RK Roja : రోజా జ‌బ‌ర్ధ‌స్త్‌కి వ‌ద్దు.. ఆడియ‌న్స్ నుండి ఇంత నిర‌స‌న సెగ ఏంటి..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

RK Roja : రోజా జ‌బ‌ర్ధ‌స్త్‌కి వ‌ద్దు.. ఆడియ‌న్స్ నుండి ఇంత నిర‌స‌న సెగ ఏంటి..?

RK Roja : ఈ సారి ఏపీ ఎన్నిక‌లు ఎంత ర‌స‌వ‌త్త‌రంగా మారాయో మ‌నం చూశాం. గెలుస్తార‌నుకున్న మంత్రులు, మాజీ మంత్రులు ఓట‌మి బాట‌ప‌ట్టారు. ముఖ్యంగా ఎన్నిక‌ల‌కి ముందు రోజా ఎన్నో మాట‌లు మాట్లాడింది. కాని చివ‌ర‌కి ఓట‌మి పాలైంది. అయితే రోజా ఎన్నిక‌ల‌లో ఓడినందుకు జ‌బ‌ర్ధ‌స్త్‌కి వ‌స్తుంద‌ని అంద‌రు భావిస్తున్నారు. రోజా జబర్దస్త్ కి రావడానికి వీల్లేదంటూ ఓ స్లోగన్ మొదలైంది. ఆమెకు నిరసన సెగ తగులుతుంది. జబర్దస్త్ ప్రోమో క్రింద ఈ మేరకు కామెంట్స్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 June 2024,5:30 pm

ప్రధానాంశాలు:

  •  RK Roja : రోజా జ‌బ‌ర్ధ‌స్త్‌కి వ‌ద్దు.. ఆడియ‌న్స్ నుండి ఇంత నిర‌స‌న సెగ ఏంటి..?

RK Roja : ఈ సారి ఏపీ ఎన్నిక‌లు ఎంత ర‌స‌వ‌త్త‌రంగా మారాయో మ‌నం చూశాం. గెలుస్తార‌నుకున్న మంత్రులు, మాజీ మంత్రులు ఓట‌మి బాట‌ప‌ట్టారు. ముఖ్యంగా ఎన్నిక‌ల‌కి ముందు రోజా ఎన్నో మాట‌లు మాట్లాడింది. కాని చివ‌ర‌కి ఓట‌మి పాలైంది. అయితే రోజా ఎన్నిక‌ల‌లో ఓడినందుకు జ‌బ‌ర్ధ‌స్త్‌కి వ‌స్తుంద‌ని అంద‌రు భావిస్తున్నారు. రోజా జబర్దస్త్ కి రావడానికి వీల్లేదంటూ ఓ స్లోగన్ మొదలైంది. ఆమెకు నిరసన సెగ తగులుతుంది. జబర్దస్త్ ప్రోమో క్రింద ఈ మేరకు కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ కి రోజా పెద్ద ఆకర్షణ. 2013లో జబర్దస్త్ ప్రారంభం కాగా అప్పటి నుండి రోజా జడ్జిగా కొనసాగారు. రోజా-నాగబాబు కాంబినేషన్ సూపర్ హిట్. ఏళ్ల తరబడి వీరు జబర్దస్త్ జడ్జెస్ గా ఉన్నారు. జడ్జి సీట్లో కూర్చుని ఆమె వేసే కౌంటర్లు, పంచులు బాగా పేలుతాయి. జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ లో రోజా పాత్ర ఎంతగానో ఉంది. ఒక పక్క ఎమ్మెల్యేగా కొనసాగుతూనే రోజా జబర్దస్త్ జడ్జిగా చేశారు.

RK Roja ఆమె వ‌స్తే తాట తీస్తాం..

రోజాకు మంత్రి పదవి రావడంతో ఆమె కూడా జబర్దస్త్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. రోజా వెళ్ళిపోయాక ఇంద్రజ ఆ స్థానంలోకి వచ్చింది. చాలా మంది వచ్చారు కానీ ఇంద్రజ మాత్రమే నిలదొక్కుకుంది. నటుడు కృష్ణ భగవాన్ తో పాటు ఇంద్రజ జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కుష్బూ సైతం ఆ సీట్లో కనిపిస్తున్నారు. నటిగా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అని తెలిసి కూడా.. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి నీచంగా మాట్లాడింది. మినిస్టర్ పదవిలో ఉండి.. మీడియా ముందు ఏం పీకలేరు.. వాడెంత.. వీడెంత అంటూ అసభ్యకరమైన భాషలో తిట్టిపోసింది. ఇక చివరికి పవన్ కు సపోర్ట్ గా నిలిచినందుకు జబర్దస్త్ కమెడియన్స్ ను కూడా వదలలేదు. ఆమె మాటలు విన్న ప్రజలకు విసుగు వచ్చింది. ఛీఛీ ఇలాంటి మనిషినా మేము గెలిపించింది అనుకున్నారో ఏమో కానీ, ఈసారి నగరి ప్రజలు.. రోజాను డిపాజిట్ కూడా లేకుండా ఓడించి పడేశారు.

RK Roja రోజా జ‌బ‌ర్ధ‌స్త్‌కి వ‌ద్దు ఆడియ‌న్స్ నుండి ఇంత నిర‌స‌న సెగ ఏంటి

RK Roja : రోజా జ‌బ‌ర్ధ‌స్త్‌కి వ‌ద్దు.. ఆడియ‌న్స్ నుండి ఇంత నిర‌స‌న సెగ ఏంటి..?

రోజా జ‌బ‌ర్ధ‌స్త్‌లోకి వ‌స్తుంద‌ని అంటున్నారు. ఇంద్రజ జడ్జి స్థానం నుంచి తప్పుకుంది. అది రోజా కోసమే అని వార్తలు వచ్చాయి. ఈ వారం కాకపోతే వచ్చే వారం.. రోజా మళ్లీ జబర్దస్త్ జడ్జిగా మారనున్నట్లు చెప్పుకొస్తున్నారు. అయితే ఈసారి రోజా ను జబర్దస్త్ లోకి తీసుకొస్తే సహించేది లేదని జబర్దస్త్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మల్లెమాల ఆమెను తీసుకొస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. సిగ్గులేకుండా ఏ మొహం పెట్టుకొని మళ్లీ జబర్దస్త్ కు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో కింద దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. ఆమెను మళ్లీ జడ్జిగా తీసుకొస్తే బాయ్ కాట్ చేస్తామని, రోజా ఓవర్ యాక్షన్ చూడలేమని చెప్పుకొస్తున్నారు. అంతే కాకుండా ఆ డైమండ్ రాణిని ఈ షోకు తీసుకొస్తే ఒక్కడు కూడా చూడడు అంటూ జబర్దస్త్ బాయ్ కాట్ అనే పేరుతో ట్రెండ్ చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది