Janaki Kalaganaledu 13 Jan Today Episode : జానకి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకున్న సునంద.. మైరావతి గురించి తెలుసుకొని సునంద షాక్.. జానకి విషయంలో మైరావతి షాకింగ్ నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 13 Jan Today Episode : జానకి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకున్న సునంద.. మైరావతి గురించి తెలుసుకొని సునంద షాక్.. జానకి విషయంలో మైరావతి షాకింగ్ నిర్ణయం

 Authored By gatla | The Telugu News | Updated on :13 January 2022,12:00 pm

Janaki Kalaganaledu 13 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు జనవరి 13, 2022 గురువారం ఎపిసోడ్ 214 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి పేరు మీద ఎఫ్ఐఆర్ వెంటనే ఫైల్ చేయండి. ఆ జానకి అస్సలు బయటికి రాకూడదు అని ఎస్ఐకి చెబుతుంది సునంద. నేను 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్ కు వస్తున్నాను అని చెబుతుంది సునంద. ఇంతలో జానకి దగ్గరికి రామా వస్తాడు. జానకి గారు.. మీరు కోర్టుకు వెళ్తే ఇక ఐపీఎస్ కాలేరట కదా. కన్నబాబు దగ్గరికి వెళ్లాను. వాడి కాళ్లు పట్టుకున్నా కూడా వాడు కనికరించలేదు అని బాధపడతాడు రామా. పరిస్థితి ఇంత దూరం రావడానికి ఒక రకంగా మీరే కారణం. కారణం లేకుండా కన్నబాబు మీద మీరు చేయి చేసుకోరు. ఏం జరిగిందో చెప్పి ఉంటే మేము ఎలాగోలా ఏదో ఒకటి చేసి బయటికి తీసుకొచ్చేవాళ్లం.. అని అంటాడు రామా.

janaki kalaganaledu 13 january 2022 full episode

janaki kalaganaledu 13 january 2022 full episode

ఇక మీ ఐపీఎస్ కల చేయి జారి పోయిందన్న ఆలోచన వస్తే చాలు.. ఊపిరి ఆగిపోయినంత బాధ అవుతోంది. మీమీద కేసు ఫైల్ అయితే మీరు ఐపీఎస్ అవడం అసాధ్యం అని తెలిసి కూడా ఎందుకండి మౌనంగా ఉన్నారు. మీ కల కంటే పెద్దదా మౌనం. ఇప్పటికైనా దయచేసి చెప్పండి జానకి గారు.. అని చెబుతుండగానే ఇంతలో ఎస్ఐ వచ్చి ఎఫ్ఐఆర్ రెడీ చేయాలంటూ రైటర్ కు చెబుతాడు. చెప్పిన సెక్షన్లు అన్నీ నోటు చేసుకున్నారు కదా. ఎఫ్ఐఆర్ లో ఒక్క సెక్షన్ కూడా మిస్ అవ్వడానికి వీలు లేదు అని చెబుతాడు ఎస్ఐ. దీంతో జానకి, రామా షాక్ అవుతారు. సార్.. దయచేసి ఎఫ్ఐఆర్ రాయకండి సార్.. ప్లీజ్ సార్ అంటాడు రామా. మీకు దండం పెడతాను సార్.. నా భార్యకు ఒక ఆశయం ఉంది. నా భార్య మీద పోలీస్ కేసు ఉంటే ఆ ఆశయం నెరవేరదు సార్.. దయచేసి ఎఫ్ఐఆర్ రాయకండి సార్ అంటాడు రామా.

ఆశయం అంటున్నావు.. కొంపదీసి కర్తవ్యం సినిమాలో విజయశాంతిలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటుందా ఏంటి అంటాడు ఎస్ఐ. నువ్వు కాళ్లు పట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్నా ఏం ప్రయోజనం లేదు. వెళ్లి లాయర్ ను చూసుకో. కనీసం బెయిల్ అయినా వస్తుంది.. అంటాడు ఎస్ఐ.

ఏమండి.. వెనక్కి వచ్చేయండి.. వద్దండి.. మీరు బతిమిలాడకండి అంటుంది జానకి. సార్ సార్ ప్లీజ్ తనను వదిలేయండి సార్ అంటే కూడా ఎస్ఐ వినడు. కానిస్టేబుల్ ఇతడు ఇంకో మాట మాట్లాడితే ఈడ్చుకెళ్లి బయట పడేయండి అని అంటాడు.

ఎఫ్ఐఆర్ పూర్తవుతుండగానే సునంద, కన్నబాబు వస్తారు. ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ పూర్తి కావచ్చిందా అని అడుగుతుంది సునంద. ఐపోవచ్చింది మేడమ్.. అని చెప్తాడు ఎస్ఐ. ఇంతలో రైటర్ ఆ ఎఫ్ఐఆర్ కాపీని పోలీస్ కు ఇస్తుండగా దాన్ని తీసుకొని చించేస్తుంది సునంద.

Janaki Kalaganaledu 13 Jan Today Episode : కేసును వెనక్కి తీసుకుంటున్నామని చెప్పిన సునంద

మా వాడు కేసు వెనక్కి తీసుకుంటున్నాడు అంటుంది సునంద. దీంతో  అందరూ షాక్ అవుతారు. కన్నబాబు చెప్పినా కూడా వినదు సునంద. అసలు ఏం జరిగిందంటే.. మైరావతి తన ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇస్తుంది. అందుకే మైరావతికి బయపడి కేసును విత్ డ్రా చేసుకొని.. జానకిని తీసుకొని సునంద తన ఇంటికి వెళ్లిపోతుంది.

ఇదేంటి కేసు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పింది కదా. ఇంతలోనే ఏం జరిగింది అని అనుకుంటాడు రామా. కానీ.. జరిగిందేంటంటే.. మైరావతి తన ఇంటికి వెళ్తుంది. ఎవరు నువ్వు.. అని అడుగుతుంది సునంద. ఈ కార్పొరేటర్ సునంద ఇంటికే వచ్చి నన్నే వెటకారం చేస్తావా ఎవరు నువ్వు అని అడుగుతుంది సునంద.

ఎవరు మీరు.. అంటే తెలుస్తుందిలే అంటుంది మైరావతి. దీంతో వెంటనే సునందకు ఎంపీ ఫోన్ చేస్తాడు. మీ ఎదురుగా మైరావతి గారు ఉన్నారా అని అడుగుతుంది. అవును.. ఎవరో పెద్దావిడ వచ్చారు అంటుంది. పెద్దావిడ కాదు.. పెద్దపులి అని అంటాడు ఎంపీ. వెంటనే నువ్వు పెట్టిన కేసు విత్ డ్రా చేసుకో అని ఎంపీ చెబుతాడు.

దీంతో తప్పయిందండి.. నీ మనవరాలు నా కొడుకును కొట్టిందని చెప్పి ఈ కేసు పెట్టాను. ఇది మొదటి తప్పు అని వదిలేయండి. ఇంకోసారి ఇలాంటిది జరగదు అని అంటుంది సునంద. లోపల నుంచి తన్నుకొస్తోంది కదా ఏంటది.. అది భయం.. అది ఈ మైరావతి కుటుంబంతో పెట్టుకోకముందు ఉండాలి అంటుంది మైరావతి.

వెంటనే.. జానకిని తీసుకొని తన ఇంటి దగ్గర దిగబెడుతుంది సునంద. జానకికి ఏం అర్థం కాదు. ఇంట్లో చూస్తే మైరావతి ఉంటుంది. మైరావతిని చూసి జానకి షాక్ అవుతుంది. అమ్మ మీరు చెప్పిన ప్రకారమే కేసు వెనక్కి తీసుకున్నాం. మీరు చెప్పినట్టుగానే మీ మనవరాలిని నేనే స్వయంగా మీ ఇంటికి తీసుకొచ్చాను అంటుంది సునంద.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

 

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది