Janaki Kalaganaledu 19 Oct Today Episode : జ్ఞానాంబకు తన చదువు విషయం తెలిసిపోయిందని తెలుసుకున్న జానకి ఏం చేస్తుంది?
Janaki Kalaganaledu 19 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. జానకి కలగనలేదు 19 అక్టోబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చికితకు మల్లిక.. జానకి చదువు విషయం చెబుతుంది. జానకి ఇంత పెద్ద మోసం చేసిందని తెలిసినా మా అత్తయ్య ఒక్క మాట కూడా జానకిని అడగలేదు అని అంటుంది మల్లిక. ఎవరైనా తప్పు చేస్తే అంతలా రెచ్చిపోయే పోలేరమ్మ.. జానకి విషయంలో మాత్రం సైలెంట్ గా ఉంటుంది అని చికితకు చెప్పి బాధపడిపోతుంది మల్లిక.

janaki kalaganaledu 19 october 2021 full episode
మరోవైపు జ్ఞానాంబ తన రూమ్ లో ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. ఇంతలో తన భర్త వచ్చి.. మన పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఇంతలా బాధపడటం నేను ఇప్పటి వరకు చూడలేదు. ఏమైంది జ్ఞానం.. అని అడుగుతాడు గోవిందరాజు. నువ్వు బాధపడే విషయం నాకు తెలుసు. ఏమైందో చెప్పు అని అడుగుతాడు గోవిందరాజు. నిన్నటి నుంచి నేను గమనిస్తున్నాను. నువ్వు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. గుండెల్లో బాధ తప్ప.. ముఖంలో సంతోషం కనిపించడం లేదు.. అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు గోవిందరాజు.
మన రామాకు తగ్గ భార్యను అన్ని విషయాల్లో సర్దుకుపోయే అమ్మాయిని తీసుకురావాలని అనుకున్నాం. కానీ.. చివరకు దారుణంగా మోసపోయాం. జానకి చదివింది ఐదో తరగతి కాదు అండి.. డిగ్రీ.. అని చెబుతుంది జ్ఞానాంబ. ఏంటి జ్ఞానాంబ నువ్వు చెప్పేది.. జానకి చదివింది డిగ్రీనా. తను ఐదో తరగతి వరకు చదివి ఉంటుంది.. అని నచ్చజెప్పబోతాడు. దీంతో జానకి చదివిన కాలేజీలో జానకి ఫోటో చూశాను. ఇంట్లో డిగ్రీ పట్టా చూశాను. జానకి కాలేజీలో ఫస్ట్ వచ్చిందని ప్రిన్సిపల్ కూడా చెప్పాడు.. అంటుంది జ్ఞానాంబ.
జానకి చదువు విషయం గురించి తన ఇంటివాళ్లు మనకు అబద్ధం చెప్పి జానకి పెళ్లి చేశారు.. అని అంటుంది జ్ఞానాంబ. మరి.. వాళ్లు చదువును దాచిపెట్టి ఈ పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి.. అని అంటాడు గోవిందరాజు. నా తమ్ముడి లాంటి పరిస్థితే నా కొడుకుకు కూడా వస్తుందని నాకు చాలా భయమేస్తుందండి.. అంటుంది జ్ఞానాంబ. ఛీ..ఛీ.. జానకి అలా చేయదు. జానకి అటువంటిది కాదు.. అని అంటాడు గోవిందరాజు.
ఈ విషయంలో నేనొక నిర్ణయానికి వచ్చాను. జానకి వాళ్ల అన్నయ్యకు ఫోన్ చేసి ఉన్నపళంగా రమ్మని చెప్పండి. అతడి ముందే నా నిర్ణయం ఏంటో చెబుతాను.. అని గోవిందరాజుకు జ్ఞానాంబ చెబుతుంది.
Janaki Kalaganaledu 19 Oct Today Episode : మళ్లీ రామా, జానకి సరసాలు చూడలేకపోయిన మల్లిక
కట్ చేస్తే.. జానకి పసుపు కొడుతూ ఉంటుంది. చికిత కూడా పక్కనే ఉంటుంది. అయ్యో జానకమ్మ గారు మీరెందుకు అంత కష్టపడుతున్నారు. మీరు ఈ పనులు చేయకూడదండి అంటుంది చికిత. ఏం కాదులే.. నేను అత్తారింట్లో ఇవన్నీ పనులు చేయాల్సిందే అంటుంది జానకి. ఇంతలో రామా వచ్చి చికితను అక్కడి నుంచి పంపించి.. జానకి చేతులు పట్టుకొని తనతో పసుపు కొట్టించడం నేర్పిస్తాడు. వీళ్ల సరసాలను చూసి మల్లికకు పిచ్చి లేస్తుంది. వెళ్లి వాళ్లను డిస్టర్బ్ చేస్తుంది. జానకి.. అత్తయ్య గారు పిలుస్తున్నారు అని చెబుతుంది.

janaki kalaganaledu 19 october 2021 full episode
అత్తయ్య గారు పిలిచారా? అని అడిగితే ఎందుకు పదే పదే నా దగ్గరికి వస్తున్నావు నువ్వు అని సీరియస్ అవుతుంది జ్ఞానాంబ. అసలు నేను నిన్ను పిలవలేదు అంటుంది. నిన్ను పిలిచానని ఎవరు చెప్పారు.. అని అడుగుతుంది. మల్లిక అని అంటుంది. దీంతో మల్లికను పిలుస్తుంది జ్ఞానాంబ. మల్లిక రాదు. ఇంతలో జానకి.. ఎందుకు అత్తయ్య గారు అంత చిరాకు పడుతున్నారు. మీ కోపాన్ని అయినా తట్టుకుంటా కానీ.. మీ మౌనాన్ని భరించలేను అత్తయ్య గారు అంటుంది జానకి.
దీంతో ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది. ఏదో జరుగుతోందని జానకికి అర్థం అవుతుంది. నిన్న ఉదయం కూడా అంత ప్రేమతో మాట్లాడిన అత్తయ్య.. ఎందుకు ఇప్పుడు అంత కోపాన్ని చూపిస్తున్నారు అని అనుకుంటుంది. ఇంతలో తన డిగ్రీ పట్టా ఇంట్లో కనిపిస్తుంది. దాన్ని చూసి షాక్ అవుతుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.