Adhire Abhi : అన్యాయం చేసి వదిలిపోయాడు.. స్టేజ్ మీదే అదిరే అభిరే పై గడ్డం నవీన్ కామెంట్
Adhire Abhi : జబర్దస్త్ షో అంటే అదో ప్రవాహాం. అందులో కొత్త వాళ్లు వస్తుంటారు.. పాత వాళ్లు పోతుంటారు. కొందరు శాశ్వతంగా అక్కడే ఉంటారు. అలా ఎంతో మంది షో నుంచి వీడిపోయారు. కొత్త వాళ్లు జాయిన్ అయ్యారు. అయితే ఎప్పటి నుంచో ఉన్న అదిరే అభి సైతం జబర్దస్త్ షోను విడిచి వెళ్లాడు. కారణాలు ఏంటో అంత స్పష్టంగా తెలియడం లేదు గానీ.. మొత్తానికి మల్లెమాలకు దూరంగా వెళ్లాడు.అదిరే అభి.. ఇక స్టార్ మాలోనే సందడి చేస్తున్నాడు. నాగబాబు న్యాయ నిర్ణేతగా వస్తోన్న కామెడీ స్టార్స్ ధమాకాలో అభి సందడి చేస్తున్నాడు.
మొత్తానికి జబర్దస్త్ షోలో అయితే అభి టీం ఒంటరిగా మిగిలిపోయింది. మధ్యలో కొన్ని వారాలు సొంతంగా నిలబడేందుకు ట్రై చేసింది. కానీ వర్కవుట్ కాలేదు. నవీన్, రాము వంటి వారిని ఎవ్వరూ పెట్టుకోవడం లేదు. ఒంటరిగానే ఉంటున్నారు.మధ్య మధ్యలో వేరే టీంలు నవీన్, రాములను వాడుకుంటున్నాయి. అయితే తాజాగా నవీన్ తన బాధను బయటకు చెప్పేశాడు. స్టేజ్ మీదే తన బాధనంతా వెల్లగక్కేశాడు. మళ్లీ చివర్లో దాన్ని కవర్ చేసేసుకున్నాడు. వెంకీ మంకీ టీంలో నవీన్ కనిపించాడు. చిన్నతండ్రి అని పిలవడం నవీన్ పాక్కుంటూ వచ్చాడు.

Jabardasth Naveen Satires On Adhire Abhi Quitting Show
నువ్వెందుకు వచ్చావ్ అని వెంకీ అడుగుతాడు.నువ్వే కదా? నాన్న, చిన్నితండ్రీ అన్నావ్ అందుకే వచ్చాను అంటాడు. అందుకే నిన్ను ఎవ్వరూ కూడా టీంలోకి తీసుకోవడం లేదని వెంకీ కౌంటర్ వేస్తాడు. చూశావా? నువ్ అన్యాయం చేసి వెళ్లావ్.. నువ్ వెళ్లినప్పటి నుంచి పరిస్థితి ఇలా ఉంది.. అదే నువ్వుంటే మాకు ఇలా ఉండేదా? అని అదిరే అభి గురించి పరోక్షంగా అనేస్తాడు. ఎవరి గురించి అంటున్నావ్ అని వెంకీ అడిగితే.. మీ అమ్మ గురించి అని కవర్ చేసేస్తాడు నవీన్.
