Jabardasth Rocking Rakesh : సుజాతను లైన్‌లో పెట్టిన రాకేష్.. అందరి ముందే చెప్పేశాడు
Jabardasth Rocking Rakesh : జోర్దార్ సుజాత న్యూస్ రీడర్‌గా ప్రయాణం మొదలుపెట్టేసింది. బిగ్ బాస్ ప్రతీ సీజన్‌లో న్యూస్ రీడర్లను తీసుకుంటూ ఉంటారు. అలా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో సుజాత వచ్చింది. కానీ తన అతితో త్వరగానే ఎలిమినేట్ అయింది. ఆమె వెకిలి నవ్వులను అందరూ అసహ్యించుకున్నారు. అయితే కొంత మంది మాత్రం ఆమె నవ్వుకు అభిమానులయ్యారు.
బిట్టూ అంటూ నాగార్జునను పిలవడంతో సుజాతకు నెగెటివ్ ఇమేజ్ ఏర్పడింది. ఇక అభిజిత్ మ్యాటర్లోనూ సుజాతకు ఎదురుదెబ్బ తగిలింది. మొత్తానికి సుజాత మాత్రం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక బుల్లితెరపై అవకాశాలు బాగానే వచ్చాయి. కామెడీ స్టార్స్, ఈ టీవీ స్పెషల్ ఈవెంట్లు, జబర్దస్త్ వంటి షోల్లో సుజాత బాగానే కనిపిస్తోంది.

jabardasth rocking rakesh proposes sujatha
Jabardasth Rocking Rakesh : రాకేష్, సుజాత లవ్ ట్రాక్
ఇక రాకింగ్ రాకేష్ టీంలో పిల్లలు లేకపోయే సరికి ఇలా కొత్త ఆర్టిస్ట్‌లను పట్టుకొచ్చేశాడు. అందులో సుజాతను చాలా రోజుల నుంచి పెట్టుకున్నాడు. మధ్యలో రోహిణితో ట్రాక్ నడిపించాడు. ఇప్పుడు సుజాతతో నడిపిస్తున్నాడు. తాజాగా వదిలిన ప్రోమోలో ఈ ఇద్దరూ రెచ్చిపోయారు. నువ్ అందరికీ రాకింగ్ రాకేష్ కానీ నాకు మాత్రం కింగ్ రాకేష్ అని సుజాత అంటుంది. నువ్ నన్ను భరించావ్.. నిజం చెప్పాలంటే ఐ లవ్యూ అని అందరి ముందే చెప్పేశాడు రాకేష్.