Jabardasth Varsha : జబర్దస్త్ చరిత్రలో అతిపెద్ద ట్విస్ట్ ఇదే..!
Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష గురించి తెలుసు కదా. తనకు జబర్దస్త్ తోనే పాపులారిటీ లభించింది. ఒకప్పుడు సుధీర్, రష్మీ జంట ఎంత ఫేమసో.. ఇప్పుడు ఇమ్మాన్యుయేల్, వర్ష అంత ఫేమస్. అసలు సుధీర్, రష్మీ మధ్య ఏం ఉంది అంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. సుధీర్.. జబర్దస్త్ ను వదిలేశాడు. దీంతో ఇద్దరి గురించి చర్చించడం కూడా నెటిజన్లు ఆపేశారు. ఆ తర్వాత లైమ్ లైట్ లోకి వచ్చిన ఇమ్మాన్యుయేల్, వర్ష జంట గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి స్కిట్స్ చేయడమే కాదు.. ఇద్దరూ జబర్దస్త్ స్టేజీ మీదనే ప్రపోజ్ కూడా చేసుకున్నారు.
కోడలు వస్తోందని మీ అమ్మకు చెప్పు అంటూ ఇమ్మాన్యుయేల్ కు వర్ష ప్రపోజ్ చేయడం కూడా చూశాం. అయితే.. అదంతా కేవలం ప్రాంక్ మాత్రమే. జనాలు స్కిట్స్ చూడటం కోసం, జబర్దస్త్ కు పేరు రావడం కోసం ఇలా వాళ్ల మధ్య ఏదో ఉంది అంటూ స్కిట్స్ చేసి కల్పించి చూపిస్తున్నారు. ఏదో ఒక ఎపిసోడ్, రెండు ఎపిసోడ్స్ లో అంటే ఓకే కానీ.. ప్రతి ఎపిసోడ్ లో అదే చూపించడం జనాలకు కూడా చిరాకు తెప్పిస్తోంది. వాళ్ల మధ్య ఏం లేకపోయినా కూడా ఏదో ఉందంటూ జబర్దస్త్ యాజమాన్యం కూడా వాళ్లతో స్కిట్లు చేయిస్తోంది. చివరకు ఓ ఎపిసోడ్ లో అయితే ఏకంగా వర్ష మెడలో ఇమ్మాన్యుయేల్ తాళి కూడా కట్టేశాడు. ఇలా స్టేజీల మీద పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ నెటిజన్లు, ప్రేక్షకులు పెదవి విరిచారు.
Jabardasth Varsha : జబర్దస్త్ మానేయాలంటూ వర్ష ఇంట్లో నుంచి ఒత్తిడి
ఈ విషయం వర్ష ఇంట్లో తెలిసి.. తను హద్దు మీరుతోందని వెంటనే జబర్దస్త్ మానేయాలని వర్షకు చెప్పేశారట తన ఫ్యామిలీ మెంబర్స్. సోషల్ మీడియాలో తన గురించి, ఇమ్మాన్యుయేల్ గురించి చాలా బ్యాడ్ గా కామెంట్లు కూడా పెడుతున్నారట. దీంతో వర్ష తట్టుకోలేకపోతోందట. అందుకే ఈ గొడవ అంతా ఎందుకు.. వెంటనే జబర్దస్త్ ను మానేయమని తన పేరెంట్స్ అంటున్నారట. దీంతో వర్ష జబర్దస్త్ ను వీడిపోతోందా అనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ ను వదిలి.. వర్ష మరి వెండి తెరకు వెళ్తుందా? సినిమాలో ప్రయత్నిస్తుందా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజలు వేయిట్ చేసి చూడాల్సిందే.