Janaki Kalaganaledu 20 June Today Episode : కన్నబాబు, సునందకు జానకి షాక్.. డబ్బులు మొహాన కొట్టడంతో కన్నబాబు జానకిని ఏం చేస్తాడు?
Janaki Kalaganaledu 20 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 326 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన తల్లి చేతుల మీదుగా చెక్ అందుకుంటా అని జడ్జిలను కోరుతాడు రామా. దీంతో సరే అని అంటారు జడ్జిలు. జ్ఞానాంబతోనే రామా 5 లక్షల చెక్ అందుకుంటాడు రామా. తర్వాత తనకు షీల్డ్ ఇస్తాడు చెఫ్ సంజయ్. కట్ చేస్తే రామా కోసం ఆత్రేయపురంలో అందరూ ఎదురు చూస్తుంటారు. మల్లికకు తెగ కోపం వస్తుంది. చికిత, విష్ణు, ఊరివాళ్లు అందరూ డప్పులతో రామాకు స్వాగతం పలుకుతారు. జానకి, రామా, జ్ఞానాంబ, గోవిందరాజు నలుగురు కారు దిగుతారు. అందరూ రామచంద్రకు జై అంటారు. ఊరేగింపు అదిరిపోవాలి అంటాడు గోవిందరాజు.
రామా, జానకి ఇద్దరూ నడుస్తూ వెళ్తుండగా అందరూ డ్యాన్సులతో ఊళ్లో ఊరేగింపు చేస్తూ తీసుకెళ్తుంటారు. నీ కొడుకు విజయాన్ని చూసి నువ్వు పొంగిపోతున్నావా అని అంటాడు గోవిందరాజు. మరోవైపు రామా, జానకి ఇంటికి వస్తారు. మల్లిక కంట్లో నుంచి నీళ్లు వస్తుంటాయి. ఏంది మల్లిక నీ కంట్లో నీళ్లు వస్తున్నాయి అంటాడు గోవిందరాజు. దీంతో అవి ఆనంద బాష్పాలు అంటుంది మల్లిక. లోపలికి వచ్చాక.. షీల్డ్ ను తీసుకొని అటక మీద సెట్ చేస్తుంది జానకి. మరోవైపు రామా, జానకి గెలుపు కోసం చేసిన కృషి గురించి గోవిందరాజు జ్ఞానాంబకు చెబుతాడు.
Janaki Kalaganaledu 20 June Today Episode : తన బహుమతి డబ్బును జ్ఞానాంబకు ఇచ్చిన రామా
తర్వాత బహుమతి డబ్బును తీసుకో అమ్మ అని రామా.. జ్ఞానాంబకు ఇస్తాడు. తర్వాత నాకు కొన్న డబ్బులు ఇవ్వండి.. నాకు కొన్ని ఇవ్వండి అని అందరూ అడుగుతారు. నాకు బైక్ కావాలి అని అంటాడు అఖిల్. నాకు లాప్ టాప్ కావాలి అంటుంది వెన్నెల. నా ఫోన్ పాత మోడల్ అయింది అంటాడు విష్ణు.
దీంతో ఆపండి.. 20 ఏళ్లుగా మీ సంతోషాన్ని వాడి కష్టంతో తీసుకొస్తున్నాడు. మీకు కావాల్సినవన్నీ మీకు అందిస్తున్నాడు. ఈ బహుమతి డబ్బుతో ప్రత్యేకంగా మీకు అవసరం తీర్చాల్సిన అవసరం లేదు అంటుంది జ్ఞానాంబ. దీంతో అదేంటమ్మా.. తమ్ముళ్లు, చెల్లి కన్నా నాకు ఇంకేం కావాలి అంటాడు రామా.
దీంతో ఇది నీ కష్టానికి గుర్తింపు. నీ గెలుపునకు గుర్తుగా నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు మల్లికను ఓ ఆట ఆడుకుంటాడు గోవిందరాజు. కట్ చేస్తే డబ్బు పట్టుకొని సునంద ఇంటికి వస్తారు రామా, జానకి.
జానకి చాలా కోపం మీద ఉంటుంది. తల్లీకొడుకులు ఇద్దరూ తెగ మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు ఏమైంది మాట పడిపోయింది. మీ ఇద్దరికీ పెద్ద థాంక్స్ అంటుంది జానకి. మామూలుగా అయితే మీరు చేసిన వెదవ పనులకు లాగిపెట్టి గూబ పగులగొట్టాలి.
అలా కాకుండా థాంక్స్ చెబుతోంది అనే కదా మీ అనుమానం. మా ఆయన చెఫ్ పోటీల్లో గెలవడానికి ఒకరకంగా మీరు కూడా కారణమే అంటుంది జానకి. మా స్వీట్ షాపును కొట్టేయాలని చూశారు.. అదే ఆయనలో పట్టుదలను పెంచి అదే ఆయన్ను గెలిపించేలా చేసింది.
రామా గారు ఈ డబ్బులు అతడి మొహాన కొట్టి సంతకాలు పెట్టించుకున్న కాగితాలు తీసుకోండి అంటుంది జానకి. ఆ స్వీటు కొట్టు మా ఆమ్మ ప్రాణం. గడువు లోపు నీ డబ్బులు నీ మొహాన కొడుతా అని చెప్పాను. గడువుకు ఇవాళ చివరి రోజు.. తీసుకో. నీ డబ్బులు నీకు ఇచ్చాను. వెళ్లి సంతకాలు పెట్టిన కాగితాలు తీసుకురా వెళ్లు అంటాడు రామా.
దీంతో వెళ్లి కాగితాలు తెచ్చి జానకి మొహాన వేస్తాడు కన్నబాబు. వాటిని తన ముందే చింపేస్తుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.