Janaki Kalaganaledu 25 Oct Today Episode : ఇదుగోండి.. విడాకుల పత్రం.. మీకు ఎప్పుడు నచ్చకున్నా.. నాకు, రామాకు విడాకులు ఇచ్చేయండి అని జ్ఞానాంబకు చెప్పిన జానకి
Janaki Kalaganaledu 25 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 25 అక్టోబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 156 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం లేవగానే రామా కొట్టు తెరుస్తాడు కానీ.. తన మనసంతా తన తల్లి జ్ఞానాంబ మీదే ఉంటుంది. తన తల్లి తనను మాట్లాడొద్దు అని అనే సరికి.. రామా చాలా బాధపడిపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు. కొట్టు వద్ద ఉంటాడు కానీ.. తన ఆలోచనలు అన్నీ ఇంటి చుట్టే తిరుగుతుంటాయి. ఇంతలో అఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చి జానకి వదిన ఇంట్లో లేదు అని చెబుతాడు. ఉదయాన్నే వదిన గారు చాలా కోపంగా బయటికి వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అంటాడు అఖిల్. దీంతో వెంటనే రామా.. యోగికి ఫోన్ చేస్తాడు. ఒకసారి జానకికి ఫోన్ ఇస్తారా? అని అడుగుతాడు. అదేంటి జానకి మీ ఇంట్లోనే ఉండాలి కదా.. నా దగ్గర లేదు అంటాడు. ఏమైంది అని అడుగుతాడు. జానకి గారు ఉదయాన్నే బయటికి వెళ్లారట.. మీ ఇంటికి వచ్చారేమో అని అడుగుతాడు రామా.
లేదండి.. మా చెల్లెలు మా ఇంటికి రాలేదు. నేను మా ఇంటి నుంచే వస్తున్నాను అంటాడు. నాకు భయం వేస్తోంది. మా చెల్లెలు ఏదైనా నిర్ణయం తీసుకుందా? అని అడుగుతాడు జానకి. అదేం లేదు.. తను అంత పిరికిది కాదు.. అంటాడు. జానకి గురించి తెలిస్తే నేను ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రామా. అఖిల్ ను కొట్టు చూసుకోమని చెప్పి రామా.. బండి వేసుకొని జానకిని వెతకడానికి వెళ్తాడు.
కట్ చేస్తే.. జానకి అడ్వకేట్ దగ్గరికి వెళ్తుంది. నేను మా ఆయనకు విడాకులు ఇస్తాను అని చెబుతుంది. ఏంటి సమస్య.. మీ ఆయన మంచివారు కాదా… మీ అత్తయ్య గారు నిన్ను ఏమైనా హింసిస్తున్నారా? అని అడుగుతాడు లాయర్. దీంతో అందరూ మంచివాళ్లే అంటుంది జానకి. దీంతో అసలు విషయం చెబుతుంది జానకి. నా సమస్యకు నా దగ్గర ఉన్న పరిష్కారం ఇదే.. అంటుంది. అందుకే నా భర్త నుంచి నేను విడాకులను మనసా, వాచా, కర్మనా అడుగుతున్నట్టు నోటీసులు ఇవ్వండి లాయర్ గారు అంటుంది జానకి. దీంతో వెంటనే డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి లాయర్.. వాటి మీద సంతకం పెట్టు అని చెబుతాడు. దీంతో పెన్ను తీసుకొని జానకి వెక్కి వెక్కి ఏడుస్తూ సంతకం పెడుతుంది.
Janaki Kalaganaledu 25 Oct Today Episode : విడాకుల లెటర్ తీసుకొచ్చి జ్ఞానాంబకు ఇచ్చిన జానకి
కట్ చేస్తే జ్ఞానాంబ, గోవిందరాజు.. ఇద్దరూ దీనంగా ఇంట్లో కూర్చొని ఉంటారు. ఆ నోటీసులు పట్టుకొని నడుచుకుంటూ ఇంటికి వస్తుంటుంది జానకి. జ్ఞానం నువ్వు ఎప్పుడూ ఒక మాట చెప్పేదానివి. కంటికి, చేయికి మధ్య విడదీయరాని బంధం ఉంటుంది అంటావు కదా.. కొడుకు, కోడళ్లతో మనకు ఉన్న బంధం కూడా అటువంటిదే అంటాడు. ఇంతలో యోగి.. జ్ఞానాంబ ఇంటికి వస్తాడు. అంతలోనే జానకి కూడా ఇంటికి వస్తుంది. యోగి మాట్లాడుతున్నా పట్టించుకోదు. వెంటనే జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి అత్తయ్య గారు.. ఇవి నా విడాకుల కాగితాలు అని చెబుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. మా ఆయన నుంచి నాకు విడాకులు కావాలని నేను స్వయంగా రాసి సంతకం పెట్టి ఇస్తున్న కాగితాలు ఇవి అని చెప్పేసరికి.. అప్పుడే రామా వస్తాడు. అదంతా విని షాక్ అవుతాడు రామా. జానకి ఏంటమ్మా ఇది.. అని గోవిందరాజు అంటాడు. నువ్వు ఇలా తొందరపడటం ఏంటమ్మా అంటాడు గోవిందరాజు. వాటిని చించేయ్ అంటాడు. కానీ.. జానకి వినదు. మామయ్య గారు నన్ను క్షమించండి. అత్తయ్య గారు మీ భయానికి కారణం నేను కాదు నా చదువు. భవిష్యత్తులో నా చదువు నాలో అహం పెంచుతుందని…. ఆ అహంతో నా భర్తను అవమానిస్తానని.. దీంతో మీ అబ్బాయి గారు మీకు ఎక్కడ దూరం అవుతారోనని మీరు భయపడటం కరెక్టే. నా మీద ద్వేషంతో కాదు.. మీరు ఇవన్నీ చేసేది. నా భర్తంటే నాకు కూడా ప్రాణం కానీ.. నా భర్త మీద నాకున్న ప్రేమను ఎలా రుజువు చేసుకోవాలో తెలియడం లేదు. అందుకే ఈ విడాకుల కాగితాలు ఇస్తున్నా అంటుంది జానకి.
ఉరి శిక్ష వేసేవాడికి కూడా నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. దయచేసి నాకు కూడా అలాంటి చివరి అవకాశం ఇవ్వండి.. అంటుంది జానకి. మీ దృష్టిలో మంచి కోడలుగా.. నా భర్తకు తగ్గ భార్యగా ఉంటాను. ఏరోజైనా మీకు నా మీద అనుమానం కలిగినా.. వెంటనే నా భర్తతో నాకు విడాకులు ఇప్పించి బయటికి పంపించవచ్చు.. అని చెబుతుంది జానకి. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీలో ఉన్న భయాన్ని పోగొడతాను. నామీద మీకు నమ్మకం కలిగా నిరూపించుకుంటాను.. అని చెప్పి లోపలికి వెళ్తుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగం కోసం వెయిట్ చేయాల్సిందే.