయంగా ఆమె మీడియా ముందుకు వచ్చి మరి అలా మాట్లాడడం తనకు ఇష్టం లేదని, తన వయసు ఉన్న వాళ్లు తనను ఆంటీ అంటే ఎలా ఉంటుంది అంటూ కాస్త ఆవేదన వ్యక్తం చేసింది. అయినా కూడా ఆమె ఆవేదనను ఎవరూ పట్టించుకోవడం లేదు. పైపెచ్చు ఆమె అలా హెచ్చరించినందుకు గాను ఏం జరుగుతుందో చూద్దాం అంటున్నారు.

చాలా మంది ఆమెను మరింతగా టార్గెట్ చేస్తూ ఆంటీ అంటూ సోషల్ మీడియాలో ఏకంగా ట్రెండ్ సృష్టించారు. ఈ వ్యవహారం చాలా మంది సినీ వర్గాల వారికి మంచి మెసేజ్ అనడంలో సందేహం లేదు. జనాలతో ముఖ్యంగా సోషల్ మీడియా జనాలతో పెట్టుకుంటే ఏ స్థాయిలో వ్యవహారం ఉంటుందో ఇది ప్రత్యక్ష సాక్ష్యం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో మరియు సోషల్ మీడియాతో పెట్టుకుంటే ఒక రేంజిలో ఆడుకోవడం ఖాయమని దీన్ని బట్టి నిరూపితమైందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

jabardasth Anasuya Controversy Will it teach a new lesson to celebrities

jabardasth Anasuya Controversy Will it teach a new lesson to celebrities

అందుకే ఏమైనా ట్రోల్స్ వస్తే సైలెంట్ గా ఉండి వినమ్రతతో అలాంటి ట్రోల్స్ చేయవద్దని విజ్ఞప్తి చేసుకోవాలి తప్పితే వార్నింగ్ ఇస్తే అంతకు మించి ట్రోల్స్ అవ్వడం ఖాయం అని దీన్ని బట్టి అర్థమవుతుంది. ముందు ముందు ఇలాంటి వ్యవహారాలు మళ్లీ జరగకపోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే, మరి కొందరు మాత్రం ఈ వ్యవహారాన్ని అనసూయ మరింత ముందుకు తీసుకు వెళ్లడం ఖాయం పోలీసుల వరకు ఈ వ్యవహారం వెళ్తే ఆమెను మరింతగా సోషల్ మీడియా జనాలు ట్రోల్స్ చేయడం ఖాయం అంటూ చర్చ జరుగుతోంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp