Janaki Kalaganaledu 20 Sep Monday Episode Highlights : చిక్కుల్లో పడి సూసైడ్ చేసుకోవాలనుకున్న వైజయంతి కూతురు.. జానకి ఈ విషయం తెలుసుకొని ఏం చేసింది? వైజయంతి.. జ్ఞానాంబకు ఆఫోటోను చూపిస్తుందా?

Janaki Kalaganaledu 20 september 2021 monday 131 episode highlights
Janaki Kalaganaledu 20 Sep Monday Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ శని, ఆదివారాల్లో ప్రసారం కాదు. సోమవారం ఎపిసోడ్ 20 సెప్టెంబర్ 2021, 131 వ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి చదువు గురించి ఫోటో చూసి తెలుసుకున్న వైజయంతి జానకిని పిలిచి ఏంటిది అని అడుగుతుంది. జానకి చాలా బతిమిలాడుతుంది కానీ అస్సలు వైజయంతి వినదు. నువ్వు నాకు ఏం చెప్పొద్దు. ఈ విషయం ఎలాగైనా మీ అత్తయ్యకు చెబుతా.. ఇక నువ్వు వెళ్లు అని జానకిని పంపించేస్తుంది.

Janaki Kalaganaledu 20 september 2021 monday 131 episode highlights
జానకి వెళ్లగానే.. వైజయంతి.. జ్ఞానాంబకు ఫోన్ చేస్తుంది. జ్ఞానాంబ ఏం చేస్తున్నావు. అర్జెంట్ గా ఇంటికా రా. నీతో మాట్లాడాలి అంటుంది. దీంతో వెంటనే జ్ఞానాంబ వైజయంతి ఇంటికి బయలుదేరుతుంది.

Janaki Kalaganaledu 20 september 2021 monday 131 episode highlights
ఇక.. జానకి ఏడుస్తూ.. వైజయంతి ఇంటి నుంచి బయటికి వచ్చి వెళ్లిపోతుంది. నడుస్తూ వెళ్తుండగా ఇంతలో రామా ఫోన్ చేసి ఏమైంది అని అడుగుతాడు. దీంతో జరిగిన విషయం చెబుతుంది జానకి. దీంతో.. ఏం కాదు.. నువ్వేం టెన్షన్ పడకు. కొట్టు దగ్గరికిరా. ఇద్దరం కలిసి ఏం చేయాలో మాట్లాడుకుందాం అని చెబుతాడు. దీంతో.. కొట్టుకు బయలుదేరుతుంది జానకి.
Janaki Kalaganaledu 20 Sep Monday Episode Highlights : వైజయంతి కూతురు కష్టాల్లో ఉందని తెలుసుకున్న జానకి
ఇంతలో రోడ్డు పక్కన వైజయంతి కూతురు కనిపిస్తుంది తనకు. ఎవరితోనో ఏడుస్తూ మాట్లాడుతుంది తను. ఎవరో ఓ యువకుడు తనన బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఫోటోలు ఎవరికో పంపిస్తానంటూ బెదిరిస్తాడు. ఇంటికి వచ్చి కాసేపు గడిపి పెన్ డ్రైవ్ తీసుకొని వెళ్లు అని బెదిరిస్తాడు. నువ్వు ఇలా చేస్తే నాకు చావు తప్ప ఇంకో మార్గం లేదు.. అని అంటుంది ఆ అమ్మాయి. ఆ విషయం జానకి వింటుంది.

Janaki Kalaganaledu 20 september 2021 monday 131 episode highlights
కట్ చేస్తే.. జ్ఞానాంబ.. వైజయంతి ఇంటికి వెళ్తుంది. వెళ్లగానే.. జ్ఞానాంబ.. నీకో విషయం చెప్పాలి. అర్జెంట్ గా.. ఇప్పుడే.. చెప్పేయాలి. ఇక ఆలస్యం చేయకూడదు అని అంటుంది. దీంతో జ్ఞానాంబకు ఏం అర్థం కాదు. అసలు.. దేని గురించి వైజయంతి మాట్లాడుతుందో అర్థం కాదు. ఇంతలో జానకి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ లో పట్టా తీసుకుంటున్న ఫోటోను తీసి జ్ఞానాంబకు చూపించబోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. సోమవారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

Janaki Kalaganaledu 20 september 2021 monday 131 episode highlights