Janaki Kalaganaledu 13 Sep Today Episode : అమ్మ గాజులు అమ్మి సివిల్స్ కోచింగ్ ఫీజు కట్టాలనుకున్న జానకి.. కానీ.. అఖిల్ అప్పుచేశాడని తెలియడంతో ఆ గాజులు అమ్మి జ్ఞానాంబకు తెలియకుండా?

Janaki Kalaganaledu 13 september 2021 monday episode 126 highilights
Janaki Kalaganaledu 13 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ 13 సెప్టెంబర్ 2021, సోమవారం 126 ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. మల్లిక చేసిన హడావుడి వల్ల.. మల్లికకు పెత్తనం ఇచ్చేది లేదని చెప్పి జ్ఞానాంబ వెళ్లిపోతుంది. దీంతో.. అయ్యో దేవుడా అని గుక్క పెట్టి మరీ ఏడుస్తుంది మల్లిక.

Janaki Kalaganaledu 13 september 2021 monday episode 126 highilights
కట్ చేస్తే.. జానకి తన రూమ్ లో సివిల్స్ కు ప్రిపేర్ అవుతుంటుంది. ఇంతలో రామా అక్కడికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు. ఏమండి.. నా మీద కోపం వస్తుందా? అని అడుగుతుంది జానకి. ఎందుకు నీ మీద కోపం అంటాడు. నాకు పెత్తనం వద్దు అని చెప్పాను కదా.. అత్తయ్య మాటకు ఎదురు చెప్పాను కదా.. అంటుంది జానకి. అదేం లేదు జానకి.. నాకు నీమీద ఎప్పటికీ కోపం ఉండదు.. అని అంటాడు రామా. బతకాలన్న ఆశను, భవిష్యత్తు మీద భరోసాను మీరు ఇచ్చారు. నేను అడగకపోయినా.. చెప్పకపోయినా.. నేనేంటో మా ఆయనకు తెలుసు.. అంటూ రామాను పొగిడేస్తుంది జానకి. నన్ను ఇంతలా అర్థం చేసుకునే మా ఆయన మీద ఆకాశమంత ప్రేమ ఉంటుంది కానీ.. అర్థం పర్థం లేని కోపం ఎందుకు ఉంటుంది చెప్పండి.. అంటుంది జానకి. నాకు అందంతో పాటు.. అర్థం చేసుకునే భార్య దొరికింది.. మా ఆవిడ బంగారం.. అని రామా అంటాడు.

Janaki Kalaganaledu 13 september 2021 monday episode 126 highilights
Janaki Kalaganaledu 13 Sep Today Episode : సివిల్స్ కోచింగ్ ఫీజు కట్టాలంటూ రామాకు చెప్పిన జానకి
అవును జానకి గారు.. ఇందాక నేను వచ్చినప్పుడు మిమ్మల్ని గమనించాను. మీరు ఏదో కంగారు పడ్డారు ఎందుకండి.. అని రామా అడగగా.. అయ్యో.. కంగారు ఏం లేదండి.. అంటుంది జానకి. నిజం చెప్పండి.. అంటే కాస్త తడబడుతుంది జానకి. వచ్చే వారం కోచింగ్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి.. అంటుంది జానకి. ఈ విషయంలో కంగారు ఎందుకు అంటే.. ఫీజు కూడా అప్పుడే కట్టాలి అంటుంది. ఫీజు ఏమాత్రం ఉంటుంది చెప్పండి కట్టేద్దాం అంటాడు రామా. వేలల్లో ఉంటుంది అని జానకి చెబుతుంది.

Janaki Kalaganaledu 13 september 2021 monday episode 126 highilights
దీంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు రామా. నాకు వంద రూపాయలు కావాలన్నా అమ్మ దగ్గర్నుంచి తీసుకుంటాను. ఫీజు వేలల్లో అనేసరికి.. డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలో నేను చూస్తాను లేండి.. ఈ విషయాలన్నీ నాకు వదిలేసేయండి. నేనే ఏదో ఒకటి చేస్తాను. ఇక ఈ విషయాల గురించి మీరేమి కంగారు పడకుండా మరిచిపోండి.. నేను చూసుకుంటాను.. అని చెబుతాడు రామా.
నాకోసం ఆయన వాళ్ల అమ్మగారి ముందు అడుగడుగునా ఓడిపోవడానికి వీలు లేదు.. అని అనుకుంటుంది జానకి. ఇంతలో బీరువాలో నుంచి తన తల్లిదండ్రుల ఫోటోను తీస్తుంది. అలాగే.. వాళ్లు చేయించిన బంగారు గాజులను చూస్తుంది. అమ్మా.. వీటిని నేను నీ జ్ఞాపకంగా ఉంచుకుందామనుకున్నా కానీ.. వీటిని అమ్మేసి కోచింగ్ ఫీజును కట్టేస్తానమ్మా.. అని చెబుతూ బాధపడుతుంది జానకి.
Janaki Kalaganaledu 13 Sep Today Episode : తల్లి గాజులు అమ్మి ఫీజు కట్టాలని భావించిన జానకి
నా కారణంగా మా ఆయన ఇబ్బందుల్లో పడకూడదు.. అందుకే నీ జ్ఞాపకాన్ని అమ్మేస్తున్నా. అర్థం చేసుకొని నన్ను క్షమించు అమ్మా.. అని గుక్క పెట్టి ఏడుస్తుంది జానకి.
కట్ చేస్తే.. జ్ఞానాంబ, తన భర్త ఇద్దరూ రెడీ అవుతుంటారు. ఇంతలో వైజయంతి ఫోన్ చేస్తుంది. జ్ఞానాంబతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి.. అంటుంది వైజయంతి. అర్జెంట్ గా ఐదు లక్షలు కావాలి.. సర్దుతావా? అని అడుగుతుంది వైజయంతి. సునందను అడిగితే టైమ్ పడుతుంది అని చెప్పింది.. నువ్వు ఏమన్నా అడ్జెస్ట్ చేయగలవా? మళ్లీ నీకు వారంలో ఇచ్చేస్తాను.. అంటుంది. దీంతో సరే.. అలాగే ఇస్తాను అంటుంది. ఇప్పుడు రమ్మంటావా? అంటే.. ఒక ముఖ్యమైన పని మీద వేరే ఊరు వెళ్తున్నాను. వెళ్లే దారిలోనే మీ ఇల్లు కాబట్టి.. వచ్చి ఇచ్చి వెళ్తాను.. అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 13 september 2021 monday episode 126 highilights
Janaki Kalaganaledu 13 Sep Today Episode : వైజయంతికి 5 లక్షలు ఇచ్చిన జ్ఞానాంబ
ఇంతలో వైజయంతి కూతురు తన గ్రాడ్యుయేషన్ డే ఫోటోలను చూపిస్తుంది. అక్కడ పెట్టమ్మా.. నేను తర్వాత చూస్తాను అంటుంది వైజయంతి. జ్ఞానాంబ కోసం వెయిట్ చేస్తుంటుంది. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. డబ్బులు వైజయంతికి ఇస్తుంది. అడగ్గానే డబ్బులు ఇచ్చి సాయం చేశావు.. థ్యాంక్యూ జ్ఞానాంబ అంటుంది. ఇక.. మేం బయలు దేరుతాం అని చెప్పి ఇద్దరూ వెనక్కి తిరిగి టేబుల్ మీద ఉన్న ఫోటోలను చూస్తారు.
జ్ఞానాంబ భర్త.. ఆ ఫోటోలను చూసి.. ఏంటి ఈ ఫోటోలు అంటాడు. మొన్న.. అమ్మాయి కాలేజీ చదివిన గ్రాడ్యుయేషన్ ఫోటోలు అంటారు. వాటిని చూసి తెగ మురిసిపోతుంటాడు. అందులో జానకి పట్టా తీసుకునే ఫోటో కూడా ఉంటుంది. దాన్ని తీసి చూసేలోపు.. ఏమండీ.. ఆలస్యం అవుతుంది. పదండి.. అనగానే ఆ ఫోటోను చూడకుండానే పదా అని వెళ్తాడు. దీంతో జానకి ఫోటోను చూడకుండానే వెనుదిరుగుతారు.

Janaki Kalaganaledu 13 september 2021 monday episode 126 highilights
Janaki Kalaganaledu 13 Sep Today Episode : అఖిల్ కోసం ఎదురు చూసిన జ్ఞానాంబ
కట్ చేస్తే.. తెల్లారగానే ఇంట్లో వినాయకచవితి పూజకు సంబంధించిన పనులు ప్రారంభిస్తారు. వినాయక చవితి సంబురాలు ఘనంగా జరుపుకుంటారు. వినాయకచవితి రోజు కూడా నాకు ఈ కర్మ ఏంటి.. ఇల్లంతా నాతోనే తూడిపించారు. ఊడిపించారు. అంటూ తెగ కోపంతో ఉంటుంది మల్లిక. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి.. ఇక్కడే కూర్చుంటావా? వెళ్లి అన్ని గుమ్మాలకు పసుపు పూయి.. అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో.. జ్ఞానాంబ.. అఖిల్ కోసం వెయిట్ చేస్తుంటుంది. రోడ్డు మీద అఖిల్ ఎవరితోనే గొడవ పడుతుంటాడు. ఇంతలో అక్కడికి వెళ్లిన జానకి.. వాళ్లను వదలండి అంటుంది. మేమేం కావాలని గొడవ పడటం లేదండి. మా దగ్గర అప్పు చేసి చాలారోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు.. అంటారు వాళ్లు. దీంతో జానకి ఏం చేస్తుంది? అఖిల్ ఎందుకు అప్పు చేశాడు.. అనే విషయాలు తెలుసుకోవాలంటే.. తరువాయిభాగంలో చూడాల్సిందే.