sudigali sudheer : అన్నీ బయటపెడతాను.. సుధీర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తోన్న జబర్దస్త్ కమెడియన్!
sudigali sudheer : జబర్దస్త్ టీమ్ లీడర్, యాక్టర్ సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అతనికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో ఆటో రామ్ ప్రసాద్, గేటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. చాలా సందర్భాల్లో వారిపైనే వారు పంచులు వేసుకుని ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. ముఖ్యంగా సుధీర్‌పై జబర్దస్త్‌లో పేల్చే పంచులు మాములుగా ఉండవు. కొందరు టీమ్ లీడర్లు కూడా సుధీర్‌ను వారి స్కిట్స్‌లో సుధీర్‌ను గెస్ట్‌గా పిలిచి మరి ఆడుకుంటారు. సుధీర్ కూడా అవన్నీ లైట్ తీసుకుంటాడు.

jabardasth Funny Comments on sudigali sudheer
ఇలా నవ్వులు పూయిస్తున్న సుధీర్‌ను మరోసారి స్కిట్‌లో ఆడేసుకున్నారు. తన టీమ్ స్కిట్‌లోనే బాబు సుధీర్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. సుధీర్ అసిస్టెంట్‌గా వచ్చిన బాబు.. సుధీర్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. ముందుగా హీరో వచ్చాడు.. వాళ్లను పిలిపివ్వు అని సుధీర్ అనగా.. అమ్మాయిల పేర్లు చెప్పి.. వారిని పిలవమంటారా.. అని బాబు అంటాడు. దీంతో సుధీర్ నువ్వు ఈ మధ్య ఎక్కువ చేస్తున్నావ్.. ఇలా చేస్తే తీసేస్తా అని అంటాడు.
sudigali sudheer : సుధీర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన కమెడియన్

sudigali sudheer excellent dance performance in dhee 13
‘ఏంటి నన్ను తీసేస్తావా.. నీ దగ్గర 10 ఏళ్ల నుంచి చేస్తున్నా.. నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుసు.. న్యూస్ చానల్‌కు వెళ్లమంటావా..?’ అని బాబు అంటాడు. దీనికి సుధీర్ ఎంట్రా ఎక్కువ చేస్తున్నావు అని అడగ్గా.. న్యూస్ చానల్‌కు వెళ్తానని బ్లాక్ మెయిల్‌కు దిగుతాడు. దీంతో వద్దులేరా అని అంటాడు. ఇంకా ఈ స్కిట్‌లో సుధీర్‌పై రష్మీ, రోజాలు కూడా పంచులు పేల్చారు. ఫుల్ ఫన్నీగా ఉన్న ఈ స్కిట్ ప్రేక్షకులను అలరిస్తుంది. మొత్తానికి సుధీర్‌ను మాత్రం అందరూ ఆడుకుంటున్నారు.