Janaki Kalaganaledu 13 Oct Today Episode : జానకిని ఇంట్లోంచి వెళ్లగొట్టినట్టు కలగన్న మల్లిక.. జానకి చదువు విషయం తెలిసినా జ్ఞానాంబ.. జానకిని ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లగొట్టలేదు?
Janaki Kalaganaledu 13 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 13 అక్టోబర్ 2021, బుధవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ.. జానకిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టినట్టు కారులోనే కూర్చొని కలగంటుంది మల్లిక. కారులో జ్ఞానాంబ, మల్లిక ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తారు. జ్ఞానాంబ లోపలికి వెళ్లి కూర్చుంటుంది. మరోవైపు రామా, జానకి ఇద్దరూ తన పుట్టిన రోజు సందర్భంగా షాపింగ్ కు వెళ్తుంది. జానకి ఒక చీర కొంటుంది. చీర ఎలా ఉందో చెప్పండి అని అడుగుతుంది. చాలా బాగుందండి అంటుంది. కాకపోతే కాస్త పెద్దవాళ్లు కట్టుకునే చీరలా ఉంది అంటాడు. ఈ చీర అత్తయ్య గారి కోసం తీసుకున్నాను అండి అని చెబుతుంది జానకి. ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి బయలుదేరుతారు…

janaki kalaganaledu 13 october 2021 full episode
జ్ఞానాంబ తన రూమ్ లో కూర్చొని అన్ని విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది. నా కొడుకు విషయంలో ఏదైతే జరగకూడదని జాగ్రత్త పడ్డానో అదే జరిగింది. నా బిడ్డ అమాయకుడు. వాడి మనసు సున్నితం. వాడి మనసు బాధపడేలా ఎవరైనా ప్రవర్తిస్తే అస్సలు తట్టుకోలేను. ఆ రోజు నా తమ్ముడి జీవితంలో జరిగిందే నా కొడుకు జీవితంలో జరిగితే ఎలా.. అని అనుకుంటుంది జ్ఞానాంబ.
ఇంతలో.. ఇంట్లో జానకి బర్త్ డే సంబురాలు జరపడం కోసం డెకరేషన్స్ చేస్తుంటారు. విష్ణు, అఖిల్, జ్ఞానాంబ భర్త అందరూ పూలు అలంకరిస్తుండగా ఇంతలో పిచ్చి పిచ్చిగా డ్యాన్సులు వేస్తూ ఉంటుంది. ఆమెను చూసి అందరూ షాక్ అవుతారు. ఏంటి మల్లిక ఇలా చేస్తుంది అని అందరూ ఈమెకు దెయ్యం పట్టింది అని అనుకుంటారు. నాకేం దెయ్యం పట్టలేదు.. జానకి పుట్టినరోజు కదా అని సంతోషంగా ఉన్నా అంటుంది.ఇంతలో గోవిందరాజులు.. కేకు తీసుకురాలేదా అని జ్ఞానాంబను అడుగుతాడు. మరిచిపోయాను అని అంటుంది జ్ఞానాంబ.
Janaki Kalaganaledu 13 Oct Today Episode : జానకి పుట్టిన రోజు సందర్భంగా డెకరేషన్స్ చేసిన గోవిందరాజులు
నేను తీసుకొస్తా నాన్నా అని అఖిల్ చెప్పి వెళ్తాడు. ఏమైంది జ్ఞానాంబకు. అస్సలు మాట్లాడటం లేదు అని అనుకుంటాడు గోవిందరాజులు. ఇంతలో రామా, జానకి వచ్చేస్తారు.కోడలు పుట్టిన రోజు సందర్భంగా డెకరేషన్ చేయించా.. ఎలా ఉంది అని అడుగుతాడు గోవిందరాజులు. ఇక.. జానకి, రామా రాగానే.. మల్లిక ఫుల్ ఖుషీ అవుతుంది. మీ అమ్మ బయటికి వెళ్లి వచ్చినప్పటి నుంచి ఏదో పరద్యానంగా ఉంది. కాస్త ఏమైందో నువ్వు కనుక్కోరా.. అని అంటాడు గోవిందరాజులు.
ఏవండి.. నేను వెళ్లి అత్తయ్య గారికి ఈ చీర ఇచ్చి నేను మాట్లాడి వస్తా అని చెబుతుంది జానకి. డోర్ తీసి తన దగ్గరికి వెళ్లబోతుంది. అత్తయ్యగారు అని అంటుంది. దీంతో జ్ఞానాంబ ఏం మాట్లాడదు. అలాగే కూర్చుంటుంది. మీకోసం ఒక చీర తీసుకొచ్చాను అంటుంది. ఈ కలర్ మీకిష్టమని తీసుకొచ్చా అని అంటుంది. ఈ చీరలో మీరు సాక్షాత్తూ అమ్మవారిలా ఉంటారు. అమ్మ బిడ్డల మీద చూపించే ప్రేమకు ఏదిచ్చినా తక్కువే. ఏదీ సాటి రాదు. ఏదో నా సంతృప్తి కోసం ఇది తీసుకొచ్చాను.. అని చెప్పి ఆ చీరను తనకు ఇస్తుంది జానకి.

janaki kalaganaledu 13 october 2021 full episode
అన్నట్టు అత్తయ్య గారు మీకో విషయం చెప్పాలి. ఉదయం దీపం కొండెక్కింది. బైక్ పంక్షర్ అయింది. ఇవాళ ఏదో అవశకునం జరగబోతోందని అనుకున్నా. కానీ.. మీరిచ్చిన ధైర్యం.. మీతో మాట్లాడిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది జానకి. కట్ చేస్తు రాత్రి పూట జానకి, రామా రొమాన్స్ మొదలవుతుంది. ఇద్దరూ తమ శోభనానికి రెడీ అయినట్టుగా కనిపిస్తారు. మరి.. వాళ్ల ఫస్ట్ నైట్ జరుగుతుందో లేదో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.