Janaki Kalaganaledu 06 August 2022 Episode : జ్ఞానాంబ షరతులు ఒప్పుకున్న జానకి.. ఎలాగైనా ఇరికించాలి అని చూస్తున్న మల్లిక..
Janaki Kalaganaledu 06 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే ఈ సీరియల్ జానకి కలగనలేదు ఈ సీరియల్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఈ సీరియల్ తాజాగా రిలీజ్ కాదు. 361 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానంబ జానకి చదువుకోడానికి కొన్ని షరతులను పెడుతుంది. ఆ షరతులు నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలు వి నా తర్వాత నువ్వే ఈ బాధ్యతలన్నిటిని చూసుకోవాలి. అదేవిధంగా నీ భర్త ప్రేమ అనురాగాలకు నీ చదువు అడ్డం కావద్దు. అలాగే ఈ ఇంటికి గౌరవ మర్యాదలకు మచ్చ తీసుకురావద్దు. అదేవిధంగా ఈ ఇంటికి వారసులని ఇవ్వడానికి నీ చదువు అడ్డం కావద్దు. ఇలాంటివన్నీ ఒప్పుకుంటే నేను నీ చదువుకి అడ్డు చెప్పను. వీటిలో ఒక్కదాన్ని నువ్వు సరిగా ఆచరించకపోయినా ఆ క్షణమే నా నిర్ణయం కు నువ్వు తలవంచాలి. అని అంటుంది జ్ఞానాంబ.
అప్పుడు జానకి బాధపడుతూ సరే అత్తయ్య గారు మీరు చెప్పిన ఈ షరతులు అన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను. ఈ ఇంటికి మీ అబ్బాయికి ఈ ఇంటి గౌరవం, మర్యాదలకు ఎటువంటి మచ్చ నేను తీసుకురాను అని జానకి అంటుంది. అప్పుడు గోవిందరాజు నువ్వేం చేస్తున్నావ్ జ్ఞానం తను ఐపీఎస్ కావాలని కోరుకుంటుంది. నువ్వు ఈ షరతులను ఎందుకు పెడుతున్నావు. ఇలాంటివన్నీ వద్దు జ్ఞానం అని అంటుండగా… జ్ఞానంబ ఇక నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ సంతోషంగా ఉంటారు. కానీ మల్లికా, జానకిని ఎలాగైనా ఈ షరతులు తప్పేలా చేయాలి. అని కంకణం కట్టుకుంటుంది. జానకిని ఇరికించి చదువును ఆపేందుకు ఏదో ఒక ప్లాన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే జానకి రామ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. జానకి రామతో దగ్గర కావాలని చూస్తూ ఉంటుంది.
జానకి ఎలాగైనా పిల్లల్ని కనాలి. అత్తయ్య గారిని సంతోష పరచాలి. అని ఆలోచిస్తూ రామతో చెప్తూ ఉంటుంది. రామ మాత్రం దానికి ఒప్పుకోడు మీరేం చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా..మీ ఐపీఎస్ కళ నెరవేరేవరకు మీరు ఇలాంటివి అసలు ఆలోచించకండి. మీ చదువు మీద మాత్రమే దృష్టి పెట్టండి. తొందర్లో మీ చదువు అయిపోతుంది కదా. తర్వాత ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం అని రామ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన మల్లికా గట్టిగా ప్లాన్ వేసుకుని జ్ఞానంబ దగ్గరికి చెప్పడానికి వెళుతుంది. కానీ జ్ఞానం బా చూసినచూపుకి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది మల్లిక. ఇలా కాకుండా తనని గట్టిగా ఇరికించాలి అని ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. జానకి మాత్రం ఎలాగైనా ఈ ఇంటికి వారసులు ఇచ్చి అత్తయ్య గారిని సంతోష పెట్టాలి అని రామాని కన్వీస్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.