sudigali sudheer : వారిద్దరు ఉన్నన్ని రోజులు జబర్దస్త్ ను మరే షో ఢీ కొట్టలేదు
sudigali sudheer : తెలుగు బుల్లితెర చరిత్ర లో ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది సంవత్సరాలుగా టాప్ కామెడీ షో గా దూసుకుపోతుంది. జబర్దస్త్ కు ఎంతో మంది కమెడియన్స్ వచ్చారు పోయారు. కానీ ఆ షో మాత్రం అలాగే కొనసాగుతుంది. ఇక జబర్దస్త్ కు పోటీగా ఎన్నో ఛానల్స్ కామెడీ షో లను తీసుకు వచ్చే ప్రయత్నం చేశాయి. కానీ ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఇటీవల స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్ కు మంచి స్పందన వచ్చింది కాని దానికి రేటింగ్ పెద్దగా రావడం లేదు. ఆ షో టెలికాస్ట్ అవుతున్న టైమింగ్ సరిగా లేదంటూ టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా జబర్దస్త్ కామెడీ షో ను ఇప్పట్లోనే కాదు ముందు ముందు కూడా ఏ ఒక్క కామెడీ షో డీ కొట్టలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రేక్షకులు జబర్దస్త్ కు అలా కనెక్ట్ అయిపోయారు. జబర్దస్త్ షో ప్రస్తుతం ఇద్దరూ కమెడియన్స్ వల్ల నడుస్తుంది అంటూ ప్రతి ఒక్కరు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అందులో ఒకరు సుడిగాలి సుదీర్ టీం కాగా మరొకరు హైపర్ ఆది. జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ లో వీరి కామెడీ ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తుంది. వీళ్ళ కామెడీ చూడడంతో పాటు ఇతర కామెడియన్స్ ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కి మంచి రివ్యూలు మరియు రేటింగ్ లు వస్తున్నాయి.ఇంతకు ముందు జబర్దస్త్ లో లేడీ గెటప్స్ ఉండేవి.. లేడీ ఆర్టిస్టులు కమెడియన్స్ ఉండక పోయే వారు.. కానీ హైపర్ ఆది సరికొత్త ప్రయోగానికి తెర తీశాడు. అమ్మాయిలను తీసుకు రావడం ద్వారా జబర్దస్త్ కు అదనపు అందాన్ని జోడించాడు. జబర్దస్త్ సూపర్ హిట్ గా దూసుకెళ్తడంలో ఇప్పుడు అమ్మాయిలది తక్కువ పాత్ర ఏమీ కాదు. వారికి మంచి అవకాశాలు దక్కుతున్నాయి. సుధీర్ మరియు ఆదిలు కలిసి జబర్దస్త్ ను ముందుకు తీసుకెళ్తున్నారు అనడంలో సందేహం లేదు. ఆది తన స్కిట్స్ ల్లో ప్రయోగాత్మకంగా కామెడీ చేసి ఆకట్టుకుంటున్నాడు.
తాజాగా రోజా ఇంటికి వెళ్లి అక్కడ తన స్కిర్ట్ ని చేశాడు. ఈ వారం జబర్దస్త్ లో రోజా ఇంట్లో ఆది టీమ్ టెలికాస్ట్ అవ్వబోతుంది. ఇలాంటి ఎన్నో రకాల ప్రయోగాలను ఆది మరియు జబర్దస్త్ టీం చేస్తున్న కారణంగా ఇప్పట్లో జబర్దస్త్ కు పోటి వచ్చే కామెడీ షో లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా అద్భుతమైన విజయం తో దూసుకెళ్తున్న జబర్దస్త్ ను మరో పదేళ్లయినా ప్రేక్షకులు ఇదే విధంగా ఆదరిస్తారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే మల్లెమాల వారు కామెడీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా మరి కొంత మందికి అవకాశం ఇచ్చి టీం లీడర్ లుగా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుడిగాలి సుధీర్ మరియు హైపర్ ఆది ల జోరు తగ్గిన తర్వాత వారి స్థాయిలో మరో ఇద్దరు లేదా అంతకు మించి టీం లీడర్లను తయారు చేయాల్సిన బాధ్యత మల్లెమాల వారిపై ఉంది. మరి ఆ బాధ్యతను వారు ఎలా నిర్వర్తిస్తారు అనేది చూడాలి.