Janaki Kalaganaledu 14 Oct Today Episode : తులసి కోటను మల్లిక కూలగొడితే నేనే కూలగొట్టా అని జ్ఞానాంబకు చెప్పిన జానకి.. దీంతో జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం
Janaki Kalaganaledu 14 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 అక్టోబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 410 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఒక్కసారి అఖిల్ ను దగ్గర తీసుకోండి. అప్పుడు అఖిల్ మీరు ఏది చెబితే అది చేస్తారు.. అని అంటుంది జానకి. దీంతో వాడి మీద నాకు ఉన్న కోపం పోవాలన్నా నాకు కొంచెం సమయం పడుతుంది. మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి ఆలోచిస్తాను అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే అంటారు రామా, జానకి. మరోవైపు జానకి తన రూమ్ లో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. రామా నిద్రపోతూ ఉంటాడు. అర్ధ రాత్రి దాకా జానకి చదువుతూ ఉంటుంది. మధ్యలో లేచి జానకిని చూస్తాడు రామా. తనవైపు తిరిగి తనను చూస్తుంటాడు. ఆ తర్వాత నిద్రపోతాడు. అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. కానీ.. తనకు నిద్ర పట్టదు.
అలా తెల్లవారుజామున 4 గంటల వరకు చదువుకుంటూ ఉంటుంది జానకి. ఆ తర్వాత అలాగే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. ఉదయం ఆరు అవుతుంది. రామా లేచి చూస్తాడు. అలాగే కూర్చొని నిద్రపోతున్న జానకిని చూస్తాడు రామా. పరీక్షలు పూర్తయ్యే వరకు జానకి గారు ఏ ఇంటి పని చేయకుండా నేనే అవన్నీ చేస్తా అని అనుకొని కిచెన్ లోకి వెళ్లి కాఫీ పెడతాడు రామా. తనకు కాఫీ పెట్టి తీసుకెళ్తాడు. రామా కాఫీ తీసుకెళ్తుండగా చూస్తుంది మల్లిక. పొద్దుపొద్దున్నే బావ గారు కాఫీ పెట్టి తీసుకెళ్తున్నారు అని అనుకుంటుంది మల్లిక. తన రూమ్ కు వెళ్లి జానకి గారు కాఫీ తీసుకొండి అని జానకిని లేపి ఇస్తారు. దీంతో మీరు కాఫీ తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి.. అంటుంది జానకి. దీంతో కాఫీ మాత్రమే కాదు ఇంటి పనులు అన్నీ చేశా అంటాడు రామా.
అయ్యో మీరు నా పనులు చేయడం ఏంటి అంటుంది జానకి. ఎవరో ఏమో అనుకుంటారని కాదు.. రామా గారు ఆ పనులన్నీ కూడా నా బాధ్యత కదా అంటుంది జానకి. మీరు ఐపీఎస్ ర్యాంక్ సాధించిన తర్వాత మీరు ఎలా అంటే అలా ఉండండి అని చెప్పి కాఫీ ఇస్తాడు రామా.
నేను ఉండగా నిన్ను ఎలా చదవనిస్తాను జానకి. నీ ఆశయాన్ని ఎలా నెరవేర్చుకోనిస్తాను. చెప్తాను.. నా ప్లాన్స్ నాకు ఉంటాయి కదా అనుకుంటుంది మల్లిక. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు ఒక్క నేను తప్ప అని అనుకుంటుంది మల్లిక.
జానకి చదవడానికి వీలు లేదు. అస్సలు ఐపీఎస్ అవడానికి వీలు లేదు కానీ.. ఎలా అని అనుకుంటుంది మల్లిక. ఇంతలో తనకు ఒక ఐడియా వస్తుంది. నేను ఈ తులసి కోటను పగులగొట్టి ఆ నెపంతో పోలేరమ్మ చేత జానకిని తిట్టించి జానకి చదువును చెడగొడతాను అని అనుకుంటుంది మల్లిక.
Janaki Kalaganaledu 14 Oct Today Episode : తులసి కోటను కూలగొట్టేసిన మల్లిక
వెంటనే తులసి కోట దగ్గరికి వెళ్తుంది. ఎవ్వరూ లేరు అని చూసుకొని తులసి కోటకు దండం పెట్టి తులసి కోటలో ఉన్న మట్టిని పక్కకు తీసి తులసి చెట్టును పీకే ప్రయత్నం చేస్తుంది మల్లిక.
మల్లిక తులసి చెట్టును పీకుతుండగా జాగింగ్ కు వెళ్తున్న రామా, జానకి చూస్తారు. ఇంతలో చికిత.. తులసి కోట పూజకు హారతి తీసుకురా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో వస్తున్నా అమ్మగారు అంటుంది చికిత.
తులసి చెట్టును పీకేసి కింద పడేస్తుంది మల్లిక. చివరకు తులసి కోటను కూడా కింద పడేస్తుంది మల్లిక. ఇంతలో జ్ఞానాంబ పూజ కోసం వస్తుండగా అక్కడి నుంచి తప్పించుకుంటుంది మల్లిక. తులసి కోట కింద పడిపోయి ఉండటం చూసి షాక్ అవుతుంది జ్ఞానాంబ.
వెంటనే చికితను పిలుస్తుంది జ్ఞానాంబ. ఇంతలో అందరూ ఏమైందని పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు. రామా, జానకి కూడా బయటికి వస్తారు. అందరూ బయటికి వచ్చాక ఏం తెలియనట్టుగా మల్లిక బయటికి వస్తుంది.
తులసి కోటను ఎవరు ఇలా చేశారని అందరూ షాక్ అవుతారు. అయ్యయ్యో.. అని అంటుంది మల్లిక. జానకి, రామా తనవైపే చూస్తారు. తులసి కోట ఎందుకు ఇలా అయింది. ఎవరో పనిగట్టుకొని ఇలా చేశారు అంటుంది జ్ఞానాంబ.
అంత పనిగట్టుకొని తులసి కోటను ఎవరు పడగొట్టి ఉంటారు జ్ఞానం అంటాడు గోవిందరాజు. ఇంకెవరు చేస్తారు జానకినే అయి ఉంటుంది అంటుంది మల్లిక. పొద్దున్నే తులసి కోటను శుభ్రం చేసేది జానకినే కాబట్టి.. పడగొట్టే అవకాశం తనవల్లనే అవుతుందనేది నా ఉద్దేశం అంటుంది మల్లిక.
రామాకు కోపం వస్తుంది కానీ.. జానకి ఆపుతుంది. జానకి మనస్తత్వం నాకు బాగా తెలుసు. ఒకవేళ తన వల్ల పొరపాటు జరిగినా తనకు తానుగా వచ్చి క్షమాపణ చెబుతుంది అంటుంది జ్ఞానాంబ. అమ్మా పుల్లల మల్లిక.. పొద్దున లేస్తే జానకి మీద పడి ఏడవడమేనా అంటాడు గోవిందరాజు.
ఇంత చేసినా ఈ పోలేరమ్మ ఈ జానకిని తిట్టడం లేదు.. ఏం చేయాలి ఇప్పుడు మ్యాటర్ జెస్సీ మీదికి మల్లిద్దాం అని అనుకుంటుంది మల్లిక. అయితే.. తులసి కోట విలువ తెలియని జెస్సీ వల్ల జరిగిన పొరపాటేమో అంటుంది మల్లిక.
నిజంగా నాకేం తెలియదు అత్తయ్య గారు. నేనేం చేయలేదు అంటుంది జెస్సీ. ఇందాకటి నుంచి మీరే ఎందుకో భుజాలు తడుముకుంటున్నారేమో అనిపిస్తోంది అంటుంది చికిత. దీంతో ఇంట్లో ఏ తప్పు జరిగినా నేనే కారణమా అంటుంది మల్లిక.
ఇంట్లో ఇంత మంది ఉన్నారు. తులసి కోట ఎలా పడిపోయిందో మీకు తెలియదా అని అంటుంది జ్ఞానాంబ. అసలు దీనంతటికి కారణం అమ్మ అంటూ రామా చెప్పబోతుండగా నేనే అంటుంది జానకి.
కాస్త చూసుకోవచ్చు కదా జానకి. జాగ్రత్తగా ఉండకపోతే ఎలా అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత జానకి వెళ్లి మట్టిని తీసి తులసి కోటను సెట్ చేయబోతుండగా జానకికి ఒక ఉంగరం దొరుకుతుంది. దీంట్లో ఏదో ఉంగరం దొరికింది అత్తయ్య గారు అంటుంది జానకి.
ఆ రింగ్ ను చూస్తుంది జ్ఞానాంబ. గోవిందరాజు దగ్గరికి వచ్చి ఆ రింగ్ ను చూస్తాడు. నవ్వుతాడు. జ్ఞానం.. ఇది మన పెళ్లి నాటి నీ ప్రధాన ఉంగరం అంటాడు గోవిందరాజు. చూడు జ్ఞానం అంటాడు గోవిందరాజు.
దీంతో ఆ రింగ్ ను చూసి మురిసిపోతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.