Jabardasth : జబర్దస్త్ కొత్త యాంకర్ కోసం ఇంత బిల్డప్పా?.. ఆమె వస్తోందంటూ నెటిజన్ల కామెంట్లు
Jabardasth : జబర్దస్త్ షోలో కొత్త యాంకర్ రాబోతోంది. ఈ విషయం మీద గత కొన్ని వారాల నుంచి చర్చలు జరుగుతూనే వచ్చాయి. అనసూయ వెళ్లిపోతోందనే రూమర్లు నిజమయ్యాయి. గత వారమే ఆమెది చివరి ఎపిసోడ్. అలా అనసూయకు మంచి వీడ్కోలు ఇచ్చి పంపించారు. ఇక ఇప్పుడు ఈ షోకు కొత్త యాంకర్ రాబోతోంది. అసలే ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీలకు రష్మీ యాంకర్‌గా ఉంది. సుధీర్ వెళ్లిపోవడంతో ఆ పోస్టును శ్రీదేవీ డ్రామా కంపెనీ వాళ్లు రష్మీకి అప్పగించారు. ఆమె కూడా బాగానే చేస్తోంది. జబర్దస్త్ షోను కూడా ఆమెకు ఇస్తారని అంతా అనుకుంటున్నారు. జబర్దస్త్ యాంకర్ కూడా రష్మీనే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.
రష్మీనే యాంకర్ అయితే ఇంత బిల్డప్ ఇచ్చి ఉంటారా? అని ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పల్లకిలో తీసుకురావడం, గాజులు, చెవి రింగులు చూపిస్తూ సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ ఇవ్వాలా? అంటూ నెటిజన్లు అనుకుంటున్నారు. ఆ కొత్త యాంకర్ ఎవరో చూపించేందుకు డైరెక్షన్ టీం కాస్త ఎక్కువే చేసింది. ఆ కొత్త యాంకర్ ఎవరా? అని జబర్దస్త్ ఆర్టిస్టులు అనుకోవడం, ఆమెను చూసేందుకు ఎగబడటం చేస్తున్నారు. ఈ కొత్త యాంకర్ ఎవరు? ఎందుకు అంత బిల్డప్ ఇస్తున్నారని నెటిజన్లు అనుకుంటున్నారు.
ఆమె కచ్చితంగా రష్మీనే అని కొందరు బలంగా నమ్ముతున్నారు. అయితే ఆ మధ్య ప్రవంతి చొక్కారపు కూడా యాంకర్‌గా మారుతోందని టాక్ వినిపించింది. అనసూయ స్థానంలో స్రవంతి రాబోతోందని, ఇకపై ఆమె యాంకర్‌గా ఉంటుందనే గాసిప్ బయటకు వచ్చింది. మరి యాంకర్‌గా ఎవరు వస్తారో చూడాలి. ఇన్నాళ్లు యాంకర్‌గా ఉన్న అనసూయ ఎందుకు వెళ్లిందో తెలియడం లేదు. టైం లేక వెళ్లింది అనడానికి లేదు.. ఎందుకంటే స్టార్ మాలో సింగింగ్ షో చేస్తోంది. కానీ మల్లెమాలకు మాత్రం టైం కేటాయించలేకపోయింది అనసూయ. లోలోపల ఏదో జరిగిందని, అందుకే బయటకు వచ్చిందని అంతా అనుకుంటున్నారు.