Jabardasth Faima : రెచ్చిపోయిన ఫైమా.. బుల్లెట్ భాస్కర్ పరువుపాయే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth Faima : రెచ్చిపోయిన ఫైమా.. బుల్లెట్ భాస్కర్ పరువుపాయే

 Authored By prabhas | The Telugu News | Updated on :23 May 2022,10:00 am

Jabardasth Faima : బుల్లితెరపై ఫైమా చేసే వీరంగం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఫైమా పంచులకు అందరూ పగలబడి నవ్వేస్తుంటారు. ఇక ఫైమా రాకతోనే బుల్లెట్ భాస్కర్ టీం దూసుకుపోతోంది. ఈ మధ్య వరుసగా స్కిట్లు కొట్టేస్తున్నాడు. బుల్లెట్ భాస్కర్ టీంకు ఫైమానే మెయిన్ కంటెస్టెంట్‌గా మారిపోయింది. ఫైమా, ఇమాన్యుయేల్, వర్షలతోనే బుల్లెట్ భాస్కర్ స్కిట్లు కొట్టేస్తున్నాడు. అలా ఈ నలుగురి కాంబినేషన్‌కు, వాళ్లు చేసే స్కిట్లకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక ఫైమా టైమింగ్ మాత్రం వేరే లెవెల్ అని ప్రశంసలు వస్తుంటాయి.

బుల్లెట్ భాస్కర్‌ను ఫైమా ప్రతీసారి తన కౌంటర్లతో ఆడుకుంటూ ఉంటుంది. ఫైమా,వర్ష, ఇమాన్యుయేల్ ఫన్ మామూలుగా ఉండదు. ఇక బుల్లెట్ భాస్కర్‌ను అందరూ కలిసి ఏడిపిస్తుంటారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బుల్లెట్ భాస్కర్‌ను దారుణంగా అవమానించింది ఫైమా. తాజాగా వేసిన స్కిట్లో ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా నటించారు. లావుగా ఉంది, సర్జరీ చేసుకోవాలని బుల్లెట్ భాస్కర్ తన భార్యను కోరతాడు. దీంతో ఆ భార్య సర్జరీ అనంతరం ఫైమాలా మారిపోతుంది. ఆ తరువాత నువ్ లావుగా ఉన్నావ్ అని భర్తను ఫైమా ఆడుకుంటుంది.నువ్ చేసే ఏ పనైనా నేను చేస్తాను అంటూ ఫైమాతో భాస్కర్ చాలెంజ్ విసురుతాడు. దీంతో ఫైమా తన యోగాసానాలు వేస్తుంది.

Jabardasth Faima Counters on Bullet Bhaskar In Extra Jabardasth

Jabardasth Faima Counters on Bullet Bhaskar In Extra Jabardasth

కింద కూర్చుని తన కాలుని వెనకాల నుంచి మెడ మీదకు తీసుకొస్తుంది. ఇది చేయమని ఫైమా సవాల్ విసురుతుంది. దీంతో తన కాలును ఎత్తడానికి భాస్కర్ నానా తంటాలు పడతాడు. కాళ్లే ఎత్తలేకపోతోన్నావ్ ఇంక నువ్.. అంటూ డబుల్ మీనింగ్‌లో అంటుంది. ఇలాంటి చిన్న చిన్నవి కాదు.. నా కండలు చూశావా? వాటికి తగ్గట్టుగా చెప్పు అని అంటాడు భాస్కర్.అయితే ఈ స్కూటీని లేపు అని అంటుంది ఫైమా. స్కూటీని లేపేందుకు నానా కష్టాలు పడతాడు భాస్కర్.కానీ చేయలేకపోతాడు. పంటితో దీన్ని లేపు అని అంటుంది ఫైమా. దీన్ని పంటితో మనిషన్నవాడెవ్వడైనా లేపుతాడా? అని భాస్కర్ అంటే.. ఫైమా చేసి చూపిస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది