Hyper Aadi : జబర్దస్త్‌.. అప్పుడు హైపర్ ఆదికి ఎంత ఇచ్చారు.. ఇప్పుడు సద్దాంకి ఎంత ఇస్తున్నారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : జబర్దస్త్‌.. అప్పుడు హైపర్ ఆదికి ఎంత ఇచ్చారు.. ఇప్పుడు సద్దాంకి ఎంత ఇస్తున్నారు..!

 Authored By prabhas | The Telugu News | Updated on :2 January 2023,11:00 am

Hyper Aadi : జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభం అయ్యి పది సంవత్సరాలు కాబోతుంది. ఈ కార్యక్రమాన్ని మొదట 13 ఎపిసోడ్లు చేయాలని భావించి ఒప్పందాలు చేయడం జరిగింది. అప్పుడు టీం లీడర్లతో పాతిక వేల రూపాయల నుండి 50 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ మాట్లాడుకుని మల్లెమాల వారు కార్యక్రమాన్ని రూపొందించారు. కార్యక్రమం ప్రారంభమైన రెండు మూడు వారాలకే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో టీం లీడర్ల యొక్క రెమ్యూనరేషన్ కూడా పెంచారు. చమ్మక్ చంద్ర కారణంగా జబర్దస్త్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. అందుకే ఆయనకు అప్పట్లోనే ఏకంగా లక్షన్నర వారకు రెమ్యూనరేషన్ ని ఇచ్చేవారట. ఆ స్థాయిలో సుడిగాలి సుదీర్ మరియు హైపర్ ఆది

టీం లకు మాత్రమే మల్లెమాల వారు రెమ్యూనరేషన్ ఇస్తూ వచ్చారు. హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యాడు. ఆయన జబర్దస్త్ కి దూరమైన సమయంలో తీసుకున్న రెమ్యూనరేషన్ ఒక్కొక్క ఎపిసోడ్ కి లక్షన్నర రూపాయలు. గతంతో పోలిస్తే కాస్త తక్కువే అయినా కూడా ఇతర కార్యక్రమాల్లో వరుసగా ఆయన చేస్తున్నాడు కనుక మల్లెమాల వారు లక్షన్నర రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి ఆయన టీమ్ లో ఇతర ముఖ్య నటినటులకు అదనంగా రెమ్యూనరేషన్ ఇచ్చేవారట. హైపర్ ఆది వెళ్లి పోవడంతో ఆయన స్థానంలో సద్దాం టీం బరిలోకి దిగింది. ఇప్పుడు సద్దాం కి కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా లక్ష రూపాయల రెమ్యూనరేషన్ దక్కుతుందని తెలుస్తుంది.

Jabardasth hyper aadi and saddam remuneration

Jabardasth hyper aadi and saddam remuneration

టీం లీడర్ కి మాత్రమే లక్ష రూపాయలు ఇచ్చి కంటెస్టెంట్స్ కి మల్లెమాల వారు రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదు. సద్దాం తన టీం లోని వారికి ఆ లక్ష రూపాయల నుండి చెల్లించాల్సి ఉంటుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సద్దాం 30 వేల రూపాయలు తీసుకొని యాదమ రాజు 25 వేల రూపాయలు తీసుకొని మిగిలిన వారికి బ్యాలెన్స్ అమౌంట్ పంచుతారని తెలుస్తుంది. మొత్తానికి హైపర్ ఆది స్థానంలో వచ్చిన సద్దాం రెమ్యూనరేషన్ కూడా పరవాలేదు అన్నట్లుగా ఉందంటూ బుల్లితెర వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది