Jabardasth Rohini : నువ్వు కూడా తప్పు చేశావా?.. రోహిణి పరువుతీసిన పరదేశీ
Jabardasth Rohini : జబర్దస్త్ స్టేజ్ మీద పరదేశీ ఎలా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. పరదేశీ తన కామెడీ కంటే వైజాగ్ ఘటనతోనే అందరికీ గుర్తుండిపోయాడు. వైజాగ్‌లో వ్యభిచార గృహంలో పట్టుబడటంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యాడు. దొరబాబు, పరదేశీలు ఇద్దరూ దొరికిన ఘటన జబర్దస్త్ షోను కుదిపేసింది. మొత్తానికి ఆ వ్యవహారాన్ని హైపర్ ఆది ఎలాగోలా సద్దుమణిగేలా చేసేశాడు.అయితే ఆది ఆ గొడవను బయటకు రాకుండా సెటిల్ చేయడం ఒకెత్తు అయితే..
తన స్కిట్లో మళ్లీ పెట్టుకోవడం మరో ఎత్తు. కానీ నాటి ఘటన నుంచి నేటి వరకు ఆది వారిద్దరినీ ఆడుకుంటూనే ఉంటాడు. తన స్కిట్లో ఏదో రకంగా ఆ వైజాగ్ ఘటనను మాత్రం ఇంక్లూడ్ చేస్తూనే ఉంటాడు. మానిపోయిన గాయాన్ని రేపుతూనే ఉంటారు. ఇక అందరికీ ఆ ఘటన మీద సెటైర్లు వేయడం అలవాటు అయింది.పరదేశీ, దొరబాబులు కూడా ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. వారు కూడా తమ మీద తామే పంచులు వేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా అదే విషయాన్ని రోహిణికి కూడా ఆపాదించాడు పరదేశీ.

Jabardasth Paradesi Satires On Rohini In Extra Jabardasth
తాజాగా వేసిన స్కిట్లో రోహిణి, పరదేశీ భార్యాభర్తలుగా నటించారు. ఇందులో భాగంగా రోహిణి ఓ డైలాగ్ వేస్తుంది. ఏమండీ నేను తప్పు చేశాను అని కాళ్ల మీద పడ్డట్టుగా నటిస్తుంది.రోహిణి వేసిన డైలాగ్‌కు పరదేశీ డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టేశాడు. ఏంటి నువ్ కూడా తప్పు చేశావా? అంటూ వైజాగ్ ఘటనను పరోక్షంగా అంటించాడు. దీంతో రోహిణి మొహం మాడిపోయినట్టు అయింది. మొత్తానికి వైజాగ్ ఘటన మాత్రం ఎప్పుడూ ఏదో ఒక విధంగా స్కిట్లో కనిపిస్తూనే ఉంటుంది.
