Janaki Kalaganaledu 14 Oct Today Episode : జానకి చదువు విషయం తెలిసి.. జానకికి కాకుండా తనకు తానే జ్ఞానాంబ శిక్ష వేసుకుంటుందా?
Janaki Kalaganaledu 14 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ 14 అక్టోబర్ 2021, గురువారం తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అత్తయ్య గారి కోసం కొన్న కొత్త చీరను తీసుకెళ్లి జ్ఞానాంబకు ఇస్తుంది. అత్తయ్య గారు మీరు ఈ చీర కట్టుకోండి అన్ని చెప్పి బయటికి వెళ్లగానే జ్ఞానాంబ ఆ చీరను తీసి విసిరికొడుతుంది. ఇంతలో మల్లిక చాలా ఖుషీ అవుతుంటుంది. జానకిని పోలేరమ్మ ఎప్పుడు బయటికి పంపిస్తుందా? అని వెయిట్ చేస్తుంటుంది. ఇంతలో విష్ణు వచ్చి ఎందుకు బ్యాగు సర్దుకున్నావు అని అడుగుతాడు. పుట్టింటికి వెళ్తున్నావా? అని అడుగుతాడు. నేనెందుకు వెళ్తాను.. జానకి వెళ్తుంది. కొద్ది సేపట్లో మీ అమ్మగారు జానకిని బయటికి పంపిస్తుంది చూడండి.. అని చెబుతుంది మల్లిక.

janaki kalaganaledu 14 october 2021 full episode
వదిన బర్త్ డే ఏర్పాట్లను అమ్మే చేస్తుంటే.. అమ్మ.. జానకిని ఎందుకు బయటికి పంపిస్తుంది.. అని అంటాడు. మీ అమ్మ ఇప్పుడు మీ వదినను బయటికి పంపించకపోతే నేను జీవితాంతం మీ కాళ్లు పడతాను అంటుంది మల్లిక. ఒకవేళ పంపిస్తే.. మీరు జీవితాంతం నా కాళ్లు పడతారా? అని అడుగుతుంది మల్లిక. సరే.. పదా అని అంటాడు విష్ణు. మరోవైపు జానకి తన బర్త్ డే వేడుకల కోసం రెడీ అవుతుంటుంది. జానకి చీర కట్టుకుంటుంటే… రామా అప్పుడే లోపలికి వస్తాడు. జానకి చీరకట్టుకుంటుంటే చూసి షాక్ అవుతాడు. జానకి చూసి వెంటనే మంచం వెనక్కి పరిగెడుతుంది.
ఆ తర్వాత జానకిని చూసి షాక్ అవుతాడు. తనకు దిష్టి చుక్క పెడతాడు రామా. ఇప్పుడు నా భార్య కుందనపు బొమ్మలా కాదు కాదు.. నాకోసం దేవలోకం నుంచి దిగొచ్చిన దేవకన్యలా ఉంది అని అంటాడు. తనకు గులాబీ పువ్వు ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు జానకి గారు అని అంటాడు రామా. మీతోనే ఇలా జీవితాంతం బతకాలని ఉంది. మీరు లేని జీవితం నాకు వ్యర్థం.. అని చెప్పి జానకి కొంచెం ఎమోషనల్ అవుతుంది. జానకి గారు పుట్టిన రోజు నాడు ఎవరైనా ఏడుస్తారా? నవ్వండి.. జానకి గారు అని తనను కూల్ చేస్తాడు రామా.
Janaki Kalaganaledu 14 Oct Today Episode : జానకి పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాని జ్ఞానాంబ
మరోవైపు జానకి పుట్టిన రోజు వేడుకల కోసం అంతా రెడీ అవుతుంది. డెకరేషన్ మొత్తం అయిపోతుంది. అందరూ వస్తారు కానీ.. జ్ఞానాంబ మాత్రం రాదు. ఇంకా అత్తయ్య గారు రాలేదు ఏంటి.. అని అనుకుంటుంది జానకి. మామయ్య గారు అత్తయ్య గారు ఇంకా రాలేదు అని అంటుంది. దీంతో తన కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. మల్లిక కూడా పోలేరమ్మ కోసం తెగ ఎదురు చూస్తుంటుంది. తను ఎందుకు రాలేదో.. అందరూ భయపడతారు. రామచంద్రాపురం వెళ్లి వచ్చినప్పటి నుంచి మీ అమ్మ చాలా దిగులుగా ఉంది అని గోవిందరాజులు చెబుతాడు. అవును.. నేను చీర ఇవ్వడానికి వెళ్లినప్పుడు కూడా అత్తయ్య గారు ముభావంగా ఉన్నారు. నాతో ఏం మాట్లాడలేదు అంటుంది జానకి.

janaki kalaganaledu 14 october 2021 full episode
ఇక లాభం లేదని అనుకొని అందరూ వెళ్లి జ్ఞానాంబ డోర్ కొడతారు. అయినా కూడా జ్ఞానాంబ డోర్ తీయదు. లోపల జ్ఞానాంబ ఒక్కతే కూర్చొని ఉంటుంది. మీరు ఇలా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే భయంగా ఉంది. దయచేసి తలుపు తీయండి అత్తయ్య గారు అంటుంది.. ఎవ్వరు పిలిచినా కూడా జ్ఞానాంబ మాత్రం ఉలకదు.. పలకదు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.