Janaki Kalaganaledu 25 March Today Episode : మా నానమ్మ స్థలంలో ఉంటున్నా అని జ్ఞానాంబకు రామా ఝలక్.. దీంతో జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 25 March Today Episode : మా నానమ్మ స్థలంలో ఉంటున్నా అని జ్ఞానాంబకు రామా ఝలక్.. దీంతో జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం

 Authored By gatla | The Telugu News | Updated on :25 March 2022,11:30 am

Janaki Kalaganaledu 25 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 మార్చి 2022, శుక్రవారం ఎపిసోడ్ 265 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని మీ అమ్మ చెప్పింది కదా. అయినా కూడా ఇక్కడే ఎందుకు ఉన్నారు చెప్పండి అని గోవిందరాజు ప్రశ్నిస్తాడు. దీంతో నిన్ను చూడకుండా నేను ఉండగలనా. నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను. నాకు ఈ ఇల్లు తప్ప ఇంకో లోకం తెలియదు.. అంటాడు రామా. దీంతో నా ఇంట్లో ఉండే హక్కు లేదని చెప్పండి. మర్యాదగా ఇల్లు వదిలి వెళ్లమని చెప్పండి.. అంటుంది జ్ఞానాంబ. దీంతో ఒరేయ్ మీ అమ్మ ఏం చెప్పిందో తెలుసు కదా అంటాడు.

janaki kalaganaledu 25 march 2022 full episode

janaki kalaganaledu 25 march 2022 full episode

దీంతో నాన్న.. ఇది నానమ్మ నాకు రాసిచ్చిన స్థలం అంటాడు రామా. మా నానమ్మ ఇచ్చిన స్థలంలో ఉండే హక్కు నాకు లేదా నాన్న అంటాడు రామా. దీంతో గోవిందరాజు సూపర్ అంటాడు. ఈల వేస్తాడు. జ్ఞానం.. రాముడు చెబుతున్నది లాజికే కదా. ఈ స్థలాన్ని రాముడి పేరు మీద మా అమ్మ రాసిచ్చింది. మరి వాడి స్థలంలో వాడికి ఉండే హక్కు వాడికి ఉంది కదా అంటాడు గోవిందరాజు. దీంతో ఏమన్నావురా. నానమ్మ ఇచ్చిన స్థలంలో నాకు ఉండే హక్కు లేదా అని అన్నావు కదా. శభాష్ రా. ఎప్పుడూ మన అనేవాడివి.. మొదటిసారి నీ నోటి నుంచి నా అనే మాటొచ్చింది శభాష్.. అంటుంది జ్ఞానాంబ.

ఈ ఇంటి కోసం భవిష్యత్తును త్యాగం చేసిన నీ నోటి నుంచి నా ఆస్తి అని మాట వచ్చిందంటే.. ఆ మాటల వెనుక ఎవరు ఉన్నారో.. నీతో ఎవరు ఇలా మాట్లాడిస్తున్నారో నాకు అర్థం అయింది అంటుంది జ్ఞానాంబ. దీంతో అత్తయ్య గారు మీ బాధలో అర్థం ఉంది కానీ.. మీ కోపంలో న్యాయం లేదు అత్తయ్య గారు అంటుంది జానకి.

కుటుంబాన్ని విడదీసేలా నేను ఎప్పుడూ ప్రవర్తించను. మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మనగానే ఆయన ప్రాణం విలవిలలాడిపోయింది. ఈ కుటుంబంతో బంధాన్ని, మీతో అనుబంధాన్ని తెంచుకొని మేము ఎలా వెళ్లగలం అత్తయ్య గారు అంటుంది జానకి.

మిమ్మల్ని విడిచి పెట్టి వెళ్లలేక.. ఇక్కడ ఇలా ఉండిపోయాం అంటుంది జానకి. నా కొడుకు ఎంత అమాయకుడో నాకు తెలుసు. వాడికి ఇన్ని తెలివితేటలు లేవని నాకు తెలుసు. నా కొడుకును ఎలా గుప్పిట్లో పెట్టుకున్నావో నాకు అర్థం అయింది అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 25 March Today Episode : రామా, జానకి అక్కడే ఉండటంతో సంతోషించిన గోవిందరాజు

చూడు.. ఏ ఉద్దేశంతో నువ్వు ఇక్కడ మకాం పెట్టించావో నాకు తెలుసు. నీ ఆటలు ఏవీ నాదగ్గర సాగవు. జ్ఞానాంబ ఇక్కడ. అది నువ్వు గుర్తు పెట్టుకో అంటుంది జ్ఞానాంబ. అందరూ గుర్తు పెట్టుకోండి. మన కుటుంబంతో ఏం మాత్రం సంబంధం లేని వాళ్లు మన ఇంటి ముందు గుడారం వేసుకొని బతుకుతున్నారు. అందరూ అలాగే అనుకోండి అంటుంది జ్ఞానాంబ.

నువ్వు ఎంతన్నా… ఏమన్నా నేను నీ కొడుకును అమ్మ అంటాడు రామా. అయినా కూడా అతడిని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. కట్ చేస్తే పడుకోవడం కోసం మంచానికి నవారు అల్లుతూ ఉంటారు జానకి, రామా.

మరోవైపు రామా, జానకిని అక్కడి నుంచి ఎలాగైనా వెళ్లగొట్టాలని మల్లిక ప్లాన్స్ వేస్తుంటుంది. ఎలాగైనా జ్ఞానాంబను రెచ్చగొట్టి వాళ్లను పంపిద్దామని చేసే ప్రయత్నాలేవీ ఫలించావు. దీంతో తనకు చాలా కోపం వస్తుంది. మరోవైపు జానకి.. గుడిసెలో అన్నం కూర వండుతూ ఉంటుంది.

ఇంతలో తన చేయి కాలుతుంది. కానీ.. రామాకు తెలియకుండా ఆ నొప్పిని దాచుకుంటుంది జానకి. తర్వాత రామాకు టిఫిన్ వడ్డిస్తుంది. కానీ.. రామా మాత్రం తననే చూస్తూ ఉంటాడు. ఏంటి తినడం లేదు.. కొంపదీసి నన్ను తినిపించమంటారా అంటుంది.

దీంతో తినిపించు అంటాడు రామా. దీంతో తన చేతికి అయిన గాయం గుర్తొస్తుంది. దీంతో నేను బట్టలు ఉతకాలి అంటుంది. జానకి గారు.. అమ్మ కళ్ల ముందు ఉండాలనేదే నా ఆశ. అందుకని మీకు నేను ఇన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నాను.. నన్ను క్షమించండి అంటాడు.

నాకు కూడా మీ అమ్మ గారి ముందే మీరు ఉండాలి అని నా కోరిక కూడా అంటుంది జానకి. తర్వాత రామా తనకు ఉప్మా తినిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది