Janaki Kalaganaledu 25 Nov Today Episode : సివిల్స్ పుస్తకాలను అమ్మేస్తూ ఏడ్చిన జానకి.. అఘాయిత్యం చేసుకుంటుందని భయపడ్డ రామా
Janaki Kalaganaledu 25 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 నవంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 179 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి గారు.. అంటూ జానకిని వచ్చి గట్టిగా వాటేసుకుంటాడు రామా. మనం విడిపోము అని చెప్పాను కదండి. మనమెందుకు విడిపోతాం. మన బంధంలో నిజాయితీ ఉంది. మన ప్రాణాలు వేరయినా ఊపిరి మాత్రం ఒక్కటే. మనమెందుకు విడిపోతాం చెప్పండి. జానకి గారు మీరు ఒకసారి మాట చెప్పారు. ప్రాణం పోయే సమయంలో కూడా మీ చేతినే పట్టుకొని ఉండాలండీ అన్నావు. ఆ ప్రేమే మనల్ని తిరిగి కలిపింది. మా బంగారం గెలిచారు బాబోయ్ అంటూ.. జానకికి ముద్దు పెడతాడు రామా.

janaki kalaganaledu 25 november 2021 full episode
దీంతో జానకి సిగ్గు పడుతుంది. ఇటు తిరగండి అంటుంది జానకి. ఏం చేశారు మీరు అంటుంది జానకి. ఇటు తిరగండి.. అంటూ అడుగుతుంది. తర్వాత నవ్వుతుంది జానకి. మీరు నామీద చూపించే ప్రేమ ముందు ఎటువంటి పరీక్షను అయినా ఎదుర్కొంటాను అంటుంది జానకి. గెలిచింది నేను అయినా గెలిపించింది మాత్రం మా బంగారం అంటుంది జానకి. ఇద్దరూ గట్టిగా కౌగిలించుకోవడం చూసి మల్లికకు తీవ్రంగా కోపం వస్తుంది. వీళ్ల రొమాన్స్ చూడాల్సిన కర్మ నాకు పట్టింది.. అని అనుకుంటుంది మల్లిక.
మరోవైపు జ్ఞానాంబ దేవుడికి పూజ చేస్తుంటుంది. నా కోడలు నాకు ఎక్కడ దూరం అవుతుందో అని నేను టెన్షన్ పడ్డాను కానీ.. నా కోడలు గెలిచి.. నన్ను గెలిపించింది. చదువు విషయం గురించి కూడా మళ్లీ మాట్లాడను అని చెప్పి.. నాకు మాటిచ్చింది అంటుంది జ్ఞానాంబ.
అందరినీ పిలిచి.. హారతి ఇస్తుంది జ్ఞానాంబ. మల్లిక మళ్లీ జ్ఞానాంబకు బిస్కెట్లు వేయడం ప్రారంభిస్తుంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా మనసు పొంగిపోతోంది అత్తయ్య గారు అంటుంది. ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటుంది మల్లిక. తనను ఎప్పుడూ ఆపుతుంటాడు గోవిందరాజు.
Janaki Kalaganaledu 25 Nov Today Episode : జ్ఞానాంబ ఇంట్లో సంబురాలు
ఇంతలో జానకి వస్తుంది. హారతి తీసుకుంటుంది. అత్తయ్య గారు మీలో ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అంటుంది జానకి. మీ ఆశలు, ఇష్టాలు నెరవేరుతాయి.. అంటుంది జానకి. మీరు ఆరాటపడిన కలలు మీ కళ్ల ముందుకు వచ్చి నిజం అవుతాయి అంటుంది జానకి. దీంతో జ్ఞానాంబ చాలా సంతోషిస్తుంది.
కోడలు నుంచి ఆ మాట వచ్చింది అంటే జరిగి తీరుతుంది జ్ఞానం.. అంటాడు గోవిందరాజు. జానకి ఏం మాట్లాడిందో మల్లికకు అస్సలు అర్థం కాదు. జానకి ఏ విషయం గురించి చెప్పింది.. అని అనుకుంటుంది. అమ్మ దీనమ్మమ్మో.. చీర పేరే సారీ అన్నట్టు అదా మ్యాటర్. మనవడినో మనవరాలినో ఎత్తుకోవడం పోలేరమ్మ ఆశ. రేపు జానకి కడుపు పండి.. పాపో.. బాబో పుడితే ఇంకేమన్నా ఉందా.. అని అనుకుంటుంది మల్లిక.
కట్ చేస్తే.. జానకి.. తన సివిల్స్ పుస్తకాలను అన్నింటినీ పాత సామాను కంపెనీకి అమ్మేస్తుంది. తర్వాత రామా.. బండి మీద వెళ్తుంటాడు. ఓ అమ్మాయి చెరువు గట్టు వైపు వెళ్లడం చూస్తాడు. ఏమండి అని పిలుస్తాడు. ఓ యువతి.. ఆత్మహత్య చేసుకునేందుకు దూకబోతుంది.
రామా ఆపి.. ఏమైంది అని అంటాడు. నన్ను ఆపకండి అంటుంది. నా కలను మా వాళ్లే ఒప్పుకోకపోతే నేనెలా బతకాలి. సింగర్ కావాలన్న నా కలను కాదని నన్ను కంప్యూటర్ సైన్స్ చదివిస్తామంటున్నారు అంటూ వాపోతుంది. మనకు ఇష్టమైన కలను వదులుకోవడం అంటే ప్రాణాలు వదిలేయడమే అంటుంది ఆ యువతి. దీంతో రామా షాక్ అవుతాడు.
అంటే జానకి కూడా తన కలను వదిలేసుకొని ఏదైనా చేసుకుంటుందా అనుకుంటాడు. భయపడతాడు. చూడమ్మా.. కల కంటే భయపడకూడదు. నువ్వు అనుకున్నది సాధించడం వడ్డించిన విస్తరి కాదు. అన్నింటినీ దాటుకొని వెళ్తేనే నీ కల నిజం అవుతుంది అని తనను మోటివేట్ చేస్తాడు రామా. ఆతర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.